విజయనగర రాజుల పాలన కారణంగా ముస్లింరాజుల ప్రభావం రాయలసీమలో బాగా తక్కువ. దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఈ రాజులు రాయలసీమ ప్రాంతంలోని హంపిని కేంద్రంగా చేసుకుని పాలించడం మూలాన, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు ఉండటం వలన ఇక్కడి ప్రజల భాషలో, వ్యవహారంలో, ఆహార పద్ధతుల్లో వాటి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు పైన తమిళ ప్రభావం, కర్నూలు, అనంతపురం ల పైన కర్ణాటక ప్రభావం ఉంటుంది.
కడప- భాషా ప్రయోగం
అనంతపురం - భాషా ప్రయోగం
కర్నూలు - భాషా ప్రయోగం
కర్నూలు పట్టణం లో వాడే భాష పైన మహబూబ్ నగర్ ప్రభావం ఉంటుంది. జిల్లాలోని మిగతా ప్రదేశాలలో భాష, కడప మరియు అనంతపురం లలో వాడే భాష ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. చిత్తూరు భాష పూర్తిగా వేరుగా ఉంటుంది. పడమర భాగం పైన కన్నడ, తూర్పు భాగం పైన తమిళం ల ప్రభావం చిత్తూరు పైన చాల ఎక్కువగా ఉంటుంది. అన్నింటికీ మధ్యన ఉండటం వలన కడప జిల్లా లోని దక్షిణ భాగం పైన చిత్తూరు ప్రభావం, ఉత్తర భాగం పైన కర్నూలు ప్రభావం, తూర్పు భాగం పైన నెల్లూరు ప్రభావం, పడమటి భాగం పైన అనంతపురం ప్రభావం ఉంటాయి. అనంతపురం జిల్లా పైన కర్ణాటక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
- గోడంబి = జీడిపప్పు
- జేజి=నాయన్నమ్మ
- జేజి నాయన=నాన్నకు నాన్న
- బుడ్డలు = వేరుశెనగ
- చల్ల ముద్ద = నిశ్చితార్థం (రాగి ముద్దలు పూజిస్తారు)
- మలిబెండ్లి = పెళ్ళి తర్వాత జరిగే రిసెప్షన్ (తొలి పెళ్ళి, మలి పెళ్ళి)
- మెరవని = పెళ్ళి లో జరిగే ఊరేగింపు
- దుడ్లు, లెక్క = డబ్బు (గ్రామ్యం)
- జంపు, జొంపు = పొడుగు
- మోడం, మాడం = మబ్బులు, మేఘాలు
- మబ్బు = చీకటి, మూర్ఛ
- ముసర = మెతుకులు, కుడితి
- బేస్తారం = గురువారం
- మజ్జు = బద్ధకం
- జాస్తి = ఎక్కువ (కన్నడ ప్రభావం, నాస్తి కి వ్యతిరేకం)
- దొబ్బు = త్రోయుట
- ఉల్లిగడ్డ = ఉల్లి
- వెల్లిపాయ = వెల్లుల్లి
- పాలెగాడు = మొనగాడు
- మాదిరి, లెక్క = లాగా
- పైటాల = మధ్యాహ్నం
- వారకు = మూలకు
- మాపటి= సాయంత్రం
- జలాడి = స్నానపు గది
- తపాల = పాత్ర, ఒక రకమైన చెంబు
- గుత్త = కౌలు
- గవాసి = ఇంటి పై ఉండె కిటికి లాంటిది, పైకప్పుకు ఉండే విండో
- దోని - వర్షం పడ్డప్పుడు మిద్దెపై నీళ్లు కిందకు వచ్చే పైపు
- మిద్ద, మిద్దె = డాబా
- బెర్రిన, బిరీన =తొందరగా
- సారకు = మాటిమాటికి
- పొద్దుమూకులు - ప్రతిసారీ, రోజంతా
- రిమ్మ - తిక్క
- యవ్వారం - వ్యవహారం
- తళువాలు - తవ్వాలు
- లొటా = గ్లాసు
- తళ్ళ, తట్ట = కంచం
- బాణాలు=టపాకులు
- పుస్తెలు - పూసలు
- చిత్రాన్నం - పులిహోర (జీడిపప్పు వేయరు)
- బాళ్ళు = పప్పు
- తునకలు = మాంసం
- నవ్వార - మంచానికి అల్లే వైరు
- నేలమాళిగ - భూగర్భంలో ఉండే సామాను భద్రపరిచే గది
- వాంతికి - వాంతి
- వాకిలి=తలుపు
- పుండుకూర=గోంగూర
- ఆతిరాన - అంతిదిగా
- బిర్రుగా - టైట్ గా
- పై=ఒళ్ళు
- తుళువ = అల్లరి
- గోము - గారాబం
- జోరిగా - త్వరగా, వేగంగా
- పుర్ర చేయి - ఎడమ చేయి
- లొడ్డ చేయి - కుడిచేయి
- పాయం - యవ్వనం
- బుడకడం - వెతకడం
- జోము పట్టడం - తిమ్మిరెక్కడం
- గ్రామాలలో 'స్త' 'చ్చ' గా మారుతుంది. ఉదా: వస్తా -> వచ్చా
- భూతకాలం లో య ఒత్తు చేరుతుంది. ఉదా: చేసి ఉండినారు -> చేసిన్యారు
- యాడికిలె - ఎక్కడికి రా ?
