Friday, 11 November 2011

రైల్వే శాఖ తత్కాల్ బుకింగ్ లో మార్పులు

 రైల్వే శాఖ తత్కాల్ బుకింగ్ లో మార్పులు చేసింది. ఇక ఒక్క రోజు ముందు మాత్రమే తత్కాల్ టిక్కెట్ ఇస్తారు. తత్కాల్ టిక్కెట్ పోగొట్టుకుంటే ఇక ముందు డూప్లికేట్ టిక్కెట్ ఇవ్వరు. ఖాయం అయిన టిక్కెట్ ని రద్దు చేస్తే ఇకనుంచి తిరిగి డబ్బు ఇవ్వరు. ఈ నిబంధనలు వారం రోజులలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది

నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెడతా: బాలకృష్ణ


శ్రీరామ రాజ్యం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, తనను ఆశీర్వదిస్తే...మరిన్ని పౌరాణిక సినిమాలు తీసి నాన్న నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెడతానని బాలకృష్ణ అన్నారు. శ్రీరామ రాజ్యం సినిమా ప్రమోషన్లో భాగంగా శుక్రవారం రేడియో మిర్చి98.3 లో వ్యాఖ్యాత అవతారం ఎత్తిన బాలకృష్ణ శ్రోతలను అలరించారు. శ్రీరాముడి పరిపాలన విలవలు, ఆనాటి కుటుంబ బాంధవ్యాలు నేటి తరానికి గుర్తు చేయడానికే శ్రీరామరాజ్యం సినిమాను చేసినట్లు తెలిపారు. దర్శకులు బాపు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. తెలుగు వినాలంటే రమణ, తెలుగు చూడాలంటే బాపు...శ్రీరామరాజ్యం రచయిత, దర్శకులను తనదైన శౌలిలో పొగడ్తలతో ముంచెత్తారు. తన తండ్రి నటించిన శ్రీకృష్ణ పాండవీయం, నర్తనశాల, సీతారామ కల్యాణం సినిమాలను రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. నర్తనశాల సినిమాను రీమేక్ చేసేందుకు పలువురు నిర్మాతలు ముందుకు వచ్చారని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు

ఆమెను మొదటి రోజు రిసీవ్ చేసుకున్న:ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో కార్తిక సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.బోయపాటి శ్రీను దర్శకత్వంలో కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సెట్స్ పై కార్తీక ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆమెను మొదటి రోజు రిసీవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఆమె దగ్గరకు వెళ్లి.. నాకు మీ అమ్మగారు రాధ అంటే చాలా గౌరవం, ఇష్టం. ఆమెతో చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు.కానీ ఆవిడ కూతురైన మీతో చేయటం చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమెతో చెప్పాడు. దాంతో కార్తిక షాక్ కి గురైంది. ఆమె కెరిర్ లో ఎప్పుడూ హీరో నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడూ ఎక్సపెక్ట్ చేయలేదు. ఇంత గౌరవంగా తనను రిసీవ్ చేసుకుంటాడని భావించని ఆమె తన సర్కిల్స్ లో ఎన్టీఆర్ ఎంత గొప్పవాడో, అతని ప్రెడ్లీ నేచర్ ఎలాంటిదో చెప్తోంది. ఇదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిష చేస్తోంది. ఈ చిత్రం ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి అభివర్ణిస్తున్నారు

త్రిష :మూడు కండిషన్లు

తనను కలవడానికి వచ్చే అభిమానులకు త్రిష మూడు కండిషన్లు పెడుతుందట. సెల్ ఫోన్ లో తనని ఫోటో తియ్యకూడదన్నది మొదటి కండిషన్. రూపాయి నోట్ల మీద ఆటోగ్రాఫ్ అడగకూడదన్నది రెండో కండిషన్. ఖాళీ పేపర్ మీద సంతకం అడగకూడదన్నది మూడో కండిషన్. సెల్ ఫోన్ లో ఫోటో తీసి, వేరే రకంగా ఉపయోగిస్తారేమోననే భయంతోనే త్రిష ఆ కండిషన్ పెట్టి ఉంటుంది. అలాగే రూపాయి నోటు విలువైనది కాబట్టి..అందులో సంతకం పెట్టనని చెప్పి ఉంటుంది. ఖాళీ పేపర్ లో సంతకం పెడితే మిస్ యూజక చేస్తారనే భయంతోనే త్రిష ఆ నిబంధన విధించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ




బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ..హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య మాత్రం మావాడికి ఇప్పుడే ఇంకా హీరో అయ్యే వయసు రాలేదు, మరికొంత కాలంగా ఆగాల్సిందే అంటూ.....మోక్షజ్ఞ టాపిక్ దాట వేస్తూ వస్తున్నారు. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ వివరాలను బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇప్పుడే మావాడు నటనలో ఓనమాలు దిద్దుతున్నాడని, నటనా రంగంలో పూర్తి స్థాయి పరిక్వత పొందడానికి మరికొంత కాలం సమయం పడుతుందన్నారు. తన వారసుడిగా మోక్షజ్ఞ తెరంగ్రేటం చేయడానికి మరో ఐదేళ్ల సమయం పడుతుందని శుక్రవారం స్పష్టం చేశారు 

తిరుమలలో టికెట్లకు ఫొటోమెట్రిక్‌ పద్దతి

తిరుపతి: తిరుమలలో దళారులకు చెక్‌ పెట్టేందుకు అధికారులు రోజుకో కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఆర్జిత సేవా టికెట్లలో దళారుల ప్రమేయం లేకుండా చేసేందుకు ఫొటో మెట్రిక్‌ పద్దతిని ప్రవేశపెట్టారు. దీంతో దళారులనే కాదు భక్తుల్ని క్యూ లైన్లలో తోస్తున్న కొంత మంది అధికారులను కూడా నియంత్రించే వీలు కలిగింది. అన్ని దర్శన టికెట్లకు ఫొటో విధానం ప్రవేశపెట్టేందుకు టిటిడి ప్రయత్నిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే భక్తుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దళారులకు తోడు కొందరు టిటిడి అధికారుల ఇష్ట్యా రాజ్యం కూడా శ్రీవారి భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు దేవస్థానం ఉన్నతాధికారులు కొత్తకొత్త విధానాల్ని వెతుకుతున్నారు ఆర్జిత సేవా టికెట్లలో దళారుల మోసాల్ని నియంత్రించేందుకు కొత్తగా ఫొటో మెట్రిక్‌ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. దీంతో భక్తులు ఇతరుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేసిన ఫొటో లేని టికెట్లు చెల్లుబాటు కావు. ఫొటో లేని భక్తుల్ని క్యూ లైన్ల నుంచి తప్పిస్తారు. వేలిముద్రలు మాత్రమే అమలులో ఉన్న విధానంలో దళారులకు తోడు కొందరు అధికారులు కూడా మధ్యలో భక్తుల్ని క్యూ లైన్లలోనికి తోసేవారు. ఫొటో పద్దతి అమలులోకి వచ్చినందున దళారుల నుంచి కష్టాలు తప్పినట్లేనని భక్తులు సంతోషపడుతున్నారు. ఆర్జిత సేవా టికెట్లలో ఫొటో విధానాన్ని ప్రవేశపెట్టినట్లే ఇతర టికెట్లకు ఫొటోమెట్రిక్‌ పద్దతిని ప్రవేశపెట్టాలని టిటిడి యోచిస్తోంది.

కర్నూలు వైద్య కళాశాలలో సీట్ల పెంపు

కర్నూలు: కర్నూలు వైద్య కళాశాలలో పీజీ సీట్లు పెంచడానికి నిధులు మంజూరు అయ్యాయని ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. భవాని ప్రసాద్ తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెంచుతున్నారు. కర్నూలు కళాశాల కు 46 సీట్లు  పెంచారు. దీనికి మొదట విడత కింద 10 కోట్లు విడుదల చేయనున్నారు.