Tuesday, 31 January 2012

కెప్టెన్సీ నుండి తోలగించినా నేను సిద్దం...!మహేంద్ర సింగ్ ధోని

తన బరువు బాధ్యతల మీద సంపూర్ణ అవగా హన కలిగిన వ్యక్తి ధోనీ. ఏ కెప్టెన్‌కైనా కష్టనిష్ఠూ రాలు సహజం. ఆడినా ఆడలేక పోయినా వికెట్లు తీయ లేకపోయిన సహచరులను పల్లెత్తుమాట అనకుండా తనకు కావాల్సింది ఇతరుల నుంచి రాబట్టుకోగల నేర్పరి ధోనీ. ఓటమి ఎదురవుతున్న స్థితిలోనూ మహీ నిరాశకులోనైన సందర్భం ఒక్కటీ నేను చూడలేదు. సంయమనంతో వ్యవహరిం చడమనేది ధోనీకి ఉన్న గొప్ప లక్షణం.అన్ని విభా గాల్లోనూ ఆటగాళ్లను సక్రమంగా వినియో గించుకోగలిగాడు. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ అవతారాల్లో ధోనీ మీద ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో ఒకసారి ఊహించండి. ధోనీయే అత్యుత్తమ కెప్టెననేది నా అభిప్రాయం అని అంశు మన్‌ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. భారత్‌ వరుస పరాజయాలకు ఒక్క ధోనీనే నిందించడం తగదు. కానీ ఓటమికి జట్టుతో సహా జవాబుదారీగా నిలవాలని అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు.ఆస్టేలియా టెస్టు సిరిస్‌లలో టీమిండియా ఓటిమికి భాద్యత వహిస్తూ తాను తన కెప్టెన్సీని వదులు కోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.ఇంగ్లాండ్, ఆస్టేలియాలలో ఘోర పరాజయాలను మూటగట్టుకున్నందుకు టీమిండియా జట్టు కెప్టెన్‌గా తాను భాద్యతను వహిస్తున్నానని మహేంద్ర సింగ్ ధోని ఓ ప్రముఖ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడారు. ఇంగ్లాండ్, అంతేకాకుండా ఆస్టేలియా మీడియా ముందు ధోని కెప్టెన్సీ అనేది నేను అదనపు బాధ్యతగా భావించడం లేదు. సెలక్టర్స్ నన్ను కెప్టెన్సీ నుండి తోలగించినా నేను ఆనందంగా ఆ బాధ్యతల నుండి వైదోలగడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు.
టీమిండియా కెప్టెన్‌గా ధోనీ 2007వ సంవత్సరంలో బాధ్యతలను స్వీకరించాడు. తాను కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టీమిండియా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. 28 సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా వేచిచూసిన ప్రపంచ కప్‌ని అందించిన అత్యత్తుమ కెప్టెన్‌గా ధోనీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ధోనీ క్రికెట్ ట్రాక్ రికార్డుని గనుక పరిశీలిస్తే 67 టెస్టులాడి, మొత్తం 3509 పరుగులు చేశాడు.
ఐతే ఇంగ్లాండ్, ఆస్టేలియా వరుస ఓటముల తర్వాత ధోనీ కెప్టెన్సీ‌పై చర్చనీయాంశం అయింది. ఇటీవల ఆస్టేలియా క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ టీమిండియా కొత్త కెప్టెన్‌ని వెతకాల్సిన సందర్బం వచ్చిందని పేర్కోన్నడమే కాకుండా.. ధోనీ టెస్టు క్రికెట్‌కి మరిన్ని రోజులు సమాధానం చెప్పలేడని తేలికగా కొట్టి పారేశాడు. ధోనీని విదేశంలో జరిగిన ఈ రెండు టూర్స్‌లలో గమనించినట్లేతే బ్యాటింగే కాదు.. కీపింగ్‌లో కూడా ఏమంత ప్రతిభను కనబర్చలేదు. 2011లో జరిగిన ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరిస్‌లో ధోనీ కేవలం 220 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి చూస్తే 31.40గా నమోదైంది. ఇక ఆస్టేలియా టెస్టు సిరిస్‌లో కూడా ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌లలో కేవలం 102 పరుగులు చేసి 20.40 యావరేజిని నమోదు చేశాడు. పెర్త్‌లో జరిగిన మూడవ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా అడిలైడ్ టెస్టుకి ధోనిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇండియన్ క్రికెట్ మాజీలు ధోనిని సమర్దిస్తున్నారు. నా వరకు ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్‌ అని కపిల్ దేవ్ అన్నాడు. నాలుగు సంవత్స రాల్లో కెప్టెన్‌గా ధోనీ రాణించిన విధానం అద్భు తం. 'ఇది గెలువు' అని అడిగిన ప్రతిదీ గెలిపించి పెట్టాడు. పరిమితులకు లోబ డే గెలుపును సాధించాడు. ఇప్పుడు కూడా అదే పరిమితులను గుర్తించి ధోనీ విషయంలో నిర్ణయం తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని కిరణ్ మోరే అన్నాడు.

దెబ్బతిన్న టీమిండియా

టెస్టు సిరీస్‌ను 0-4 తేడాతో ఓడిపోయిన టీమిండియాను ఆస్ట్రేలియా జట్టు కోచ్ మికీ ఆర్థర్ దెబ్బతిన్న పులితో పోల్చాడు. ఏ క్షణంలోనైనా ఎదురుదాడికి దిగుతుందని జోస్యం చెప్పాడు. అతను విలేఖరులతో మాట్లాడుతూ, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు కూడా పాల్గొనే ముక్కోణపు వనే్డ సిరీస్‌లో విభిన్నమైన భారత జట్టును చూస్తామని వ్యాఖ్యానించాడు. సురేష్ రైనా, రోహిత్ శర్మ వంటి యువ ఆటగాళ్లు బుధవారం జరిగే మొదటి టి-20 మ్యాచ్‌లో అద్భుతాలు సృష్టించే అవకాశం లేకపోలేదని అన్నాడు. విరాట్ కోహ్లీ సమర్థుడైన ఆటగాడని, రవీంద్ర జడేజా వంటి యువ ఆల్‌రౌండర్ టీమిండియాకు అండగా నిలుస్తాడని చెప్పాడు. ఆసీస్ జట్టులోనూ యువ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, కాబట్టి టి-20 సిరీస్‌తోపాటు, ముక్కోణపు వనే్డ టోర్నీ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుందని ఆర్థర్ పేర్కొన్నాడు. వికెట్‌కీపర్ హాడిన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మాథ్యూ వేడ్ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. అవసరాలను దృష్టిలో ఉంచుకొని, టి-20, వనే్డ టోర్నీలకు ఆసీస్ జట్టు ఎంపిక ఉందని స్పష్టం చేశాడు.

బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్

అయితే నియామకాల సమయానికి డీఎడ్, బీఎడ్ అంటూ సమస్యను తెరపైకి తెచ్చి ప్రతిభా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. కోర్టు వరకు వెళ్లి ఏడాదిన్నరపాటు వ్యవహారం కొనసాగి, చివరకు డీఎడ్ 30, బీఈడీలకు 70 శాతం ఎస్‌జీటీ పోస్టులను కేటాయించి నియామకాలు జరిపారు. దీంతో ఎందరో ప్రతిభ చూపిన బీఈడీ అభ్యర్థులకు పోస్టులు దక్కకుండా పోయాయి. ఆ తర్వాతనైనా ప్రభుత్వం ముందే కళ్లు తెరవలేదు. వచ్చే డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులను కేవలం డీఎడ్‌లకే అని ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు బీఈడీ చేశారు. ముందే బీఈడీ చేసిన వారు వచ్చే డీఎస్సీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చని ఆశపడి చదువుతూ వచ్చిన వారికి నిరాశే మిగిలిపోయింది. అంతలోనే టెట్ విధానం తెరపైకి తెచ్చారు. ఇందులో పాసైతేనే డీఎస్సీ రాయడానికి అవకాశం అన్నారు. అయినా అభ్యర్థులు తమ రాత ఇలా ఉందనుకుని తొలి టెట్ పోటీ పరీక్ష రాశారు. ఆనాడు బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ట్లు రెండు పేపర్స్ రాయడానికి అవకాశం కల్పించారు. జనవరిలో రెండో టెట్ చేపట్టారు. అయితే ఇందులో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పేపర్-2 మాత్రమే రాయడానికి అర్హులని నిబంధన విధించారు. అనుకున్నట్లుగానే బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీలు అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఈ బీఈడీ అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. లబోదిబోమంటూ అభ్యర్థులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఆవేశం తట్టుకోలేక ప్రభుత్వం తీరుపై ఆందోళన చేపట్టి నిరసనలు వ్యక్తం చేశారు. అసలు కథలోకి వెళితే ప్రభుత్వం రోజుకొక నిబంధన విధించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. 2008 డీఎస్సీ నోటిఫికేషన్ కామన్‌గా విడుదల చేశారు.
అయితే నియామకాల సమయానికి డీఎడ్, బీఎడ్ అంటూ సమస్యను తెరపైకి తెచ్చి ప్రతిభా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. కోర్టు వరకు వెళ్లి ఏడాదిన్నరపాటు వ్యవహారం కొనసాగి, చివరకు డీఎడ్ 30, బీఈడీలకు 70 శాతం ఎస్‌జీటీ పోస్టులను కేటాయించి నియామకాలు జరిపారు. దీంతో ఎందరో ప్రతిభ చూపిన బీఈడీ అభ్యర్థులకు పోస్టులు దక్కకుండా పోయాయి. ఆ తర్వాతనైనా ప్రభుత్వం ముందే కళ్లు తెరవలేదు. వచ్చే డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులను కేవలం డీఎడ్‌లకే అని ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు బీఈడీ చేశారు. ముందే బీఈడీ చేసిన వారు వచ్చే డీఎస్సీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చని ఆశపడి చదువుతూ వచ్చిన వారికి నిరాశే మిగిలిపోయింది. అంతలోనే టెట్ విధానం తెరపైకి తెచ్చారు. ఇందులో పాసైతేనే డీఎస్సీ రాయడానికి అవకాశం అన్నారు. అయినా అభ్యర్థులు తమ రాత ఇలా ఉందనుకుని తొలి టెట్ పోటీ పరీక్ష రాశారు. ఆనాడు బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ట్లు రెండు పేపర్స్ రాయడానికి అవకాశం కల్పించారు. జనవరిలో రెండో టెట్ చేపట్టారు. అయితే ఇందులో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పేపర్-2 మాత్రమే రాయడానికి అర్హులని నిబంధన విధించారు. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం మీద 21335 మంది అభ్యర్థులు రాశారు. ఇందులో టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రమే అర్హులు. ప్రస్తుతం అధికారిక లెక్కల మేరకు జిల్లాలో 199 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే డీఎస్సీకి ఖాళీలు చూపారు. అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులు ఈ పోస్టులకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. దీంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

Monday, 30 January 2012

కాణిపాకం ఆలయ హుండీలో వాచ్ కలకలం

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఆవరణలోని హుండీలో బాంబు ఉందని సోమవారం కలకలం రేగింది. నాలుగు గంటల ఉత్కంఠ అనంతరం ఎలక్ట్రానిక్ రిస్ట్‌వాచ్ అని తేలడంతో గ్రామస్థులు, అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.కాణిపాక వరసిద్ధి ఆలయ ఆవరణలో సోమవారం వేకువజామున ఉన్నట్లుండి టైమ్ బాంబుకు సంబంధించిన బీప్ శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆలయ హోంగార్డులు క్షుణ్ణంగా పరిశీలించగా ప్రధాన ఆలయ గర్భగుడి పక్కనే ఉన్న అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేసిన హుండీ నుంచి ఈ శబ్దం వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఉలిక్కిపడ్డ అధికారులందరూ హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకుని హుండీని పరిశీలించి, బాంబు స్క్వాడ్‌కు సమాచారమిచ్చారు. శబ్దం వస్తున్న హుండీ స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లకు ఆనుకుని ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించలేదు. నిబంధనల మేరకు తాళాలు చిత్తూరు ఏసీ కార్యాలయంలో ఉండటంతో హుండీ తెరవడానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది.తాళాలు వచ్చిన తర్వాత బాంబుస్క్వాడ్ సిబ్బంది సురేష్ ద్వారా హుండీని నెమ్మదిగా తెరిపించారు. అందులో ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచ్ కనపడటంతో ఆలయాధికారులు, భక్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో నాలుగు గంటల ఉత్కంఠకు తెరపడింది.