- ముంతమామిడి పప్పు = జీడిపప్పు
- చెనక్కాయలు = వేరుశెనగ
- అబ్బ = నాన్నకు తండ్రి
- అబ్బి = అబ్బాయి
- అమ్మి = అమ్మాయి
- తాపలు = మెట్లు
- మెట్లు = చెప్పులు
- యోవ్ = అయ్యా ఓ (అయ్యోవ్)
- మ్మోవ్ = అమ్మా ఓ (అమ్మోవ్)
- జంపు = పొడవు
- బరుగొడ్లు = పశువులు
- ఎర్ర గడ్డలు = ఉల్లి పాయలు
- తెల్ల గడ్డలు = వెల్లుల్లి
- ఒక్క తూరి = ఒక్క సారి
- కళింగర కాయ = పుచ్చకాయ
- కర్బూజా = దోసకాయ
- దోసకాయ = కీరకాయ
అనంతపురం - భాషా ప్రయోగం
- ప్రశ్న రూపం మారుతుంది. ఉదా: వచ్చినావా? -> వచ్చినావ్?
- వెయ్యటం లో 'వ' బదులు 'బ' వస్తుంది. ఉదా: బెయ్ (వెయ్), బేస్కో (వేస్కో)
- ముంతమామిడి పప్పు = జీడిపప్పు
- చెనగ గింజలు=వేరుశెనగ
- తిరిగింపు = పెళ్ళి లో జరిగే ఊరేగింపు
- తిక్కటం = రుద్దటం
- కరుచుకో - కౌగిలించుకో
- పోగొట్టుక పోయింది = కనిపించట్లేదు
- ఏమేం (అర్థం కాదు)= ఏమియు (అర్థం కాదు)
- అప్పా = అయ్యా
- చిక్కటం = దొరకటం
- కట్ల = లాగా
- కట్టి- కర్ర
- విన్నూరు = రెండు వందలు (కన్నడ లో కూడా ఇలానే ఉపయోగిస్తారు, వ్యావహారికం: ఇన్నూరు)
(శ్ర్రీ ఎం.కే. పాండురంగారావు, హిందూపురం జిల్లా గారి సౌజన్యంతో)
- అంతలక్కల = అన్ని చోట్ల
- పిల్లంపీ - పిలిపించు
- మల్యాడు = తచ్చాడు, తిరుగు
- ఆసంది, ఈసంది = అక్కడ, ఇక్కడ
- జంపునా = పొడవుగా, నేరుగా
- ఇసయం = విషయం
- గడ్డకురా = బయటకు రా
- ఎల్లబారు =బయలుదేరు
- గసలు = ఇబ్బందులు, ఆయాసం
- హటాలు = సరిహద్దులు (భూముల)
- ఎల్లాకు = అంతయూ
- తొక్కులాడు = ఆందోళన చెందు (ఇదే పదం కర్నూలు లో కూడా ఉంది)
- ఊనప్పా = విషయం నిజమే సుమా
- యాతాకి, యాడికి = ఎక్కడికి
- సలపాగ = పలుచగా
- గొంటు, లెక్క, దుడ్డు = సొమ్ము, డబ్బు
- తక్కు = అబద్దం
- మోదండంగా = వాస్తవాలు పూర్తిగా తెలియకుండా
- ఇలేవారీగా = విడమరిచిన విధంగా
- కుసిద్దము = దురాలోచన
- నలిబడా = చక్కగా
- అడ్డరువులు = వ్యతిరేక సలహాలు
- కుసాలుగా ఉందా? = తమాషాగా ఉందా?
