Friday, 16 December 2011
ఉప ఎన్నికల ప్రచారానికి కొత్త గెటప్‌లో బాలయ్య?
తిరుపతి ప్రజాసమస్యలు గాలికొదిలేసిన... చిరంజీవి
పదవులు తప్ప ప్రజా ప్రయోజనాలు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి పట్టవని ఈసందర్భంగా ప్రజలనుద్దేసించి కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ
తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ప్రజాసమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి
దక్కించుకునే పనిలో బిజిగా వున్నారన్నారు. ఎమ్మెల్యేగా చిరంజీవి
పనికిరాడన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో తేల్చేశారన్నారు. అందుకే ఆయన ఎక్కడ
తిరిగినా మహిళలు తిరగబడుతున్నారన్నారు. ఇటీవల చింతలచేనుకు వచ్చి కనీసం
ప్రజలతో మాట్లాడకుండా అక్కడ నుండి పారిపోయిన సంఘటనలున్నాయన్నారు. నగరంలో
కనీసం దోమల నియంత్రణకు కూడా చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో చిరంజీవి
వున్నారన్నారు. ప్రజలు కూడా నేడు చిరుకు ఎందుకు ఓట్లు వేశామా? అని
బాధపడుతున్నారన్నారు. తాము గత మూడు రోజులుగా వార్డులలో తిరుగుతుంటే కుప్పలు
తెప్పలుగా వినతులు వస్తున్నాయన్నారు. వైఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో
సుభిక్షంగా వుండేదన్నారు. అయితే నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం
లేదన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండుకళ్లుగా ప్రజారంజకంగా పాలన
చేశారన్నారు. అయితే నేడు రచ్చబండ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి
ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నారన్నారు.
సమంత పై బెల్లంకొండ సురేష్ ..ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలను తేలుస్తాం: జీవిత రాజశేఖర్
చిరంజీవి బ్లాడ్ బ్యాంక్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని సినీ నటి,
దర్శక నిర్మాత జీవిత రాజశేఖర్ చెప్పారు. తమకు వచ్చిన సమన్లుపై న్యాయపోరాటం
చేస్తామని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవి
బ్లడ్ బ్యాంక్‌పై సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత చేసిన ఆరోపణలపై పరువు
నష్టం దావా వేసిన కేసుకు సంబంధించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సోమవారం
12వ తేదీన నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని
న్యాయస్థానం నమోదు చేసుకుంది. తదుపరి కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి
వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా చిరంజీవి డబ్బులకు బ్లడ్
బ్యాంక్‌లో రక్తాన్ని అమ్ముకుంటున్నారని జీవిత, రాజశేఖర్‌లు విమర్శలు చేసిన
విషయం తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై గతంలో జీవిత, రాజశేఖర్ తీవ్ర
ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. చిరంజీవి
బ్లడ్ బ్యాంకులో ఏ విధమైన అక్రమాలు జరగడం లేదని విచారణలో తేలింది. ఈ
నేపథ్యంలో జీవిత, రాజశేఖర్‌లపై అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా
వేశారు.
ఆమెకు మంత్రిగా చెయ్యాలనేది డ్రీమ్...హీరోయిన్ రోజా
ఉప ఎన్నికలంటేనే భయం!
అవిశ్వాస తీర్మానం తెచ్చిన తంటా.. అన్ని రాజకీయ పార్టీల నేతలకు నష్టాలను
వెంట తెచ్చినట్లయింది. ఎందుకంటే ఎన్నికలకు చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు
పెట్టి గెలిచినా, రెండేళ్లే పదవి ఉంటుంది. ఈ కాలంలోనే అంత
సంపాదించుకుంటామా? అంటే అదీ నమ్మకం లేదు. అందుకోసం ఆయా రాజకీయ పార్టీల
నాయకులు అంతర్మథనంలో పడ్డారు. ఉప ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల నేతలు
బయటికి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోపల మాత్రం అంతర్మధనం చోటు చేసుకుంది.