సిబిఐ వెనుక రాజకీయ కుట్ర...విజయమ్మ

సిబిఐ దర్యాప్తు వెనుక రాజకీయ కుట్ర కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఆరోపించారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు ఆమె ఒక లేఖ రాశారు. మే 2009కి ముందు ఏ రాజకీయ హొదా లేని జగన్మోహన రెడ్డిని విచారించడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. సిబిఐ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రులను వదిలిపెట్టి, వైఎస్ కుటుంబ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా సిబిఐ వ్యవహరిస్తోందని తెలిపారు. జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సాక్షులను సిబిఐ బెదిరిస్తోందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హొం ఎండి రంగారావుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. అతనిని కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమఆరోపించారు.రంగారావుకు బెయిలు ఇవ్వడంలో సిబిఐ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని స్పష్టమైందన్నారు. నిధులు దుబాయ్ కి తరలించిన కోనేరు ప్రసాద్ కుమారుడిపైన ఏవిధమైన చర్యలు లేవని తెలిపారు.అన్ని పార్టీలకు డబ్బు ఇచ్చానని కోనేరు ప్రసాద్ చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ వారిని విచారించకుండా, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారినే వేధిస్తున్నారని ఆ లేఖలో ప్రధానికి విజయమ్మ తెలిపారు. సిబిఐకి ఆధారాలు దొరక్కపోవడంతో విజయసాయి రెడ్డి అనుమతి లేకుండా నార్కో ఎనాలసిస్ పరీక్ష చేయించి, తప్పుడు నివేదిక సృష్టించారన్నారు.

Sunday, 29 January 2012

హార్బజన్ సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్...హార్బజన్ సింగ్

ఇండియా ఆఫ్ స్పిన్నర్ హార్బజన్ సింగ్ తన తోటి క్రికెటర్స్ యువరాజ్ సింగ్, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని క్రికెట్ అకాడమీని నెలకొల్పడంలో ఫాలో అవుతున్నాడు. ఇందులో భాగంగా 'జలంధర్' లో ఆదివారం తన క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాడు. జలంధర్‌కు అతి సమీపంలో ఉన్న సురనుస్సీ‌లో మొత్తం పది ఎకరాల స్దలంలో 'హార్బజన్ సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్' అనే పేరుతో ఈ అకాడమీని నిర్మిస్తున్నాడు. వచ్చే సంవత్సరం చివరి కల్లా ఈ అకాడమీ పూర్తిగా వినియోగంలోకి రానున్నదని తెలిపాడు. ఈ సందర్బంలో ఆస్టేలియా టూర్‌లో పరాజయం పాలైన టీమిండియా గురించి భజ్జీ మాట్లాడుతూ.. టీమిండియా త్వరలోనే పుంజుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కొన్ని సిరిస్‌లలో ఇలాంటి ఓటములు సహాజంగా జరుగుతాయని దీని గురించి బాధ పడాల్సిన అవసరం లేదన్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని అగ్రశ్రేణి జట్టులను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచామని, త్వరలోనే టీమిండియా తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

రేపు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ

22 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఒకవేళ సోమవారం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడని పక్షంలో ఫిబ్రవరి 2న విడుదలయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,139 పోస్టులు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఎ) కింద 9,569 పోస్టులు, మునిసిపాలిటీల్లోని 1,600 పోస్టులు, ఉర్దూ మీడియం నుంచి డీ రిజర్వు అయిన 314 పోస్టులు నోటిఫై చేస్తున్నారు. అయితే.. డీఎస్సీ-2008లో సెలెక్ట్ అయి హామీ పత్రాలు పొందిన అభ్యర్థులకు దాదాపు వెయ్యి పోస్టులు ఇవ్వటంతో.. ఆ మేరకు ఖాళీల సంఖ్య తగ్గనుంది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ పోస్టులు ఉంటాయి. రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) కింద మంజూరైన 38వేల టీచర్ పోస్టులను ఈ డీఎస్సీలో నోటిఫై చేసే అవకాశం లేదు. వాటికోసం కొద్ది నెలల్లో మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఏపీటెట్-2012  విడుదల
 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీటెట్-2012) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ నెల 8న టెట్-2012 జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 81,957 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,584 మంది (67.82%) పరీక్ష రాశారు. పేపర్-2కు మొత్తం 4,15,137 మంది (1,99,710 మంది మేథ్స్ అండ్ సైన్స్, 2,15,427 మంది సోషల్ స్టడీస్ ) దరఖాస్తు చేసుకోగా.. 4,02,083 (96.86%) మంది హాజరయ్యారు. ఈ సారి పేపర్-1కు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులైనందున దరఖాస్తులు, పరీక్ష రాసినవారి శాతం బాగా తగ్గాయి. తొలి టెట్‌తో పోలిస్తే పేపర్-2కు దరఖాస్తుల సంఖ్య, హాజరుశాతం పెరిగాయి.

Saturday, 28 January 2012

తెలుగుదేశంలో నేనూ జూ. ఎన్టీఆర్...హరికృష్ణ

. పార్టీలో తాను, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ క్రీయాశీలంగానే ఉన్నామని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. తాము క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని ఆరోపించే వారు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.తాను తెలుగుదేశం పార్టీని వదిలివెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టీడీపీని వదిలే ప్రసక్తే లేదని, తన ఒంటిలో ఉన్నది ఎన్టీఆర్ రక్తమని, తమ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీలోనే కొనసాగుతారని హరికృష్ణ స్పష్టం చేశారు. అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసాన్ని ఆయన ఖండించారు. సుస్థిర పాలన అందించేది ఒక్క టీడీపీయేనని, వచ్చే ఎన్నికట్లో తెలుగుదేశం పార్టీ విజయంసాధిస్తుందని హరికృష్ణ అన్నారు.పార్టీలో తాను, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ క్రీయాశీలంగానే ఉన్నామని ఆయన  మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని ఆరోపించే వారు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తాము క్రియాశీలంగా లేమనడం సరికాదని, పార్టీ కన్నా తమకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు.

నందికొట్కూరు నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్ కట్

ఇటీవలే నగర పాలిక సంస్థగా మారిన నందికొట్కూరు మేజర్ పంచాయతీ విద్యుత్ శాఖకు భారీగా బకాయి పడింది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో నందికొట్కూరు పరిధిలోని వీధిలైట్లకు విద్యుత్ కట్ చేయనున్నట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. బకాయిలు భారీగా ఉన్నాయని ఇచ్చిన నోటీసులకు స్పందన లేకపోవడంతో మొదటి దశలో అప్పటి పంచాయతీ ఇప్పటికీ నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్‌ను  తొలగించారు. నందికొట్కూరు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సుమారు రూ.కోటి బకాయి ఉందని ట్రాన్స్‌కో ఎడిఎ శ్రీనివాసులు తెలిపారు. బకాయిలు గత 15 నెలలుగా బకాయిలు పేరుకుపోయాయన్నారు. నీటి పథకాలు, విద్యుత్ దీపాలు వినియోగించి బకాయిలు చెల్లించకపోవడంతో నోటీసులు ఇచ్చామన్నారు. అయితే స్పందన లేకపోవడంతో కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశామన్నారు. నగర పంచాయతీగా మారిన తరువాత సైతం మునిసిపల్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే స్పందించకపోయిన కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. బకాయిలు త్వరగా చెల్లించని పక్షంలో వీధి దీపాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపి వేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విద్యుత్ బకాయిలు చెల్లించడంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించి బకాయిలను చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పట్టణ వీధుల్లో చీకట్లు కమ్ముకుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించడం, అవినీతికి పాల్పడటం వంటి కారణాల వల్లే బకాయిలు పేరుకుపోయాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకొని బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.

త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై!...ద్రవిడ్

భారత క్రికెట్‌కు అమూల్యమైన సేవలు అందించి, ఎన్నో కీలక సమయాల్లో క్రికెట్ల వద్ద పాతుకుపోయి జట్టుకు అండగా నిలిచిన సీనియర్ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌కు అడెలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టే బహుశా చివరి టెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 37 ఏళ్ల ద్రవిడ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తాడని అతని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసీస్ టూర్‌లో ఉన్న టీమిండియా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి టెస్టులోనూ ఓటమి ముంగిట నిలిచింది. ఈ సిరీస్‌లో ద్రవిడ్ ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 24.25 సగటుతో 194 పరుగులు మాత్రమే చేయగలగడాన్ని ద్రవిడ్ జీర్ణించుకోలేక పోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వనే్డ ఇంటర్నేషనల్స్, టి-20 ఫార్మెట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అతను, ఇక టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బహుశా అతను శనివారం మ్యాచ్ ముగిసిన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. భారత్‌ను ఓడించాలంటే ముందుగా ద్రవిడ్‌ను అవుట్ చేయాలని ప్రపంచ దేశాలు భావించేవి. జట్టుకు కొండంత అండగా ఉంటాడు కాబట్టే అతనిని అభిమానులు ‘ది వాల్’ అంటూ పిలుస్తారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్ (15,470) తర్వాతి స్థానం ద్రవిడ్‌దే. అతను 13,288 టెస్టు పరుగులు చేశాడు. 52.31 సగటుతో రాణించిన అతని ఖాతాలో 36 సెంచరీలు కూడా ఉన్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 270 పరుగులు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 164 టెస్టులు ఆడిన ద్రవిడ్ 210 క్యాచ్‌లతో ఈ విభాగంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో 1996లో తొలి టెస్టు ఆడిన ద్రవిడ్ 2005-07 మధ్యకాలంలో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా సేవలు అందించాడు. అవసరాలను బట్టి వికెట్‌కీపింగ్ బాధ్యతలను కూడా చేపట్టే సత్తావున్న ద్రవిడ్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందుకే, అతను రిటైర్మెంట్ గురించి తీవ్రంగా యోచిస్తున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ సమాచారంపై వివరణ కోరడానికి పిటిఐ ప్రయత్నించినప్పుడు అతను అందుబాటులో లేడు.ఇలావుంటే, ద్రవిడ్‌తోపాటు ఈ సిరీస్‌లో విఫలమైన మరో సీనియర్ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్‌పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు అతను రిటైర్ అయితేనే మేలని సూచిస్తున్నారు. ఇప్పట్లో అలాంటి యోచన లేదని లక్ష్మణ్ ఇటీవల ప్రకటించినప్పటికీ, ఒకవేళ ద్రవిడ్ రిటైరైతే, దాని ప్రభావం అతనిపై తప్పక ఉంటుందని అంటున్నారు. కానీ, అతని భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో తెలియడం లేదు.

