Wednesday, 4 January 2012
మిస్ ఇండియా వాసుకి సుంకవల్లిని వద్దన్న మహేష్ బాబు భార్య?
విలేఖర్లపై విరుచుకుపడ్డ జెనీలియా
తనను నేరస్థుడిగా చూపించేందుకు సిబిఐ ...వైయస్ జగన్మోహన్ రెడ్డి
అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు...కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి
7 నుండి ధనుర్మాస పూజాసహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
ముక్కోటి ఏకాదశికి శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల
మొబైల్ ద్వారా రైలు టికెట్లు
రైలు టికెట్లను ఇకమీదట మొబైల్ ఫోన్ ద్వారానే పొందవచ్చు. తొలుత పేరును
రిజిస్టర్ చేసుకోవడంతోపాటు.. మొబైల్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉండి తగిన
సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. మొబైల్ వినియోగదారులు రైలు
టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ-టికెట్‌ను బుక్ చేసుకునే
ఈ సౌలభ్యాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియన్ రైల్వే కేటరింగ్
అండ్ టూరిజం కార్పొరేషన్’(ఐఆర్‌సీటీసీ) ఇప్పటికే ప్రయోగాత్మకంగా
చేపట్టినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా బుక్ చేసుకున్న తరువాత
ప్రయాణికులకు పీఎన్‌ఆర్, రైలు నంబర్, ప్రయాణ తేదీ, ఎక్కే తరగతితోసహా పూర్తి
వివరాలతో కూడిన రిజర్వేషన్ మెసేజ్ వస్తుంది. ఇకమీదట ప్రయాణికులు
ఈ-టికెట్ ప్రింటవుట్‌ను తమతోపాటు తీసుకెళ్లనక్కర్లేదు. ప్రయాణ సమయంలో
మొబైల్‌లో టికెట్ కన్ఫర్మేషన్‌తో కూడిన రిజర్వేషన్ మెసేజ్‌ను చూపితే చాలు.
ప్రయాణికులు ఈ విధంగా టికెట్ బుక్ చేసుకునేందుకు మొదటిసారి మాత్రమే
రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత నుంచి ఐడీ, పాస్‌వర్డ్‌ను
వినియోగించి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. దీనిని ప్రయోగాత్మకంగా
ప్రవేశపెట్టినట్టు, ప్రస్తుతానికి రోజూ వెయ్యి మందికిపైగా యూజర్లు ఈ
సదుపాయాన్ని వినియోగించుకుంటున్నట్టు రైల్వే అధికారి వివరించారు.
ఈ-టికెట్లకోసం వసూలు చేసే సర్వీస్ చార్జీని స్లీపర్ క్లాస్‌కు రూ.10, ఆపై
తరగతికి రూ.20 చొప్పున వసూలు చేస్తారు.
సచిన్ టెండూల్కర్ చౌక్‌గా మార్చవద్దు:మార్కండేయ కట్జూ
ఇక సేవింగ్స్ ఖాతాలకూ నంబర్ పోర్టబులిటీ
కొద్ది కాలం క్రితం టెలికాం రంగంలో ప్రవేశపెట్టిన నంబర్ పోర్టబులిటీని
సేవింగ్స్ బ్యాంకు ఖాతాలకు కూడా విస్తరింపచేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.
దీని వల్ల ఎస్‌బి ఖాతాలు గల కస్టమర్లు ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో
బ్యాంకుకు మార్చుకున్నా నంబర్ అదే ఉంచుకునే వెసులుబాటు కలుగుతుంది.
సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు నంబర్ పోర్టబులిటీని ప్రవేశపెట్టే యోచన ఉన్నట్టు
ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి కొన్ని సాంకేతిక
సమస్యలున్నాయని, వాటిని గుర్తించామని, పరిష్కరించే ప్రయత్నం జరుగుతున్నదని
ఆర్థిక సర్వీసుల శాఖ కార్యదర్శి డికె మిట్టల్ చెప్పారు.అంతకు
ముందు ఆయన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గోపాలన్, ఆర్థిక కార్యదర్శి
ఆర్.ఎస్.గుజ్రాల్, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసుతో
సమావేశమయ్యారు. నంబర్ పోర్టబులిటీ సదుపాయం అందుబాటులోకి తేవాలంటే బ్యాంకులు
ఐడెంటిఫికేషన్ కోడ్, నో యువర్ కస్టమర్ (కెవైసి), కోర్ బ్యాంకింగ్
సొల్యూషన్స్‌ను పూర్తి స్థాయిలో అమలు పరచాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీని
వల్ల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను మరో బ్యాంకుకు మార్చుకున్న కస్టమర్లు ఆ
బ్యాంకులో కెవైసి లాంఛనాలు పూర్తి చేయాల్సిన పని ఉండదని ఆయన తెలిపారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు మద్యం మాఫియాతో సంబంధాలు..చంద్రబాబు
నిబంధనలకు విరుద్ధంగా 31 మద్యం దుకాణాలను పీసీసీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణకు ఎలా కేటాయించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
ప్రశ్నించారు. డిస్టిల్లరీ పర్మిట్లు ఇష్టాను సారంగా ప్రభుత్వం ఇస్తోందని
ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ ముడుపు తీసుకుని మద్యం తయారీకి
అనుమతులు ఇస్తున్నారని బాబు ఆరోపించారు.చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గంలో రెండో రోజైన బుధవారం
పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్న
హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు
ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం
అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదని అన్నారు. మద్యం నియంత్రణకు తెలుగుదేశం
పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యం మాఫియాపై కాంగ్రెస్ అధ్యక్షురాలు
సోనియాగాంధీయే సమాధానం చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర
ప్రభుత్వం విచ్చలవిడి మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందని
అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మద్యం మాఫియాతో
సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన మోటారు సైకిల్
ర్యాలీలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.సిడ్నీలో ధోనీసేనకు చేదు అనుభవం
Subscribe to:
Posts (Atom)