ఖర్చు తడిసి మోపెడవుతున్న ఉప పోరు పట్ల ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించేందుకు
సిద్ధపడడం లేదు. కాకపోతే పరువు ప్రతిష్ఠలు సమస్యగా మారడడంతో అటు రాజకీయ
పార్టీలు, నేతలు విధిలేకే ఈ ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయాల్సిన పరిస్థితి
ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ ఏడాది మే నెలలో జరిగిన కడప పార్లమెంట్,
పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అభ్యర్థులకు ఖర్చు
వచ్చింది. ఇప్పుడు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటే అటు అభ్యర్థులు, ఆ
యా పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకున్నాయి.
మరో ఆరు నెలలు గడుస్తే కేవలం రెండు సంవత్సరాలు మాత్రం ఎమ్మెల్యేలుగా
కొనసాగుతారు. ఈ రెండేళ్ల కాలానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని
ప్రధాన రాజకీయ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఓడిపోతే కోలుకోవడం కష్టం
అవుతుందని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు జగన్ వర్గం ఎమ్మెల్యేలు
పోటీ చేయక తప్పని పరిస్థితి అయినా వారిలో కూడా ఎన్నికల భారం ఆందోళన
కలిగిస్తున్నట్లు సమాచారం. ఈఉప ఎన్నికల ఘట్టం ముగిస్తే మరో రెండు ఏళ్లల్లో
సాధారణ ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని
అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జగన్ వర్గాన్ని జిల్లాలో కట్టడి చేయాలంటే
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బరిలోకి దిగి పరపతిని
నిరూపించుకోవలసిన సమయం వచ్చింది.
అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో సొసైటీ రద్దు!
ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలను 750కు పెంచడమే కాకుండా, అక్కడ సొసైటీ ద్వారా
పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించడానికి
వైద్య విద్యా శాఖ డైరెక్టర్ ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే సొసైటీలోనూ
కొందరిపై, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నియామకం చేసిన మరో 20 మందితో
కలిపి మొత్తం 37 మందిపై వేటు వేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్య
కళాశాల, ఆసుపత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన కొందరు ఉద్యోగులు
పనిచేస్తున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఆసుపత్రి, కళాశాలల్లో 230 మంది
ఉద్యోగులను నియమించుకోమని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఇక్కడ 210 మంది
ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 20 ఖాళీలు ఉన్నాయి. వీరందరూ ఒక
సొసైటీగా ఏర్పడ్డారు. వీరికి సొసైటీ ద్వారానే జీతభత్యాలు అందుతున్నాయి.
ఇంకా మిగిలిన 20 ఖాళీలనూ అప్పటి వైద్య కశాశాల ప్రిన్సిపాల్ భర్తీ చేశారు.
దీంతో అక్కడి నుంచి సొసైటీ కమిటీకి ప్రిన్సిపాల్‌కు మధ్య కోల్డ్‌వార్
కొనసాగుతూ వస్తోంది. ప్రిన్సిపాల్ భర్తీ చేసిన కాంట్రాక్టు ఉద్యోగులు
రెండున్నర సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా వారికి జీత భత్యాలు అందడం లేదు.
దీంతో వారు జీతాల కోసం రోడ్డెక్కడంతో ఆసుపత్రి అభివృద్ధి సంఘం నిధుల నుంచి
వీరికి ఆరు నెలల జీతాలు చెల్లించారు. అప్పటి నుంచి 18 నెలల వరకూ వీరికి
జీతాలు అందలేదు. దీంతో వీరు కొన్ని రోజులుగా ప్రభుత్వ వైద్య కళాశాల ముందు
ధర్నాకు దిగారు. అయినా పరిష్కారం కనిపించకపోవడంతో ఎమ్మెల్సీ గేయానంద్
ఆధ్వర్యంలో కొందరు సభ్యులు బుధవారం డిఎంఇని కలిసినట్లు సమాచారం. ఈ
సందర్భంగా డిఎంఇ మాట్లాడుతూ సొసైటీని రద్దు చేసి రెగ్యులర్ కాంట్రాక్టు
ఉద్యోగులుగా వీరిని నియమించడానికి చర్యలు తీసుకోనున్నామని హామీ ఇచ్చినట్లు
సమాచారం.
Subscribe to:
Posts (Atom)