తిరుమల వాసులకు శుభవార్త!

 తిరుమల వాసులకు ఇకపై స్థానికులకు శ్రీవారి దర్శనం సులభంగా దక్కనుంది. ఆర్జిత సేవల్లో ప్రత్యేక కోటా కల్పిస్తూ  జరిగిన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనిపై స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 1980లో మాస్టర్‌ప్లాన్ అమలు చేయక ముందు తిరుమలలో సుమారు 30 వేల మంది స్థానికులు ఉండేవారు. శ్రీవారి ఆలయాభివృద్ధిలో టీటీడీతోపాటు స్థానికుల పాత్ర కీలకమైంది. అప్పట్లో భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వల్ల ప్రతి మంగళవారం స్థానికులను శ్రీవారి దర్శనానికి ప్రత్యేకంగా అనుమతించేవారు. ప్రారంభంలో ఆలయ మహద్వారం, ఆ తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి స్వామివారి దర్శనానికి స్థానికులు వెళ్లేవారు. 1992 వరకు ఈ నిబంధన కొనసాగించి తర్వాత నిలిపివేశారు. దశలవారీగా చేపట్టిన మాస్టర్‌ప్లాన్ వల్ల 2003వసంవత్సరానికి 90 శాతం ఊరు ఖాళీఅయ్యింది. ప్రస్తుతం బాలాజీనగర్‌లో 1,060 నివాసాలు, పునరావాస కేంద్రంలో మరో వంద గృహాల వారు మాత్రమే ఉన్నారు. కనీసం వీరికైనా శ్రీవారి దర్శనానికి అనుమతివ్వాలని అనేక మార్లు టీటీడీకి విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో,  జరిగిన పాలక మండలి సమావేశంలో చైర్మన్ కనుమూరి బాపిరాజు, సభ్యులు, ఈవో సానుకూలంగా స్పందించారు. ఆర్జిత సేవల్లో (ఖాళీల బట్టి) స్థానికుల గుర్తింపు కార్డు, రేషన్ కార్డులు వంటిని ఆధారంగా చేసుకుని టికెట్ల కేటాయింపుల్లో ప్రత్యేక కోటా ఇవ్వాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో స్థానికులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు.

రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ పై ప్రత్యేక దృష్టి...హోంమంత్రి సబితా

రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజం నివురుగప్పిన నిప్పులా దాగి ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఆయా జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు ఆమె తెలి పారు. రాయలసీమ జిల్లాల్లో శాంతిభద్రతలు, నేరాలపై ఆయా జిల్లాల ఎస్పీలతో ఆమె తిరుపతిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఫ్యాక్షన్ సమస్యలున్న మాట వాస్తవమేనని, అందుకే ఫ్యాక్షనిజం తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీలను కోరినట్లు తెలిపారు. ఈ కేసు వెనుక ఎంతటి పెద్దలున్నా శిక్షకు గురికాక తప్పదని, చట్టం ఎవరికీ చుట్టం కాదని వ్యాఖ్యానించారు. పరిశోధనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కనుకే కేసును సీఐడీకి అప్పగించామని, భాను తప్పించుకోలేడని చెప్పారు. ఈ కేసు విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందిస్తూ, తొమ్మిదేళ్లు సీఎంగా వ్యవహరించిన బాబుకు తెలియదా? పోలీసు పరిశోధనల గురించి, భాను గురించి ఆయన వద్ద ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు అందజేసి సహకరించవచ్చు కదా? అని అన్నారు.ఫ్యాక్షనిజంతో సంబంధం ఉన్న నేతలకు కౌన్సెలింగ్ ఇవ్వడం, దుస్సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అది అదుపులో ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా సమస్య ఉన్నందున పోలీసులు, అటవీ శాఖతో కలిసి పనిచేసి మంచి ఫలితాలు సాధించారని అభినందించారు. రెండు శాఖల సమన్వయంతో సుమారు రూ.27 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోగలిగారన్నారు. దాడులకు పాల్పడుతున్న స్మగ్లర్లను ఎదిరించేందుకు అటవీశాఖకు ఆయుధాలు ఇవ్వచ్చుకదా అని మీడియా ప్రశ్నించగా, అందరికీ ఆయుధాలు ఇస్తూపోతే పోలీసులు ఎందుకు ?, వారికి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మద్దెలచెరువు సూరి హత్య కేసును ఛేదించడంలో, ప్రధాన నిందితుడైన భానుకిరణ్ అరెస్టు, కేసు పురోగతిపై కొందరు చేస్తున్న విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు

లక్ష ఎకరాల్లో అన్నదాతకు ఉపాధి

జిల్లాలో ప్రధాన వృత్తి వ్యవసా యం. అత్యధిక మండలాల్లో పంటలు వర్షంపై ఆధారపడి ఉన్నాయి. వరుణు డు కరుణించకపోతే అన్నదాత కరువు కాటుకు గురవుతాడు. పడమట మండలాల రైతులు ప్రతి యేటా కరువు బారి న పడుతూనే ఉంటారు. కరువు బారి నుండి అన్నదాతను రక్షించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద తోటలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. మొదట్లో కానుగ, అల్లనేరేడు, జెట్రోఫీ మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ జెట్రోఫీ మొక్కలు పెంచడానికి చాలా మంది సుముఖత చూపలేదు. మామిడి మొక్కల పెంపకం కోసం చాలా మంది రైతుల నుండి వినతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మామిడి మొక్కల పెంపకానికి ఉపాధి అధికారులు అనుమతించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధిహామీ పథకంలో తోటల పెంపకానికి పెద్ద పీట వేస్తున్నారు. జిల్లాలో ఇంతవరకు సుమారు లక్ష ఎకరాల్లో మొక్కల పెంపకం చేపట్టారు. ఎకరాకు సగటున రూ.62 వేలు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.650కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో తోటల పెంపకానికి మం చి స్పందన ఉంది. మరికొన్ని మండలాల్లో ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవడంలేదు. సద్వినియో గం చేసుకునే అన్నదాతకు ఉపాధి ఓ వరంగా మారింది.జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో ఉపాధిహామీ పథకం కింద మొక్కల పెంపకం చేస్తున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 969 గ్రామ పంచాయతీల్లో 22,721 మంది రైతులకు చెందిన 32,315.65 ఎకరాల్లో తోటల పెంపకం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా ఎం చుకున్నారు. ఈ ఏడాది ఇంతవరకు 6,911మంది రైతులకు చెందిన 12,674.01 ఎకరాలలో మొక్కల నాటే కార్యక్రమం జరగుతోంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1587.03 లక్షలు ఖర్చుచేశారు. మామిడితోటల పెంపకానికి ఎకరాకు మూడేళ్ళకు రూ.62వేల వంతున నిధు లు విడుదల చేస్తారు. డ్రిప్ ఇరిగేషన్‌కు అయితే అదనంగా మరో రూ.30 నుం డి రూ.40వేలు ఇస్తారు. ఒక ఎకరా విస్తీర్ణంలో సగటున 70 మొక్కలు పెంచవ చ్చు. మొక్కనాటడానికి గుంత (పిట్స్) లు తీయడం మొదటుకుని నాటడం, నీరు పోయడం, కంచె వేయ డం, ఎరువులు అన్నింటికీ ఉపాధిహా మీ పథకం కింద నిధులు ఇస్తున్నారు. ముఖ్యంగా పేద రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. కొన్ని మండలాల్లో రైతులకు అవగాహన కల్పించక పోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మండలాలు మరీ అధ్వానం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పేద రైతుల వద్దకు తీసుకెళ్ళడంలో ఉపాధి సిబ్బంది విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మండలాల్లో రైతులు ఈ తోటల పెంపకానికి దూరంగా ఉంటున్నారు. జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది

Friday, 27 January 2012

పాటించేవారు ఏరీ?

రాయలసీమ జిల్లాలో యువత ప్రమాదకర బైక్ రేసు లు.. తల్లిదండ్రుల అతి గారాబం... వాహన చోదకుల నిర ్లక్ష్యం... పరిమితికి మించిన లోడుతో వా హనాల రాకపోకలు... ఇరువైపులా ప్రయాణికులతో ఆటోడ్రైవర్ల సర్కస్ ఫీట్లు, ప్రమాదకర మలుపులు... అమ్మకాలను పెంచుకునేందుకు వాహన తయారీదారుల విన్యాసాలు.. దశాబ్దా ల నాటిరోడ్లు.. పెరుగుతున్న జనాభా.. వీటన్నిటికీ మించి రవాణా, పోలీసు శాఖాధికారులు అలసత్వంతో రహదారులు మృత్యు దారులుగా మారుతున్నాయి. ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాల పేరుతో హడావుడి చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఇప్పటివర కు ఇలాంటివి 22 వారోత్సవాలు చేసి నా అవి లెక్కగా మాత్రమే మిగిలాయి. ప్రజలకు భద్రత పట్ల అవగాహన కల్పించలేనంత వరకు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.8 నివ దేశ ఆర్థిక వ్యవస్థపై రూ. 8 వేల కోట్లు భారం దేశంలో ఏడాదికి దాదాపు 3 లక్షల కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లక్ష మందికి పైగా మృతి చెందుతున్నారు. 4 లక్షల మందికి పైగా గాయాలతో బయటపడి వికలాంగులవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల ప్రాణ, ధన నష్టం జరుగుతూ ఎన్నో లక్షల కుటుంబాలు జీవనాధారం కోల్పోయి అనాధలవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ. 8 వేల కోట్ల భారం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి నిమిషానికి ఒక్క ప్రమాదం, ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మనిషి మృత్యువు పాలవుతున్నట్లు జాతీయ రోడ్డు భద్రత కార్పొరేషన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 75 శాతం ప్రమాదాలు దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధిక భాగం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని రోడ్డు భద్రత కమిషన్ నివేదిక తేటతెల్లం చేస్త్తోంది. - డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల 75 శాతం.పాటించేవారు ఏరీ? చట్టాలు ఎంత పకడ్బందీగా తయా రు చేసుకున్నా వాటిని అమలు చేసేవారు.. పాటించేవారు కరువవ్వడంతో ఈ రోడ్డు ప్రమాదాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మృతుల్లో యువత అధికమని చెబుతున్న అధికారులే దశాబ్దాలుగా వారిని చైతన్యవంతం చేయడంలో విఫలమవుతున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీల కోసం ప్రత్యేక సెల్

తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల మాట మరచినట్టుంది. ప్రముఖుల సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలతో వచ్చేవారికి దర్శనాలు కల్పించడానికి ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేయడానికి సమాయత్తం అయింది. నాలుగేళ్ళ క్రితం తిరుమలలో చైర్మన్ కార్యాలయంగా ఉన్న డంబుల్ అతిధిగృహంలో ఎమ్మెల్యే, ఎంపీల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలతో దళారీలు రాజ్యమేలారు. జెరాక్స్ కాపీలతో వందల కొద్ది టిక్కెట్లు సంపాదించి బ్లాక్‌లో అమ్ముకున్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయడం కోసం సిఫారసు లేఖలపై టిక్కెట్లు ఇవ్వడాన్ని టీటీడీ బాగా తగ్గించింది. ఎమ్మెల్యే, ఎంపీలు లెటర్లు ఇచ్చినా నేరుగా వారు ఫోన్‌చేసి చెబితే తప్ప వీఐపీ బ్రేక్, ఇతర సేవా టిక్కెట్లు ఇవ్వకుండా నియంత్రించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేల సిపార్సు ఉత్తరాలకు మంచి రోజులు రాబోతున్నాయి. ఒక విధంగా సామాన్య భక్తులకు అన్యాయం చేయడమే. తమకు తగిన గౌరవం ఇవ్వడంలేదని ఎమ్మెల్యేలు, ఎంపీ లు బహిరంగంగా విరుచుకుపడటం, స్పీకర్ కు ఫిర్యాదు చేయడం వరకు వెళ్లడంతో వీరిని సంతృప్తి పరచడానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అభిమానులు ,ప్రజలకు ఎలా ఉండాలో ఫోన్ చేసి చెప్తా...ఎమ్మెల్యే చిరంజీవి

తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడానికి తనకున్న శక్తి సామర్థ్యాలు చాలనందునే కాంగ్రెస్‌తో జతకట్టానని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి వ్యాఖ్యానించారు.  నీతి నిజాయితీ ప్రాతిపదికగా తాను రాజకీయ రంగప్రవేశం చేశానని, సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నానని చెప్పారు. పూలేలాంటి గొప్ప నేతలను తెర మీదకు తెచ్చి సామాజిక న్యాయం గురించి తమ పార్టీ ప్రచారం చేసిన తర్వాతనే మిగిలిన పార్టీలు అనుసరించి ఆయన విగ్రహాలను పెట్టాయన్నారు.తన అభిమానులు ఎలా ఉండాలో వారికి ఫోన్ చేసి చెబుతానని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి  మీడియాతో అన్నారు. అభిమానులు పరస్పరం గొడవలకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి వాతావరణం తీసుకు రావడం మంచిది కాదన్నారు. మీ అందరికీ తెలుసునని తాను ఎప్పుడూ ఘర్షణలకు చోటిచ్చేలా మాట్లాడలేదన్నారు. అలా మాట్లాడటం ధర్మం, బాధ్యత కాదన్నారు.కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనంపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసం ఎవరి కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక శక్తి, మరో శక్తితో జత కడితే అద్భుతాలు సాధించగలనని భావించానన్నారు. అధికారాన్ని దక్కించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, చేతకాని నేతలే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చిరంజీవికి మంత్రి సి.రామచంద్రయ్య భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, సినీ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.

Thursday, 26 January 2012

బాబు డెరైక్షన్‌లో సీబీఐ...భూమా శోభానాగిరెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డెరైక్షన్‌లో సీబీఐ నడుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఏదో విధంగా ఎమ్మార్ కేసులో జగన్‌ను ఇరికించాలని చూస్తోందని ఆమె అన్నారు. ఎమ్మార్‌పై అప్పటి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలనే వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని.. ఆ సబ్ కమిటీని సీబీఐ విచారించిందా అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు, కోనేరు ప్రసాద్‌ల మధ్య ఉన్న సంబంధం రాష్ట్ర ప్రజలందరికి తెలుసున్నారు. జగన్‌కున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక రామోజీరావు నీచమైన కథనాలను రాస్తున్నారని ఆమె మండిపడ్డారు. విజయసాయిరెడ్డి కంటే ముందుగా సీబీఐ జేడీ లక్ష్మినారాయణకు నార్కో టెస్ట్‌లు నిర్వహించాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశార.సిబిఐ దర్యాఫ్తు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని మరో నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అంతకుముందు వేరుగా అన్నారు. స్టైలిష్ హోం రంగారావును వదిలేసి సిబిఐ అమాయకుడైన సునీల్ రెడ్డిని అరెస్టు ఎందుకు చేసిందన్నారు. బాబు, కాంగ్రెసు ఫిక్సింగ్ చేసుకొని రైతులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. బాబు తమ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం కంటే సునీల్ రెడ్డి అరెస్టే ప్రధానంగా ఎల్లో మీడియా వార్తలు ప్రచురించడమేమిటన్నారు

సిక్సర్ల వీరుడు యువరాజ్‌కు ఏమైంది ..?

సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ హుటాహుటిన బ్రిటన్‌ వెళ్లాడు. ఊపిరి తిత్తుల్లో ఏర్పడ్డ గడ్డ పెద్దదౌతుండడంతో చికిత్స కోసం లండన్‌లోని క్యాన్సర్‌ నిపుణులను కలవడానికి వెళ్లాడు. ఐతే భారత అభిమానులు మాత్రం యూవీ ఊపిరితిత్తుల్లో ఏర్పడ్డ ట్యూమర్‌ క్యాన్సర్‌ కణతి కాకూడదని ప్రార్థిస్తున్నారు. యువరాజ్‌ సింగ్‌ ఇంగ్లండ్‌ వెళ్లాడని అతడి సన్నిహితుడొకరు తెలిపారు. ఐతే యూవీకి ఈ అనారోగ్యం వరల్డ్‌ కప్‌ నుంచే ఉందని గతంలోనే అతని తల్లి షబ్నమ్‌ సింగ్‌ తలిపారు. అతడి ఊపిరిత్తిత్తులో గోల్ఫ్‌ బాల్‌ సైజున్న కణతి ఉందని గత అక్టోబర్‌లో జరిగిన చికిత్సలో తెలిసింది.కాని అది క్యాన్సర్‌ కణతి కాదని డాక్టర్లు తేల్చారు. ఆసీస్‌ టూర్‌కుముందు తాను ఫిట్‌గా ఉన్నానని, ఆస్ట్రేలియా తో వన్డేలు టీ20ల్లో పాల్గొంటానని కూడా బీసీసీఐ హింట్‌ ఇచ్చాడు. కాని ఇప్పుడు యూవీ హుటాహుటిన ఇంగ్లండ్‌ వెళ్లడంతో అతని అభిమానులు మళ్లీ కంగారుకు గురౌతున్నారు. ఇదిలా ఉంటే యువరాజ్‌కు పెద్ద ప్రమాదమేమీ లేదని అతడికి అందాల్సిన రిపోర్టుల్లో మరొ రిఆపోర్టు రావాల్సి ఉందని అందుకే లండన్‌ వెళ్లాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. లండన్‌లో మెడికల్‌ రిపోర్టులు వచ్చిన తర్వాత యూవీ అటునుంచి నేరుగా యూఎస్‌ వెళ్లనున్నాడు. మరింత మెరుగైన చికిత్సకోసమే యూఎస్‌ వెళ్తున్నాడని యూవీ బంధువు మీడియాకు వెళ్లడించారు. ఊపిరితిత్తుల్లో ఉన్న కణతిని యూఎస్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేసి తీసేస్తారని అన్నారు. ఒక్కసారి రిపోర్టులు చేతికి అందాక చికిత్స మొదలు పెడతారని అన్నారు. యూవీ తిరిగి కోలుకోడానికి ఆరునెలలు పడుతుండడంతో అప్పటివరకు క్రికెట్‌కు దూరమవనున్నాడు.

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ...నందమూరి బాలకృష్ణ

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు.తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవిపై హీరో నందమూరి బాలకృష్ణ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. గురువారం ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. చిరంజీవిపై ప్రశ్నించగా అందుకు బాలకృష్ణ నో కామెంట్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని బహిరంగ ప్రకటన చేసినప్పటి నుండి ఇటీవల వరకు చిరంజీవి, బాలకృష్ణల మధ్య వాగ్వుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సామాజిక న్యాయం పేరుతో పార్టీని పెట్టిన వారు ఆ తర్వాత అమ్మేసుకున్నారని, తనను ఎవడో బాలుడు అన్నారని, పార్టీ ఆదేశిస్తే తాను చిరంజీవి పైనా పోటీకి సిద్ధమని ఇటీవల వివిధ సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం చిరంజీవిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనన్నారు. మిగతా అంశాలపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ లగడపాటి రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసి మళ్లీ విజయవాడ నుంచి గెలవాలని సవాల్ విసిరారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని బాలయ్య తెలిపారు. అభిమానులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా త్యాగమూర్తుల సేవను కొనియాడారు.
నమస్తే రాయలసీమ డాట్ కాం      పాఠకులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు





పులివెందుల్లో సోలార్ వెలుగులు

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పులివెందుల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కాబోతోంది. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు దాదాపు రూ.100 కోట్లతో 38.23 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను వెల్స్‌ఫన్ కంపెనీ చేపట్టింది. ఈ పనులు ప్రస్తుతం చివరి దశలో సాగుతున్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం ఢిల్లీకి చెందిన వెల్స్‌పన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పులివెందుల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు సిద్దమైంది. అప్పుడే పులివెందుల పారిశ్రామికవాడలో 38.23 ఎకరాలు కొనుగోలు చేసింది. వెల్స్‌పన్ సోలార్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పులివెందుల్లో ఆరు నెలల క్రితం సోలార్ విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించింది. సూర్యకాంతి ద్వారా (సోలార్) విద్యుత్తును ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రం పులివెందుల్లో ప్రారంభం కాబోతోంది. వెల్స్‌పన్ సంస్థ దాదాపు రూ.100 కోట్లతో ఇక్కడ ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యుత్తు కేంద్రంలో 5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.14 కోట్ల వంతున 5 మెగావాట్లకు రూ.74 కోట్లు, అలాగే భూమి కొనుగోలు, ఇతరత్రా పనులకు మరో రూ.26 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్యానల్ బోర్డులు అమర్చే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. అలాగే దీనికి సంబంధించిన విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే విద్యుత్తును పక్కనే ఉన్న 220 కేవీఏ సబ్‌స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అందించనున్నారు. అక్కడి నుంచి ఈ విద్యుత్తును వివిధ అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ విద్యుత్తు ప్లాంట్ మరికొన్ని రోజుల్లోనే విద్యుత్తు ఉత్పత్తిని చేయబోతోంది. ఈ ప్లాంట్ విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభిస్తే జిల్లాలో విద్యుత్తు కొరత కొంతవరకు తీరనుంది.

