Saturday, 22 October 2011

ఎన్టీఆర్ మాత్రం తాప్సీకి నో చెపున్నారు



జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో శృతిహాసన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. అలాగే ఆమె పదిరోజుల షూటింగ్ లో కూడా పాల్గొంది.అయితే షూటింగ్ ని ఊసరవెల్లికి బ్రేక్ ఇచ్చి ప్రారంభించటంతో ఆమె సారి చెప్పి బై చెప్పిందని సమాచారం. ఆమె తనకు డేట్స్ లేకపోవటంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆమె వాలంటరిగా టీమ్ కి గుడ్ లక్ చెప్పి బయిటకు వెళ్లటంతో ఈ మ్యాటర్ ఇష్యూ కాలేదు.

ఇప్పుడు ఆమె ప్లేసులోకి ఎవరిని తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. రాధిక కూతురు, జోష్ హీరోయిన్ కార్తీక అని, హన్సిక అని ఫిల్మిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే కాజల్ కావచ్చు అని మరి కొంతమంది చెప్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తాప్సీని హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ఈ చిత్ర నిర్మాత కెయస్ రామారావు సన్నాహాలు చేసాడట. జూ ఎన్టీఆర్ కి అయితే బల్క్ డేట్స్ కేటాయించడానికి నేను రెడీ అని తాప్సీ చెప్పిందట. కానీ ఎన్టీఆర్ మాత్రం తాప్సీకి నో చెప్పి కాజల్ కి ఓకే చెప్పినట్టు వార్తలు అందుతున్నాయి. కాజల్ కి ఎన్టీఆర్ ఓటేయ్యడంతో చేసేదిలేక ఈ చిత్ర దర్శక, నిర్మాతలు కూడా కాజల్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అలాగే సెకెండ్ హీరోయిన్ గా కూడా ఎవరిని తీసుకుంటారనేది ఇప్పటకీ తేలలేదు

కర్నూలులో రాయలసీమ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు

రాయలసీమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కర్నూలులో ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. రాయలసీమ పరిస్థితులు, అభివృద్ధిపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశానికి అఖిల పక్ష నేతలు హాజరయ్యారు. సమైక్యాంధ్రపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

అటవీ ప్రాంతాల్లో 25 చిరుతలు

                   
రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని శేషాచలం, వెలుగొండ అటవీ ప్రాంతాల్లో సుమారు 25 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని రాజంపేట డివిజనల్ ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక డీఎఫ్‌ఓ కార్యాలయంలో అటవీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ... గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా 25 చిరుతలు ఉన్నట్లు తాము నిర్ధరణకు వచ్చామన్నారు. శేషాచలం అటవీ ప్రాంతానికి తరచుగా 20 ఏనుగుల మంద వచ్చి వెళ్తుంటుందన్నారు. ఈ ప్రాణులు అటవీ ప్రాంతాన్ని దాటి శివారుల్లోకి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు

కడప: విభజిస్తే అగ్నిగుండమే

భావితరాల వారికి అన్యాయం జరగకుండా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి అన్నారు. కడపలో జరుగుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు.

విభజన జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములులాగా దీక్ష చేసినవారు తెలంగాణలో ఎవరూ లేరని ఆయన అన్నారు. కేసీఆర్ తన కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్నారని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.