- పార్రా (పార్రి+రా) = పదండర్రా, పరుగెత్తరా
- గూడ్కా, గుడక = కూడా (ఇది కర్నూలు లో కుడా వినియోగిస్తారు)
- పొదూతునా అసడ్డాలే = విరామం లేకుండా అవాంతరాలే
- రచ్చు కురుత్తా వుంది = జనసందోహం అధికంగా ఉంది (సంతలో)
- పొగెగురుతా ఉంది = ప్రజలు సమృద్ధిగా జీవిస్తున్నారు
- మోపవడం = అతిగా ప్రవర్తించడం
- గోజు పెట్టుకుంటా వుండాడు = చాదస్తం పెంచుకుంటున్నాడు.
చిత్తూరు - భాషా ప్రయోగం
- రాకుండా, లేకుండా, పోకుండా లలో 'కో' చేరుతుంది. ఉదా: రాకోకుండా, లేకోకుండా, పోకోకుండా
- ముంతమామిడి పప్పు = జీడిపప్పు
- చెనిక్కాయలు = వేరుశెనగ
- దారపోయింది = కనిపించట్లేదు
- పూడవటం = పోవటం
- కాలు = పావు
- ముక్కాలు = ముప్పావు
- జల్జారు = స్నానాల గది
- కిండలు = తమాషా
- అబ్బియ్య = అబ్బాయి
- అమాయా = అమ్మాయీ
- అబాయా = అబ్బాయీ
- నాయిన =నాన్న !
- యాంది = ఏమిటి
- గోయిందా =గోవిందా
- వైద్దిగం = వైద్యం
- తిరపతి(తిరప్తి)= తిరుపతి
- సిత్తూరు = చిత్తూరు
- కాలాస్త్రి = శ్రీ కాళహస్తి
- ఆయమ = ఆమె
- మునక్కాయ = ములక్కాడ !
- గొయాకాయ = జామకాయ
- ఆడికి = అక్కడికి
- యాడికి = ఎక్కడికి
- ఈడకి = ఇక్కడికి
- ఈడికి = వీడికి
- సుక్కురారం = శుక్రవారం
- సనారం = శనివారం
- అన్ని రోజులూ ఇంతే
- అట్నేలే = ఆవిధంగానేలే
- ఇట్రారా = ఇటు రారా
- ఎంకటేసర సామి = శ్రీ వేంకటేశ్వర స్వామి
- నా(రా)యినా = నారాయణా
- దాపటెద్దు = మడకకి కుడి వైపునున్న ఎద్దు
- ఎలపటెద్దు = అదే మడకకి ఎడమ వైపునున్న ఎద్దు
- గా? (కదా?) అన్న రూపంలో అది పోయి ఎమే? (ఏమి?) చేరుతుంది. ఉదా: చెప్పొచ్చుగా? -> చెప్పెమే?
- అవ్వదు, కాదు రూపం మారుతుంది. అయ్యేది లేదు అని అంటారు. కన్నడలో ఆయత్తల్ల (ఆయత్తు+అల్ల) దీనికి మూలం
సంస్కృతి
కుల, మతాలు
ఇక్కడ అన్ని కులాల వారు ఉన్నప్పటికీ, రెడ్లదే అన్నింటా పై చేయిగా ఉంటుంది. వ్యవసాయం, వ్యాపారం, రాజకీయాలలో ఇది బాగా కనబడుతుంది.(రెడ్లను సీమలో కాపులు అని కూడా వ్యవహరిస్తారు.) మిగతా కులాల వారు ఎక్కువ ప్రభుత్వోద్యోగులు అయ్యి ఉంటారు. రెడ్ల దగ్గర పని చేసిన వారు, రెడ్డి కాకున్నా దానిని తమ పేర్లలో చేర్చేసుకోవటం అక్కడక్కడా గమనించవచ్చును.
అనంతపురంలో రెడ్ల తర్వాత స్థానం కమ్మ వాళ్లది. (సీమలో చౌదరిలని కమ్మ వాళ్ళు అంటారు. వీళ్ళు పేరు చివర చౌదరి అని కాకుండా నాయుడు అని పెట్టుకుంటారు.