అనంతపురం జిల్లాలో రౌడీషీటర్లుకు కౌన్సెలింగ్

మండలంలోని వడియంపేట గ్రామంలో ఇరువర్గాలకు చెందిన రౌడీషీటర్లుకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందుస్తు చర్యగా ఎస్ఐ నారాయణరెడ్డి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదుగురు రౌడీషీటర్లును గుర్తించారు. వారిని అనంతపురం డీఎస్పీ దయానందరెడ్డి ఎదుట హాజరుపరిచారు.గ్రామంలో అధిపత్యం కోసం ఇరువర్గాలు ఘర్షణలు,బెదిరింపులు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. గతంలో జరిగిన సంఘటనలు పునురావృత్తం కాకుండా చూడాలని మాజీ సర్పంచ్ పీ శ్రీనివాసులుకు సూచించారు. ప్రస్తుతం 12 సంవత్సరాల అనంతరం గ్రామంలోకి వచ్చిన రౌడీషీటర్ శ్రీరాములను తిరిగి గ్రామబహిస్కరణ చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. ముందుస్తు జాగ్రత్తగా ఐదుగురు రౌడీ షీటర్లు గంధం రవి, తలారి కాశీం, పరిశే నరసింహలు, పరిశే శ్రీనివాసులు, గంధం శ్రీరాములును తహీసీల్దార్ నాగరాజు వద్ద 50 వేల పూచీకత్తుతో బైండోవర్ చేశారు.గ్రామాల వారీగా రౌడీషీటర్లుకు కౌన్సెలింగ్- ఎస్ఐ త్వరలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి సంఘటనల జరగుకుండా ముందస్తు భాగంగా రౌడీషీటర్లు, ఫ్యాక్షన్ నేతలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. గ్రామాల వారీగా తొలుత రౌడీషీటర్లును గుర్తించి వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. అనంతరం మండలంలోని ఫ్యాక్షన్ గ్రామల్లో ఉన్న ఇరు వర్గాల నేతలకు కూడ దశలవారిగా కౌన్సెలింగ్ నిర్వహించి బైండోవర్ చేయనున్నట్లు ఆయన తెలిపారు

ర్యాగింగ్ చేయొద్దన్నందుకు దాడి

ఓ విద్యార్థిపై దాడి చేసిన కేసులో ఏడుగురు విద్యార్థులను చంద్రగిరి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న జ్ఞానేంద్రనాయుడు, సాయికృష్ణ, శరత్‌కుమార్, నిరంజన్, వినోద్, భరత్, దిలీప్‌లు స్నేహితులు. వీరందరూ నెల క్రితం మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే వీరిలో జ్ఞానేంద్రనాయుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరి మధ్యన భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాలేజీ విడిచిపెట్టిన తరువాత జ్ఞానేంద్రనాయుడు మోటార్ సైకిల్‌పై తిరుపతి వెళుతుండగా, మిగిలిన ఆరుగురు దాడి కి పాల్పడ్డారు. ఇందుకు కేఎంఎం కాలేజీకి చెందిన భరత్ సహాయం తీసుకున్నారు. దీనిపై బాధితుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన ఆ ఏడుగురిని అరెస్టు చేశారు. ర్యాగింగ్ చేయడం తగదని చెప్పినందుకు కక్షకట్టి దాడుల వరకు వెళ్లిన ఆ విద్యార్థులను చంద్రగిరి సీఐ నాగభూషణం తీవ్రంగా మందలించారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. అంతేకాక దాడికి పాల్పడ్డ విద్యార్థుల గురించి ఆయా కాలేజీల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ర్యాగింగ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Tuesday, 24 January 2012

జన గణ మన కు వందేళ్ళు పూర్తి

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదిన వేడుకలు, ఆయన విరచిత జాతీయ గీతం 'జనగణమన' వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతానికి స్వరకల్పన జరిగిన మదనపల్లి బిటి కళాశాలలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, 10 వేలమంది విద్యార్ధులతో కలిసి 'జనగణమన' గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటీ కాలేజీ ప్రహరీ గోడకై రూ.2 కోట్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన రచించిన జాతీయ గీతం భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం కొనియాడారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు.ఏ గీతం వింటే దేశవిదేశాల్లోని భారతీయుల హృదయాలు పులకరిస్తాయో. దేశంలోని 120 కోట్ల మంది లేచి నిల్చుని గౌరవిస్తారో అలాంటి జాతీయగీతాన్ని మంగళవారం మదనపల్లెలోని బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో పదివేల మంది విద్యార్థులు ముక్తకంఠంతో 20సార్లు జాతీయగీతాన్ని ఆలపించి రెండు లక్షల గళార్చన పూర్తిచేశారు.తొలుత బెంగాలీలో రచించిన ఈ గీతాన్ని మదనపల్లె బీటీ కళాశాల సందర్శనార్థం ఇక్కడికి వచ్చిన ఠాగూర్ ఆంగ్లంలోకి తర్జుమా చేయడం ద్వారా మదనపల్లెకు ఖ్యాతిని తెచ్చిపెట్టారు. జనగణమన గీతానికి ఎంతటి గౌరవం, ప్రాధాన్యత ఇస్తున్నామో, అంతటికంటే మించిన విశ్వవ్యాప్త గౌరవం కూడా దక్కింది. 1911లో మొదటిసారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ ఉత్సవాల్లో బీజేపీ జాతీయనేత, రాజ్యసభసభ్యుడు వెంకయ్యనాయుడు, చిరంజీవి, మంత్రులు రఘువీరారెడ్డి, గల్లా అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

పరిటాల రవీంద్ర వర్థంతి ఘనంగా

మాజీ మంత్రి, తెదేపా నేత పరిటాల రవి ఏడో వర్థంతి కార్యక్రమం కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలమధ్య మంగళవారం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాలఘాట్‌ వద్ద రవి భార్య సునీత, కుటుంబసభ్యులు ఆయనకు నివాళి అర్పించారు. రవి వర్థంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిటాల ఘాట్ అలంకరణకు థాయ్ లాండ్, ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా పుష్పాలు తెప్పించారు. ఇక బెంగుళూరుకు చెందిన కళాకారులు ఘాట్ ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మంగళవారం పరిటాల రవీంద్ర ఏడవవర్ధంతి మండలంలోని వెంకటాపురంలో  ఈ సందర్భంగా పరిటాల రవీంద్ర ఘాట్‌ని ప్రత్యేకంగా అలంకరించారు. పరిటాల రవీంద్రమెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదానశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదానశిబిరం నిర్వహణ బాధ్యతలను పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ చేపట్టారు. ప్రధానంగా రక్తదాన శిబిరంలో 130పడకలు ఏర్పాటు చేశారు.రక్తదానశిబిరం ద్వారా పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తదితర దాతలు ఇచ్చే రక్తాన్ని సేకరించడానికి అనంతపురం ప్రభుత్వవైద్యశాల సిబ్బంది, రెడ్‌క్రాస్‌సొసైటీ, ఆర్‌డీటీ, ఎన్టీఆర్ ట్రస్ట్, తలసీమియా సొసైటీకి చెందిన వైద్య బృందం మంగళవారం ఉదయాన్నే వెంకటాపురం చేరుకోనుంది.  ఉదయం తొమ్మిది గంటలకు రక్తదానశిబిరాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా ప్రజల గుండెల్లో స్థిరంగా నిలిచిపోయిన పరిటాల రవి తనయుడు శ్రీరామ్ ఆధ్వర్యంలో మొదటిసారి కార్యక్రమం జరుగుతుండడంతో పలువురు అభిమానులు ఉత్సాహంగా ఆయనకు మద్ధతుగా నిలిచి తమ పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు. అంతే కాకుండా పరిటాల శ్రీరామ్‌తో పరిచయం కోసం తహతహలాడుతున్నారు.

బాలయ్య - చిరు వర్గాల మధ్య ఘర్షణ

తిరుపతిలో చిరంజీవి - బాలకృష్ణ అభిమానుల మధ్య ఘర్షణ ప్రారంభమై, మంగళవారం ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెసు శాసనసభ్యుడు మెగాస్టార్ చిరంజీవికి, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణకు మధ్య మాటల యుద్ధం ఇరు పక్షాలకు మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య తిరుపతిలో ఘర్షణ ప్రారంభమై, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద బాలయ్య అబిమానులు, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పక్షాలు పరస్పరం దాడులకు దిగాయి. . కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపించారు. చిరంజీవి,

Monday, 23 January 2012

పరిటాల శ్రీరామ్ రాజకీయ ఎంట్రీపై నిర్ణయం జరగలేదు....పరిటాల సునీత

తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని పరిటాల రవి సతీమణి, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత చెప్పారు. రేపు పరిటాల రవీంద్ర ఏడో వర్ధంతి సందర్భంగా ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి శ్రీరామ్‌కు ఇంకా సమయం రాలేదని ఆమె అన్నారు. శ్రీరామ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని, చదువును పూర్తి చేయాల్సి ఉందని ఆమె అన్నారు. శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై కుటుంబ సభ్యులం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మీద, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఆధారపడి ఉంటుందని పార్టీ శాసనసభ్యురాలు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత చెప్పారు. పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం ప్రస్తుతానికి శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడే సయమం కాదంటూనే ఆమె శ్రీరామ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే సూచనను అందించారు.అనంతపురం జిల్లాలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా పరిటాల రవి కుటుంబం ఉంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీకి పరిటాల రవి మొదటి నుంచి బలాన్ని సమకూరుస్తూ వచ్చారు. ఇప్పుడు తన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడానికి పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడినట్లు సమాచారం. రాకీయాల్లోకి రావాలనే నిర్ణయమే తీసుకోనప్పుడు శ్రీరామ్ శాసనసభకు పోటీ చేస్తాడా, పార్లమెంటుకు పోటీ చేస్తాడనే విషయం ప్రస్తావనకే రాదని ఆమె అన్నారు. తమ కుటుంబం మొదటి నుంచి పేదల పక్షాన ఉందని, అందులో భాగంగానే శ్రీరామ్ తమ ఇంటికి వచ్చేవారిని కలుసుకుంటున్నారని ఆమె అన్నారు.

బాబు అనుమతి కావాలా...?వైయస్ వివేకానంద రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి సోమవారం విరుచుకు పడ్డారు. వైయస్ విగ్రహాలు పెట్టడానికి చంద్రబాబు అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ప్రజలు వైయస్‌పై అభిమానంతో విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారని, అలాంటి విగ్రహాలకు చంద్రబాబు అనుమతే కాదు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలను తీసివేయమని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. చనిపోయిన వారి గురించి అలా దురుసుగా మాట్లాడటమేమిటని, ఆయనది నోరా కాదా అన్నారు. పులివెందుల నియోజకవర్గానికి నీటి కేటాయింపులపై కూడా ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులకు రావాల్సిన నీటి కేటాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నీటిని ఏమాత్రం కేటాయించకుండా ఇప్పుడు నీరు లేదని చెప్పడం దారుణమన్నారు. ఈ విషయమై అధికారుల నుండి ముఖ్యమంత్రి వరకు తీసుకు వెళ్లినా ఫలితం లేదని, ఇందుకోసం పోరాటం చేస్తామన్నారు.

ఉప ఎన్నికలో తిరుపతి నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ...!?

తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో రాజకీయం ఇప్పటి నుంచే వేడెక్కుతోంది. చిరంజీవి రాజీనామా చేసి కేంద్ర మంత్రిగా వెళ్లిపోతే తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసు ఓటమి పాలవుతుందనే భయాలను పక్కన పెడుతూ వ్యూహాత్మకంగా చిరంజీవి ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలో తిరుపతి అభ్యర్థిగా కాంగ్రెసు నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి వారసురాలిగా తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి సురేఖ పోటీ చేసే అవకాశాలను ఆయన వర్గానికి చెందిన నాయకులు తోసిపుచ్చడం లేదు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలాబలాలపై చిరంజీవి తరుచుగా తన వర్గానికి చెందిన నాయకులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా తిరుపతి నియోజకవర్గంలో తరుచుగా పర్యటిస్తూ స్థానికులతో సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలోని వర్గ సమీకరణలపై కూడా ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం. తిరుపతి శాసనసభ నియోజక వర్గం సీటును చిరంజీవి కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కాంగ్రెసు అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తిరుపతి నుంచి తన బావమరిది అల్లు అరవింద్‌ను లేదా సోదరుడు నాగబాబును పోటీకి దించే విషయంపై కూడా చిరంజీవి గతంలో ఆలోచన చేశారని చెబుతున్నారు. అయితే, తన సతీమణి సురేఖను పోటీకి దించితే 30 శాతం బలిజ ఓటర్ల మద్దతు పొందడంతో పాటు ఇతర వర్గాల మద్దతు కూడా లభిస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. సురేఖను కాంగ్రెసు పోటీకి దింపితే టిడిపి మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తి భార్య చదలవాడ సుచరితను పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి.

చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులు

తిరుపతిలో బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. థానిక శాసనసభ్యుడు చిరంజీవిని బిఇడి విద్యార్థులు సోమవారం అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జివో నెంబర్ 3ను తొలగింప చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు పలికింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చిరంజీవి నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉదయం తిరుపతి వచ్చారు. అంతకుముందు హైదరాబాద్ నుండి తిరుపతి విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులు మూడు ఇవ్వలేమని చెప్పి అధిష్టానం సర్దుకోమని చెప్పిందని, తెలంగాణకు మరో విధంగా న్యాయం చేస్తామని చెప్పిందని అందువల్లే రెండు మంత్రి పదవులు ఒప్పుకున్నట్లు చెప్పారు.. తమ పాలిట శాపంగా పరిణమించిన ఏడో నెంబర్ జీవోను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అదే సమయంలో బయటకు వచ్చిన చిరంజీవి ఇరకాటంలో పడ్డారు. అభ్యర్థులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే ఆయన వెళ్లిపోయారు.

నా రెండో రూపం వారికి తెలియదు...బాలకృష్ణ


చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న బాలకృష్ణ చిరంజీవిపై ధ్వజమెత్తారు. తనను ఒకరు బాలుడన్నారని, తమను ఒకవైపే చూశారని, తమ రెండో రూపం వారికి తెలియదని బాలకృష్ణ హెచ్చరించారు. అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదని, సీఎం కుర్చీనే వారి జీవిత లక్ష్యమని బాలకృష్ణ అన్నారు. పార్టీని అమ్ముకున్న వారికి నాన్నగారితో పోలికా అంటూ ఆయన ప్రశ్నించారు. జిల్లాలో రెండోరోజైన సోమవారం పర్యటిస్తున్న బాలయ్య పెదవాల్తేరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పార్టీని అమ్ముకున్న వాళ్లా మమ్మల్ని విమర్శించేది అంటూ ధ్వజమెత్తారు. నాన్నగారి ఆశయాలే తమను రాజకీయాలకి ఆహ్వానించాయని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజాధనాన్ని కుటుంబానికి దోచిపెట్టిన వారి విగ్రహాలు చూడాల్సివస్తోందని, స్వప్రయోజనాల కోసం కొందరు విగ్రహాలను రాజకీయం చేస్తున్నారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలిగోటికి ఎవరూ సరిపోరని అన్నారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని, టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్సందించను: చిరంజీవి

 బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, ఆ విషయాన్ని తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు.సినీహీరో బాలకృష్ణ వ్యాఖ్యలపై తాను స్పందించనని స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. చిత్తశుద్ధితో సేవచేసినంతకాలం ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ప్రజలు పట్టించుకోరన్నారు. తనపై బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా ప్రజలు పట్టించుకోరని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. చంద్రబాబు పాలనలో బిసిలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ లో విభేదాలు ఏమీలేవని చెప్పారు. విభేదాలు అన్ని మీడియా కథనాలేనన్నారు.
నీచ రాజకీయాలకు బలి కావద్దు...లక్ష్మీపార్వతి
 
నీచ రాజకీయాలకు బలిపశువు కావద్దని సినీహీరో బాలకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సలహా ఇచ్చారు. ఈ రోజు ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నీచుడు, నయవంచకుడు అటువంటి వ్యక్తితో బాలకృష్ణ చేతులు కలపడం బాధాకరం అన్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన బాబుతో చేయి కలపడం భావ్యంకాదని బాలకృష్ణని ఉద్దేశించి ఆమె అన్నారు. తండ్రిని చంపిన వ్యక్తితో చేతులు కలుపుతావా? అని ప్రశ్నించారు. మీ తండ్రికి చేసిన నష్టాన్ని ఎవరైనా పూడ్చలుగుతారా? అని కూడా ఆమె అడిగారు. వేషాలు మార్చే చంద్రబాబుని ఎవరూ నమ్మరని చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు. నీచుడు, అవినీతిపరుడైన చంద్రబాబుతో చేతులు కలపవద్దని, చక్రవర్తి కుమారుడిలాగా తలెత్తుకు బతకమని ఆమె బాలకృష్ణకు సలహా ఇచ్చారు.

సచిన్ సెంచరీ కంటే.. భారత్ గెలుపే ముఖ్యం..గౌతం గంభీర్

‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ 100వ సెంచరీ కంటే భారత్ విజయమే ముఖ్యమని, టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే కీలకమని వ్యాఖ్యానించాడు. ఆసీస్ టెస్టు సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న క్రమంలో మంగళవారం అడిలైడ్‌లో చివరి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో చివరి టెస్టునైనా గెలిచి ‘వైట్‌వాష్’ నుంచి తప్పించుకుని పరువు దక్కించుకోవాలని చూస్తున్న టీమిండియా ఇక్కడ ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్ అనంతరం విలేఖరులతో మాట్లాడిన గంభీర్..ప్రతి టెస్టు ప్రత్యేకమేనన్నారు. గత టెస్టు జయాపజయాలకు అతీతంగా తనను తాను మార్చుకొని సహజసిద్ధమైన ఆటలోకి ప్రవేశించని ఆటగాడు క్రికెట్‌కు పనికి రాడని పేర్కొన్నాడు. కాగా, ఒకటి, రెండు టెస్టు సిరీస్‌లలో విఫలం చెందినంత మాత్రానా చెడుగా భావించడం సరికాదని, ఇంగ్లాండ్, ఆసీస్ సిరీస్‌ల ముందు భారత్ ప్రపంచ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశాడు. ఇక సచిన్ తెండూల్కర్ సెంచరీపై స్పందిస్తూ సచిన్ సెంచరీ సాధించడం కంటే జట్టు గెలిస్తేనే తనకు అమితానందమని, ఓ దేశం కోసం ఆడుతున్న సమయంలో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానే్న ఆటగాడు కోరుకోవాలన్నాడు. సచిన్ సెంచరీ చేయలేదన్న బాధ కంటే నాలుగు టెస్టుల సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకోవడమే అధికంగా బాధిస్తోందని, చివరి టెస్టులో సచిన్ సెంచరీ కన్నా జట్టు 1-3 తేడాతో విజయం సాధిస్తేనే ఆనందమన్నాడు. సచిన్ సెంచరీ సాధించి, చివరి టెస్టులో ఓటమిపాలైతే అది తమకు ఆనందం కలిగించబోదన్నాడు. మరోవైపు తొలి మూడు టెస్టుల్లో దూకుడు మీదున్న ఆసీస్‌ను చివరి టెస్టులో కట్టడి చేసి విజయం సాధిస్తామనే ధీమాను ఈ సందర్భంగా గంభీర్ వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో వనే్డ సిరీస్ ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్ విధానంపై స్పందిస్తూ తాము స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నామని, ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ఆ విధంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారన్నాడు. అయితే ఈ పర్యటనలో తన ఫాం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడీ ఢిల్లీ బ్యాట్స్‌మన్. ఓపెనర్‌గా ఉన్న తాను పేలవమైన ప్రదర్శననిస్తున్నానని అంగీకరించాడు. అయితే ఓపెనర్‌గా దిగుతుండటంతో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, బంతి బాగా బౌన్స్ అవుతోందని వివరించాడు

Sunday, 22 January 2012

టిడిపి పార్టీ ఆదేశిస్తే చిరంజీవిపై పోటీ చేస్తా...బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే .. చిరంజీవిపై పోటి చేయడానికి సిద్ధమని బాలకృష్ణ స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న బాలకృష్ణ పాడేరులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ తాను పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పాడేరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా అంతకుముందు తాను ఏ ప్రాంతం నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని బాలకృష్ణ చెప్పారు. ఆయన విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. ఏ ప్రాంతమైనా తనకు ఫర్వాలేదన్నారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రజాధరణ ఉందని చెప్పారు. సినిమాల్లో రాష్ట్ర ప్రజలు తనపై ఎంతగా ఆదరణ చూపారో అదే ఆదరణ రాజకీయాల్లోనూ తనపై ప్రజలు చూపాలని కోరుకుంటున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టిడిపికి పట్టం కట్టడం ఖాయమన్నారు. కాగా బాలయ్య రాక సందర్భంగా విశాఖలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీలో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. కాగా ఇటీవల బాలకృష్ణ రాజకీయ పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు బాలయ్య పక్షం రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనలో విస్పష్ట ప్రకటన చేశారు. అప్పటి నుండి పలుమార్లు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎంపీగా కాకుండా అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని చెప్పారు. బాలయ్య ఎక్కడి నుండి పోటీ చేసినా స్వాగతిస్తామని ఆయన అభిమానులు, టిడిపి క్యాడర్ చెబుతోంది.

