Wednesday, 26 October 2011
తిరుమలకు బాణాసంచా తీసుకురావద్దు
హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన దీపావళీని ప్రతి హిందువు ఎంతో సంతోషంగా పిల్లాపాపలతో జరుపుకుంటారు. దీపావళీ అంటేనే బాణాసంచా కాల్చడం అన్నది భారతదేశంలోని ఎవ్వరిని అడిగినా ఇట్టే చెపుతారు. అయితే అలాంటి ముఖ్యమైన దీపావళీ పండుగ రోజు తిరుమలకు బాణాసంచా తీసుకువెళ్లకూడదంటూ టిటిడి అధికారులు హుకుంజారీ చేశారు. ఒక వెళా తీసుకువెళ్లినా పేలుడు బాణాసంచా తిరుమలకు తీసుకురాకూడదంటూ నిబందనలు విదించారు. చిన్నపిల్లలకు కాల్చే బూచక్రాలు, కాకర వత్తులు శబ్ధరహిత బాణాసంచా మాత్రమే తీసుకువెళ్లాలని ఆంక్షలు విదించారు. దీంతో స్దానికులు తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుండగా ఈ వ్యవహారంపై టిటిడి ఎస్‌ఓ ఎంకెసింగ్‌ను విలేకరులు ప్రశ్నించినపుడు దీపావళీ రోజున టపాసులు తీసుకువెళ్లడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు. ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా అలిపిరి వద్ద వున్న విజిలెన్స్ సిబ్బంది మాత్రం స్దానికులు తిరుమలకు బాణాసంచా తీసుకువెళ్లకుండా నిరోదించడంతో ఈ యేడాది స్దానికులు దీపావళికి దూరం కావలసిన పరిస్దితి ఏర్పడింది. అయితే కొంత మంది సాహాసించి దొంగచాటుగా తిరుమలకు టపాసులు తీసుకువెళ్లారు. దీంతో దొంగచాటుగా తిరుమలకు తరలివెళ్లే నిషేదిత వస్తువులను నియంత్రించడంలో అలిపిరి భద్రతా సిబ్బంది ఎప్పటికీ కొరగారని మరోమారు నిరూపితమైంది. కాగా తిరుమల ఒక హైందవ ధార్మిక సంస్ధ అయినప్పటికి హిందు పండుగలను కూడా జరుపుకోనివ్వకుండా భద్రత పేరుతో టిటిడి అధికారులు నియంత్రణ చేయడం సబబుకాదని స్దానికులు అంటున్నారు
దీపావళి సంప్రదాయ పర్వదినం
సంప్రదాయ పర్వదినం
దీపావళి సంప్రదాయ బద్ధమైన పండుగ. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది ఉదయాన్నే తలస్నానాలు చేసి, నూతన వస్త్రాలు ధరిస్తారు. ఇళ్లలో లక్ష్మీ పూజలు చేసి సంపద, సౌభాగ్యంతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తారు. పిండి వంటలు, తీపి పదార్థాలతో మధ్యాహ్నం విందు భోజనం చేస్తారు. రాత్రి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరు ఉల్లాసంగా.. ఉత్సాహభరితంగా టపాసులు కాలుస్తారు. జిల్లాలోని మార్వాడీ సేట్లు తమ వ్యాపారాలకు సంబంధించి కొత్తగా పద్దుల పుస్తకాలను దీపావళి నుంచే ప్రారంభిస్తారు. శుభం, లాభం కలగాలని లక్ష్మీదేవిని పూజిస్తారు.
విశేష పూజలు
దీపావళి సందర్భంగా దాదాపు అన్ని వైష్ణవాలయాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. దేవాలయాలను రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు, నామ పారాయణం, అలంకారాలు చేస్తారు. కొన్ని చోట్ల రాత్రి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం, జయనగర్ కాలనీలోని శ్రీదేవి, భూదే వి సమేత కళ్యాణ వేంకటే శ్వరస్వామి ఆలయం, నకాష్‌లోని శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి ఆలయం, గడ్డిజజారులోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయం,విశేషాలంకారంతో పూజలు నిర్వహించనున్నారు.

ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపు
ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నట్టు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) రీజనల్ చైర్మన్, జేఎన్‌టీయూ మాజీ వీసీ ప్రొఫెసర్ డిఎన్.రెడ్డి పేర్కొన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి తిరుపతికి వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడా రు. దేశంలో ఇంజినీరింగ్ విద్యను అందించడంలో, పెద్ద సంఖ్యలో ఇంజినీర్లను తయారు చేయడంలో మన రాష్ట్రం పొరుగు రాష్ట్రాల కన్నా ముందుందని ఆయన తెలిపారు. దేశంలో 3,500 ఇంజి నీరింగ్ కళాశాలలు ఉంటే మన రాష్ట్రంలో 717 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 13 లక్షల ఇంజి నీరింగ్ సీట్లు ఉంటే, మన రాష్ట్రంలో 3 లక్షల సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 22 వేల ఎంటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సామాన్యు లు, పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య ను అందించాలన్న లక్ష్యంతో మన రాష్ట్రం లో ఇన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు.
మరి న్ని కొత్త కళాశాలల స్థాపనకు దరఖాస్తులను ఏఐసీటీఈ ఆహ్వానిస్తోందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ లోపు దరఖా స్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయి తే మనరాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాల ల్లో నాణ్యత ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. చట్టాల్లోని లొసుగు ల వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం 1982 మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా పని చేస్తుందన్నారు. నవంబర్ మూడో వారంలో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పాస్ కావచ్చ ని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవే టు కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ర్యాగింగ్, సరైన బోధన, వసతులు లేని కళాశాలలపై ఎవరైనా ఏఐసీటీఈ వెబ్‌సైట్‌కు ు పంపవచ్చని ఆయన తెలిపారు

ప్రభుత్వ వైఖరి వల్లే రాయలసీమకు అన్యాయం
ప్రకృతి చేతిలో కాదు... ప్రభుత్వ వైఖరి వల్లే రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అన్యాయానికి గురైందని రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రా యలసీమ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో పట్ట ణంలోని పద్మశాలీయ కల్యాణ మండపంలో మంగళవారం రాయలసీమ భవిష్యత్తు ఏమి టి? అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 22 శాతం ఆదాయం లభిస్తున్నా ప్రభుత్వం ఇందులో ఒకటిన్నర, రెండు శాతానికి మించి సీమ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రాయలసీమ వెనుకబాటు తనాన్ని బట్టబయలు చేసిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన రాష్ట్రానికి 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించగా, ఈ నీటి పంపకంలో కూడా మనకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణాను ప్రకటిస్తే మిగిలిన రాష్ట్రంలో రాయలసీమకు మళ్లీ అన్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంటే, తాము సమైక్యాంధ్రలో ఉంటామని ప్రాధేయడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సిగ్గువిడిచిన మన పాలకులు విడిపోతే బతకలేమనే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని వస్తున్న డిమాండ్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు.ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందనడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీమ అభివృద్ధికి అంతో ఇంతో కృషి చేశారంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను వైఎస్‌ఆర్ విస్తరింప చేశారన్నారు. రాయలసీమ విద్యార్థి వేదిక సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎం.భాస్కర్ మాట్లాడుతూ మన ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాయలసీమ అభివృద్ధిపై ఓ ప్రణాళిక అంటూ లేదన్నారు

Subscribe to:
Posts (Atom)