రాష్ట్రంలో మిగతా ప్రదేశాలలో లాగానే జనాభా పరంగా బలిజ కులస్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ వారి ప్రభావం పెద్దగా కనిపించదు. (ఇక్కడ బలిజులు అనగా మిగతా ప్రదేశాల్లో కాపు/నాయుడు/తెలగ/ఒంటరి కులస్థులు. బలిజులలో ఒక్క శెట్టి బలిజ మాత్రమే ఇక్కడ అగ్ర కులం. లింగ బలిజ, వాడ బలిజ, పెరిక బలిజ వంటివి వెనుకబడిన కులాలు. కాగా కోస్తా ఆంధ్రలో శెట్టి బలిజ వెనుక బడిన కులం. అయితే ఈ రెండు శెట్టి బలిజలు, వేర్వేరు కులాలు కావటం విశేషం.)
ఉత్తర భారత దేశం నుండి వచ్చిన సేఠ్ లు సీమలో వ్యాపారాలు చేస్తుంటారు. ముఖ్యంగా బంగారు దుకాణాలు, బట్టల దుకాణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ నడుపుతుంటారు.
కడపలో కన్నడిగ బ్రాహ్మణులు నెలకొల్పిన "మయూర" చాలా పేరు గలది. బేకరీలు, రెస్టారెంటులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు దీని ప్రత్యేకత.
కడప, కర్నూలు లలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అనంతపురం లో కొద్దిగా తక్కువగా, చిత్తూరు లో మరింత తక్కువగా కనిపిస్తారు. అయిననూ రెండు మతాలు చాల కలివిడిగా ఉండటం గమనించవచ్చును. ఎట్టి సందర్భం లోనూ సీమలో మత సంఘర్షణలకు తావు ఉండదు. హిందువులు దర్గాలకి వెళతారు, అక్కడ అన్నదానాలు చేస్తారు. రంజాన్ కి ముస్లింలు తమ హిందువు స్నేహితులని కుడా విందుకి ఆహ్వానిస్తారు. కర్నూలు జిల్లాలోని పీర్ల పండగ లో హిందువులు కుడా పాల్గొంటారు. కొన్ని గ్రామాలలో ప్రక్క ప్రక్క ఇళ్ళలో ఉన్న హిందూ-ముస్లిం మతస్థులు ఒకే కుటుంబం అంతగా పెనవేసుకుపోయిన వైనాలు అనేకం. కడపలోని పెద్ద దర్గాకి ఎ. ఆర్. రెహమాన్ వంటి ముస్లిం ప్రముఖులతో బాటు, అమితాబ్ బచ్చని, జయా బచ్చని, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, రాంచరణ్ తేజ వంటి హిందువులు కూడా దర్శించుకోవటం గమనార్హం. క్రిస్టియనులు చిత్తూరులో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో బాగానే ఉన్నారు.
ఆహారం
- ఇదే విధంగా జొన్న రొట్టెలను కూడా చిత్తూరును మినహాయించి మూడు జిల్లాల్లోనూ తింటారు. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో ఈ మధ్య ఇది హోటళ్ళ లో కూడా లభ్యమౌతుంది. మధుమేహానికి మంచి పత్యకారి.
- రాగిసంగటి కడప, అనంతపురంలో బాగా తింటారు. వీటి కోసం ప్రత్యేకంగా హోటళ్ళను జిల్లాలో చాల విరివిగా చూడవచ్చు. మిగతా మూడు జిల్లాల్లో కంటే కడపలోనే ఎక్కువగా తింటారు. బెంగుళూరులోని పెద్ద పెద్ద రెస్టారెంటులలో కూడా ఈ మధ్య ఇది లభిస్తోంది.హైదరాబాదులో కృతుంగ, రాయలసీమ రుచులు అని రెండు ప్రధాన రెస్టారెంటు చైన్ హోటళ్లు ఉన్నాయి. వీటిలో ఇది ప్రధాన ఆహారం.
- పొంగలి చిత్తూరులో బాగా ఎక్కువ. చాలా మంది తెలంగాణా వాసులకి పొంగలి తెలియదు. అయితే తమిళనాడు పొంగలి ఇక్కడి పొంగలి ఒకటే విధంగా ఉంటాయి. కర్ణాటకలో పొంగలి లో పాలని వినియోగిస్తారు.
- బనగానెపల్లె "బేనిషా" మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి గుర్తు లేనిది (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో "బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.