24న జాతీయగీతం జనగణమన వందేళ్ల ఉత్సవం

జాతీయగీతం జనగణమనకు వందేళ్లు, విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె బిటి కళాశాల ప్రిన్సిపల్ తులసీరామ్‌నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 24న జనగణమన జాతీయగీత వందేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిప్యూటి సిఎం దామోదర్ తో పాటు 10మందికి పైగా కేంద్ర, రాష్టమ్రంత్రులు, చిరంజీవి, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉత్సవానికి హాజరవుతున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాష వెల్లడించారు.  విశ్వకవి రవీంద్రుడు ఆరురోజుల పాటు మదనపల్లె బిటి కళాశాలలో బసచేసిన ప్రదేశాలు, నాడు జనగణమన గేయానికి బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి ట్యూన్‌చేసి గీతాన్ని మొదటిసారిగా అప్పటి విద్యార్థులచే ఆలపించిన ప్రదేశాలను సిఎం, గవర్నర్‌లు పరిశీలించనున్న దృష్ట్యా వాటిని అధికారులు పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్ ల్యాండ్ స్థలం కోసం బెంగళూరురోడ్డులోని బిటి కళాశాల ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం జరిగే సిఎం బహిరంగ సభ కోసం పుంగనూరురోడ్డులోని మిషన్‌కాంపౌండు ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథిగృహం, ఎమ్మెల్యే స్వగృహాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సిఎం మదనపల్లె పట్టణంలో ఉంటున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాష స్థానిక విలేఖరులతో మాట్లాడారు. జనగణమనకు వందేళ్ళు, విశ్వకవి రవీంద్రునికి 150 జయంతి ఉత్సవాలను ఈనెల 24న ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 24న మధ్యాహ్నం 2గంటలకు ప్రజలందరూ ఒకేసారి జనగణమన జాతీయగీతం ఆలపించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సత్యసాయి సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్‌కు విద్యుత్ సబ్సిడీ రద్దు

లక్షలాది మంది రోగులకు ఉచిత వైద్య సేవలందించే సత్యసాయి సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్‌కు ప్రభుత్వం భరించే విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. జిఓఆర్‌సి నెం.9 మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను 1992లో ప్రారంభించారు. రోగుల నుండి ఒక నయాపైసా వసూలు చేయకుండా సేవలందిస్తున్న దృష్ట్యా విద్యు త్ సబ్సిడీని ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం 98 1993 ఏప్రిల్ 26 నుంచి ప్రభుత్వమే చెల్లించేది. ఇది సుమా రు రెండు దశాబ్దాలుగా ఈ ప్రక్రియ అమలవుతోం ది. ఇప్పటి దాకా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ విద్యు త్ వినియోగానికి అనుగుణంగా ట్రాన్స్‌కోకు రూ. 4.2 కోట్లు ప్రభుత్వపరంగా సబ్సిడీ మొత్తం చెల్లించాల్సి వుంది. గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై ట్రాన్స్‌కో సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్టుపై వత్తిడి తెస్తూ నోటీసులు సె తం జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ట్రస్టు కూడా ప్రభుత్వపరంగా విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయాలని కూడా తమ లేఖలో పలుమార్లు కోరింది. అయితే అనూహ్యంగా ప్రభు త్వం విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ శనివారం అధికారికంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో విద్యుత్‌ను వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్న దృష్ట్యా కొనుగోలు వ్యయం 86% చేరిందని, ఈ క్రమంలో సబ్సిడీని వినియోగదారుడే భరించాలి తప్పా ట్రాన్స్ కో భరించే స్థితిలో లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఈ అంశంపై ఎంతో కూలంకషంగా పరిశీలించిన పిమ్మట, ట్రాన్స్‌కో పంపిన ప్రతిపాదన మేరకు శ్రీ సత్యసాయి వైద్య విజ్ఞాన సంస్థకు భరించే విద్యుత్ సబ్సిడీని 2009 సంవత్సరం నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ట్రాన్స్‌కో ఎండి తన ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. జిఓ ఆర్‌సి నెం 9 మేరకు ఈ విద్యు త్ సబ్సిడీ రద్దు ప్రక్రియ అమలులోకి వస్తుందని వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వపరంగా సబ్సిడీ రద్దయితే ప్రతి నెల సూపర్‌స్పెషాలిటి హాస్పిటల్ వర్గాలు రూ. 16 లక్షల వంతు న విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వుంటుంది. హాస్పిటల్‌లో వినియోగించే విద్యుత్‌లో యూనిట్‌కు రూ.4 వంతున వసూలు చేసే మొత్తంలో రూ.3.70 పైసల వంతున ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుండగా 30పైసల వంతున హాస్పిటల్ వర్గాలు విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రక్రియ నేటి దాకా కొనసాగుతోంది. ప్రతి నెల సుమారు రూ. 16 లక్షల మేర బిల్లులు రానుండగా ఇందులో రూ. 3 లక్షల వంతున సత్యసాయి సూపర్ స్పెషాలిటీ వర్గాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం విద్యుత్ బిల్లుల మొత్తాన్ని హాస్పిటల్ వర్గాలే భరించాల్సి వుంటుంది. సత్యసాయి శివైక్యం పొందిన తదుపరి ఈ పరిణామం చోటుచేసుకోవ డం పుట్టపర్తి ప్రజలను ద్రిగ్భాంతికి గురిచేసింది. లక్షలాది మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్‌కు విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం అన్యాయమంటూ స్థానికులు ఆక్రోశిస్తున్నారు

Saturday, 21 January 2012

నాగచైతన్య సరసన నటుడు శరత్ కుమార్ కుమార్తె!


 నాగచైతన్య, రాధామోహన్ దర్శకత్వంలో త్వరలో ‘గౌరవం’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. అయితే అధికారికంగా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది. వరలక్ష్మి ఇప్పటికే తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయి నటన, అందం విషయంలో మంచి మార్కులే కొట్టేసింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగు, తమిళం రెండు భాషల్లోనే నాగచైతన్య గౌరవం చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆటో నగర్ సూర్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాధా మోహన్ దర్శకత్వంలో ‘గౌరవం’ అనే చిత్రంలో నటించనున్నారు. గౌరవం చిత్రంలో నాగార్జన తొలి సారిగా నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడు.

పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా...జూ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన తాజా సినిమా ‘దమ్ము’చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. దమ్ము చిత్రం యూనిట్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని...ఒక పాత్రలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం. హీరోయిన్ కార్తీక ఇందులోని ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా...పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే యాక్షన్ సన్ని వేశాలను ఫర్ ఫెక్ట్ గా తెరకెక్కించారని, ప్రస్తుతం టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ప్రస్తుతం దమ్ము చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

చిరంజీవితో ఏ విధమైన విభేదాలు లేవు...డిఎల్

తిరుపతి శానససభ్యుడు చిరంజీవితో ఏ విధమైన విభేదాలు లేవని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విలీనం తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో భాగమని ఆయన అన్నారు. సి. రామచంద్రయ్య విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన చెప్పారు. రామచంద్రయ్య తనకు మంచి మిత్రుడని ఆయన చెప్పారు. కడప జిల్లా కాంగ్రెసులో కూడా విభేదాలు లేవని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పార్టీలో ఆధిపత్య పోరు సాగుతోందనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించడానికి మాత్రమే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తారని ఆయన చెప్పారు. రామచంద్రయ్య విషయంలో శాసనసభ్యుడు వీరశివా రెడ్డి ఢిల్లీలో చెప్పినప్పుడు తాను హైదరాబాదు వస్తున్నానను, కూర్చోబెట్టి మాట్లాడిస్తానని ఆజాద్ చెప్పారని, తనకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు కాబట్టి తనను కూర్చోబెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రామచంద్రయ్యకు అన్ని వర్గాలతో మంచి సంబంధాలున్నాయని, అన్ని వర్గాల గురించి రామచంద్రయ్య ఆలోచిస్తారని ఆయన అన్నారు.

తాజా టెస్ట్‌ ర్యాంకింగ్‌లలో టాప్‌ టెన్‌లో ఇండియన్స్‌ ఇద్దరే



అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి) విడుదల చేసిన తాజా టెస్ట్‌ ర్యాంకింగ్‌లలో బ్యాటింగ్‌ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుండగా బౌల ర్లలో జహీర్‌ ఖాన్‌ ఒక స్థానం పతనమై తొమ్మిదవ స్థానంలో నిలి చాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ జాబితాలలో టాప్‌ టెస్‌లో ఉన్న భారతీయులు వారిద్దరే. నంబర్‌ వన్‌ ఇంగ్లండ్‌పై మొదటి టెస్ట్‌ లో పాకిస్తాన్‌కు పది వికెట్లతో విజయాన్ని దక్కించిన తరు వాత ఆఫ్‌ స్పిన్నర్‌ సరుూద్‌ అజ్మల్‌ ప్రపంచంలో అత్యున్నత ర్యాంకులో ఉన్న స్పిన్నర్‌ అయ్యాడు. ఈ టెస్ట్‌ దుబాయిలో మూడు రోజులలో ముగిసింది. 34 ఏళ్ల ఫైసలాబాద్‌ వాసి అజ్మల్‌ 55 పరుగులకు 7 వికెట్లు, 42 పరుగులకు 3 వికెట్ల తో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకోవడమే కాకుం డా నంబర్‌ 3 ర్యాంకును కూడా సాధించాడు. పాకిస్తాన్‌ తరఫున తన 18వ టెస్ట్‌లో రెండవ సారి పది వికెట్లు తీసుకు న్న సరుూద్‌ అజ్మల్‌ ఏకంగా తొమ్మిది స్థానాలు పురోగమించా డని, అతను ఇంగ్లండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ను మూడు నుంచి నాలుగవ స్థానానికి నెట్టాడని ఐసిసి ఒక ప్రకటనలో తెలియజేసింది. దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టీన్‌ మొదటి స్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్స న్‌ రెండవ స్థానంలో ఉన్నాడు. దుబాయిలో ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌లో 89 పరుగులకు నాలుగు వికెట్లు తీసుకున్న మరొక పాక్‌ స్పిన్నర్‌ అబ్దుర్‌ రెహ్మాన్‌ ఐదు స్థానాలు పురోగ మించి 14వ స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ల ర్యాం కింగ్‌లలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌లకు శుభవార్త ఏమీ లేదు. ఇంతకు ముందు వరుసగా 3,4 స్థానాలలో ఉన్న అలస్టెయిర్‌ కుక్‌, ఇయాన్‌ బెల్‌ వరుసగా రెండు, మూడు స్థానాలు పతన మయ్యారు. కెవిన్‌ పీటర్సన్‌ టాప్‌ 10లో స్థానం కోల్పోయాడు. అతను ఆరు స్థానాలు పతనమై 16వ స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌ కూడా ఆరు స్థానాలు పతనమై 34వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌లలో వికెట్‌కీపర్‌ మాట్‌ ప్రయర్‌, స్వాన్‌ మాత్రమే పురోగమించారు. ప్రయర్‌ ఒక స్థానం ముందుకు జరిగి 18వ స్థానంలోను, స్వాన్‌ 11 స్థానాలు పురోగమించి 64వ స్థానంలోను నిలిచారు. పాక్‌ బ్యాట్స్‌మ న్‌లలో యూనిస్‌ ఖాన్‌ నాలుగవ స్థానానికి, కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ 14వ స్థానానికి, మహమ్మద్‌ హఫీజ 30వ స్థానానికి పురోగ మించారు. బ్యాట్స్‌మన్‌ల జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార్‌ సంగక్కార మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాక్విస్‌ కలిస్‌ రెండవ స్థానంలోను, ఎబి డివిలీర్స్‌ మూడవ స్థానంలోను ఉన్నారు.

