Saturday, 10 March 2012

జగన్‌ను అరెస్టు చేస్తే రణరంగమే!....వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీ శ్రేణు లు వ్యూహ రచన చేస్తున్నాయి. వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టాలని యోచిస్తున్నాయి. జగన్‌ను అరెస్టు చే స్తే ఆందోళన కార్యక్రమాలను తీవ్రత రం చేసి రణరంగం సృష్టించాలనే ల క్ష్యంతో ఆ పార్టీ శ్రేణులున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల12వతేదీ నుంచి ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని పార్టీ శ్రేణులకు ముఖ్యనేతలు పి లుపునిచ్చారు. దీంతో జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైందనేది స్పష్టమవుతోం ది. అనంతపురం నగరంలోని వీకే మెమోరియల్ హాల్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో నే తలంతా ఆ మేరకు సమష్టి నిర్ణయం తీసుకున్నారు.ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పైలా నరసింహయ్య అధ్యక్షతన జరి గిన ఈ సమావేశానికి ముఖ్యనేతలతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ,మండల కన్వీనర్లు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జగన్‌కు అండగా ఉందాం. ప్రా ణత్యాగానికైనా సిద్ధపడదామని ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ని అరెస్టు చేయకుండా అడ్డుకోవడం. అరెస్టు చేస్తే ఏ విధంగా ఎదుర్కొవాలన్నదే సమావేశం ప్రధాన అజెండాగా సాగింది. అత్యవసర సమావేశంలో మాట్లాడిన నాయకులంతా ఇదే అం శంపైనే తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై తమ అధినేతను కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారనేది ఆపార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల ఇళ్లను ముట్టడించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రజాబలాన్ని కూడగట్టి జగన్ అరెస్టును అడ్డుకోవాలనే యోచనలో భాగంగా ఈనెల12న గ్రామా ల్లో పార్టీ జెండాలు ఎగురవేసి, ఆ తర్వాత మండల కేంద్రాలకు చేరుకొని ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించి పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
 

చిరంజీవికి రాజ్యసభ సీటు ఎఐసిసి చూసుకుంటుంది...డీఎల్ రవీంద్రారెడ్డి

చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చే విషయం అధిష్ఠానం నిర్ణయం మేరకే ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ సీట్లు ముఖ్యమంత్రి కిరణ్, లేదా పిసీసి అధ్యక్షుడు బొత్స లేక ఇతర మంత్రులో చెబితే ఇవ్వరని అదీ కేవలం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఉంటుందన్నారు. చిరంజీవికి సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం భావిస్తోందన్నారు. జగన్,చంద్రబాబు కుమ్మకై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ అనటం... నిన్న కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కయ్యిందని జగన్ అనటం... ఇదంతా కేవలం ఎన్నికల కోసం ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం తప్పితే ఏముందని అన్నారు. ప్రధాన పార్టీలు ఏవైనా కేవలం తమ అభ్యర్థుల గెలుపే ప్రధాన లక్ష్యంగా మాట్లాడుతారని తెలిపారు.

గుంతకల్లు నుంచి తిరుపతి ప్యాసింజర్ రైలు ప్రారంభం

గుంతకల్లు-తిరుపతి సాయంత్రపు ప్యాసింజరు రైలును శనివారం సా యంత్రం ప్రారంభించనున్నారు. డివిజన్‌లోని చిట్టచివరి మీటర్ గేజ్‌లైను లో నడచిన ఈ ప్యాసింజర్ రైలును పు నరుద్ధరణకు జిల్లా వాసుల నుంచి ఉ న్న డిమాండు కారణంగా ఎట్టకేలకు ఈ రైలు పట్టాలెక్కనుంది. గుంతకల్లు-కల్లూరు మీటర్ గేజ్ లైనును బ్రా డ్‌గేజ్‌గా మార్చే పనుల ప్రారంభ స మయంలో ఈ మార్గంలో నడచిన తి రుపతి ప్యాసింజరు రైళ్లను నాలుగేళ్ల కిందట రద్దుచేసిన విషయం విదిత మే.ఎట్టకేలకు ఆదేశాలు అందడంతో రైలును ప్రారంభించడానికి ఏర్పాట్లను పూర్తిచేశారు. శనివారం ఉదయం గుంతకల్లు స్టేషన్‌లోని 1, 2 ప్లాట్‌ఫారాలను ఏడీఆర్ఎం కృష్ణారెడ్డి, సీనియర్ డీసీఎం సుబ్బరాయుడు, ఎస్సెమ్మార్ నగేశ్, సందర్శించారు. సాయంత్రం 5-30 గంటలకు చేపట్టాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమంపై సమీక్షించారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే మధుసూధన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారు. ఏదేమైనా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ రైలును ప్రారంభించడం జిల్లా వాసులకు, బాలాజీ భక్తులకు తీపికబురే.ఈ లైను కన్వర్షన్ పూర్తయిన త ర్వాత ఉదయం 7 గంటలకు తిరుపతి వెళ్లే ప్యాసింజరును గత సంవత్సరం ప్రారంభించినా సాయంత్రం రైలును మాత్రం పునరుద్ధరించలేదు. గత రైల్వే బడ్జెట్టులో ఈ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నా, కేవలం ఉదయ పు రైళ్లను మాత్రమే ప్రారంభించారు. మరి కొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగిసి పోనుండగా సాయంత్రపు రై ళ్లనూ పట్టాలెక్కించడానికి నిర్ణయించా రు. ఈ రైళ్లకు సంబంధించిన బోగీల ను ఇటు గుంతకల్లులోనూ, అటు తి రుపతిలోనూ సిద్ధం చేశారు. తిరుప తి, గుంతకల్లు నుంచి బయలుదేరే ఈ రెండు రైళ్లనూ శనివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ రైళ్లను ప్రా రంభించడానికి యోచించినా గుంతక ల్లు అధికారులకు శనివారం సాయంత్రం వరకూ జోనల్ కార్యాలయం నుంచి తుది ఆదేశాలు రాలేదు.