ఎల్లప్పుడు మా కుటుంబం కార్యకర్తల కోసం..భూమా

కార్యకర్తల కోసం మా కుటుంబం ఎల్లప్పుడు పాటు పడుతుంటూనే ఉంటుందని భూమా దంపతులు అన్నారు.  పట్టణంలోని భూమా స్వగృహంలో శిరివెళ్ళ మండలం నుండి భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు భూమా దంపతులకు మద్దతు తెలిపేందుకు ఆళ్లగడ్డ పట్టణానికి వచ్చి వారిని కలిశారు. ఈ సందర్భంగా భూమా దంపతులు మాట్లాడుతూ ఈ రోజు మామీద అభిమానంతో ఇంత మంది ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీరు చూపించే ఆదరాభిమానాలు చాలా గొప్పవని అన్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా శిరివెళ్ళలో మీరు చూపించిన ప్రేమ నేను మరచి పోనని భూమా అన్నారు. పార్టీ అభివృద్ధిపై మీరు బాధ్యత తీసుకోవాలన్నారు. పదవి ఉన్న, లేకపోయిన ప్రజలకు అండగా ఉంటామని వారు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో వైఎస్సార్ పార్టీకి సంఘీభావంగా ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు. అందుకు మీకు అండగా ఉంటామని ముస్లిం సోదరులకు భూమా దంపతులు హామీనిచ్చారు. ఓట్లు మఖ్యం కాదని ప్రజల ఆదరాభిమానాలు ముఖ్యమని వారి అండే మాకు కొండంత అండని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శిరివెళ్ళ మండలానికి చెందిన ఖాజాహుస్సేన్, అబ్దులుఖదుర్సు, చాంద్‌భీ, సలాం, నబీరసూల్‌తో పాటు మరో 200 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్సీ నాయకులు బివి.రామిరెడ్డి, భూమా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 విగ్రహాలపై చెయ్యేస్తే రాజకీయ సమాధి
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చేయి పెడితే రాష్ట్ర ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి కడతారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడ జరిగిన వార్డుబాట కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఆరోపించారు. ఎన్‌టీఆర్ చనిపోయి 16 సంవత్సరాలు కావస్తున్నా తన సొంత ఊరు నారావారిపల్లెలో ఆయన విగ్రహం పెట్టించాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదన్నారు. అన్న తీరు నచ్చక ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. ప్రజల గుండెల్లో దేవుడిలా కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డిని వారి గుండెల నుంచి చెరిపేసేందుకు చంద్రబాబు నానా రకాల పాట్లు పడుతున్నారని విమర్శించారు.

జెసి బ్రదర్స్ రాజకీయడ్రామా

రాయదుర్గం నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జిగా గుణపాటి దీపక్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించడంతో జిల్లా లో జెసి బ్రదర్స్ ఆడుతున్న రాజకీయడ్రామా బహిర్గతమయ్యిందని డిసిసి అధ్యక్షులు పాటిల్ వేణుగోపాలరెడ్డి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పాటిల్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లా లో గత సంవత్సరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను ఓడిపోడానికి ము ఖ్యంగా జెసిబ్రదర్స్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ఎన్నికలకు మూడురోజుల ముందు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో జెసి బ్రదర్స్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకే జెసి ప్రభాకరరెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డిని ఈరోజు నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రాధాన్యతను ఇచ్చారని వివరించారు. తనను ఓడించాలన్న ధ్యే యంతోనే ఇలాంటి రాజకీయకుట్రను నాటకీయంగా నడిపిన జెసి బ్రదర్స్‌పై ఎన్నికల సమయంలోనే వదంతులు వచ్చాయని ఆ వదంతులు నేడు నిజం అయ్యాయని తెలిపారు. ఈ నియోజకవర్గంలో దీపక్‌రెడ్డితో రాజకీయ అరంగేట్రమ్ చేయించాలన్న కుట్రపూరిత రాజకీయ పన్నాగమే నేడు బహిర్గతమయ్యిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోవుంటూ అనేక పదవులను అనుభవించిన జెసి దివాకరరెడ్డి పార్టీకి ద్రోహంచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగావున్న తనను ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్న జెసి దివాకరరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంపై తాను తీవ్రంగా మనస్థాపం చెందానని ఇలాంటివి భవిష్యత్తులో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకు జరుగరాదని అన్నారు. ఈ విషయంలో అప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని కాని అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సివుందని పాటిల్ వేణుగోపాలరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు


ఈనెల 30న తిరుమలలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ రోజున భక్తులందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యాన్న ప్రసాదం అందజేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూరగాయలు అందించడానికి దాతలు ముందుకొచ్చారు. నిత్యాన్న ప్రసాద సముదాయంతో పాటు తిరుమలలోని యాత్రిక వసతి సముదాయాల్లోనూ భక్తులకు అన్నప్రసాదాలు పంచి పెట్టాలని నిర్ణయించారు. తిరు వీధుల్లో ఉదయం నుంచి రాత్రి వాహన సేవ ముగిసేంత వరకు తాగునీరు, మజ్జిగ తదితరాలను అందించనున్నారు.సూర్యజయంతిగా పిలిచే రథసప్తమి రోజున స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. దీనికోసం ఆ వాహనాలను టీటీడీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సుకు ఆలయానికి అనుసంధానంగా ఉన్న కదిలే వంతెనలో లోపాలు సరి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

Friday, 20 January 2012

అనంత రైతు ప్రత్యామ్నాయం ఏంటి...?

‘సబ్సిడీలు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని అడగంలేదు. ఉచిత పథకాలు కూడా అవసరం లేదు. మాకు కావాల్సింది సాగునీరు మాత్రమే ’ - కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ రైతుల నివేదన
 ‘జిల్లా వాతావరణానికి అనువైన వంగడాలు రూపొందించాలి. సాగునీటి లభ్యత పెంచి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూడాలి ’- కంబదూరు మండలం ములకనూరు గ్రామ రైతుల వినతి
‘‘ప్రత్యామ్నాయ పంటలు పండించమని సలహాలు ఇస్తున్నారేగాని పండిన తర్వాత ఆ పంట ఉత్పత్తులు ఎక్కడ విక్రయించుకోవాలో ఎవరూ చెప్పడం లేదు. ధర లేకపోతే పంటలు పండించి ప్రయోజనం ఏమిటి’ 
- గాండ్లపెంట మండలం కమతంపల్లి గ్రామ రైతుల ఆవేదన. 
ఇవి అనంతపురం రైతులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి మొర పెట్టుకొన్న సమస్యలు.. జిల్లాలోని వ్యవసాయరంగ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న కేంద్ర అత్యున్నత సాంకేతిక కమిటీ రెండో రోజు గురువారం పది మండలాల్లో పర్యటించింది. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలోని పంట పొలాలను ఏకే సింగ్ పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు చెప్పారు.  పూర్తి వర్షాధారంతో వ్యవసాయం చేస్తున్న రైతులకు సామూహిక(సమష్టి) సాగు విధానం మేలు చేకూర్చుతుందని కేంద్ర బృందం చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధన కౌన్సిల్ డిప్యూటీ డెరైక్టర్ ఏకే సింగ్ అభిప్రాయపడ్డారు. నిపుణుల సలహాలు ఇలా ఉన్నప్పటికీ అనంత రైతులకు అవసరం అయినవి ఎన్నో చేయాల్సి ఉంది. 
చీడపీడల నుంచి పంటలను సంరక్షించుకోవడానికి తక్షణ సలహాలు, సూచనలు ఇచ్చే నిపుణులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి... పండించిన పంటను స్థానికంగానే గిట్టుబాటు ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది...  ప్రధానంగా నీటిలభ్యత తక్కువుగా ఉన్నందున స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలి... నాణ్యమైన విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు..వారికి మేలురకం విత్తనాలు అందచేయాలి... రైతులు కూడా  ఉద్యాన పంటలతోపాటు పశుపోషణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..... పంటల సాగుకు నీటి లభ్యతలేని ప్రాంతాల్లో పాడిని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది 

రైతులు కూడా కేంద్ర పర్యటక బృందానకి కొన్ని ఫిర్యాదులు చేశారు..స్థానికంగా వ్యవసాయాధికారులు తమకు అందుబాటులో ఉండరన్నారు.. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. భూమిలోని తేమతోపాటు వాతావరణంలోని తేమను గ్రహించే వంగడాలతోపాటు సాగునీరు అందచేయాలని కోరారు. కర్ణాటకలో లీటరు పాలకు నాలుగు రూపాయలు అదనంగా ఇస్తున్నారని, ఆ ధరను ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉందని రైతులు విన్నవించారు.  పలువురు రైతులు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే ఆ పంటలు ఎక్కడ విక్రయించుకోవాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. డ్రిప్, స్పింక్లర్లకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా సబ్సిడీ విధానం అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర కమిటీ కూడా స్థానిక అదికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల 
తీరుపై సరిగా లేదని  కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులకు సలహాలు,సూచనలు అందజేయాల్సిన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదని కమిటీ అభిప్రాయపడింది. మూడు బృందాల సభ్యులకు ఆయా శాఖల అధికారుల వైఖరిపై పలు ఫిర్యాదు అందాయి. క్షేత్ర స్థాయిలో కూడా కమిటీ సభ్యులకు ఎదురైన అనుభవాలతో ఆయా శాఖల అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారని గుర్తించినట్లు కమిటీలోని ఒక శాస్త్రవేత్త తెలిపారు. కాగా డాగర్ నేతృత్వంలోని బృందం గురువారం సాయంత్రం పుట్టపర్తిలో బాబా సమాధిని సందర్శించింది.

పశుగ్రాసం పెంపకంలోకడప జిల్లాకు రెండోస్థానం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశుగ్రాసం పెంపకంలో కడప జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిందని పశు సంవర్ధక శాఖ జేడీ విజయ్‌కుమార్ అన్నారు. స్థానికంగా పశువైద్యశాలను  ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కరువును దృష్టిలో ఉంచుకొని చెరువులలోని మిగులు నీటితో పశుగ్రాసం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 40 చెరువులను గుర్తించామన్నారు. కరువు తీవ్రత దృష్ట్యా పశుగ్రాసం నిల్వ చేసేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున 50 పాతర గుంతలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో మొక్క జొన్న, జొన్న పైరును కటింగ్‌చేసి పాతర గుంతలలో వేసి వాటిపై బెల్లం పానకం చల్లితే మూడు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చన్నారు. అలాగే జిల్లాకు 404 మినీ డెయిరీలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 10మినీ డెయిరీలు ఏర్పాటు చేశామన్నారు. పాడి పశువుల పెంపకానికి జిల్లాకు రూ..85లక్షలు మంజూరయ్యాయని, ఇందులో రూ..65లక్షలతో పాడి పశువులను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించామని చెప్పారు. అలాగే జిల్లాకు 91 గొర్రెల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని, ఇందుకు రూ..12లక్షల సబ్సిడీ విడుదలైందన్నారు. దీని ద్వారా 50శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు గొర్రెలను ఇస్తున్నామన్నారు. అంతేకాక జిల్లాకు కోళ్ల పెంపకానికి రూ..40లక్షలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 1800మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 6కోడి పిల్లల పెంపకం కేంద్రాలను కడప 2, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో లబ్ధిదారునికి ఉచితంగా 45కోళ్లను అందిస్తామన్నారు. అలాగే ఆర్‌కేయూవై పథకం కింద జిల్లాకు 220 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ..28వేలు ఇస్తున్నామని, ఇందులో రూ..14వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఇప్పటివరకు 110 యూనిట్లను లబ్ధిదారులకు ఇచ్చామని వివరించారు. అనంతరం ఆయన పశువైద్యశాలలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీ ప్రసాదరావు పాల్గొన్నారు.