వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహపరిశోధన సంచాలకులు డాక్టర్ కె.రాజారెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గురువారం వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సీమలో నివసించు యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సదుద్ధేశంతో ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం పరిధిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులను నూతనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. దీంతో వ్యవసాయాభివృద్ధి, విత్తనోత్పత్తులలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే అవకాశం ఉంటుందన్నారు ఈ క్రమంలోనే తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ నెల 10 నుంచి తరగతులు ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల కాలపరిమితి గల ఈ కోర్సుకు పదోతరగతి లేదా దానికి సమానమైన పరీక్షలలో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. అభ్యర్థులు కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండవలెనని చెప్పారు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణాధికారులుగా ఉద్యోగాలు పొందడమే కాకుండా ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్.వి.నాయుడు, డాక్టర్ మునస్వామి, డాక్టర్ గిరిధర్‌క్రిష్ణ, డాక్టర్ ఎ.రామక్రిష్ణారావు, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ వాసంతి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు
Friday, 14 October 2011
తిమ్మమ్మమర్రిమాను చరిత్ర
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మమర్రిమాను ఒక చరిత్రగా నిలిచిపోయింది. మహాశివరాత్రి పండుగ వస్తూనే ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రాంత ప్రజలకు ఒక్కసారిగా తిమ్మమ్మమర్రిమాను చరిత్రను గుర్తు చేసుకుంటారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం, నంబులపూలకుంట మండలంలోని కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో కదిరి పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న తిమ్మమ్మమర్రిమాను గూటిబైలు పరిసరాలలో మర్రిమాను 1100 ఊడలతో 6.20 ఎకరాలు విస్తరించి ఉన్నది. మద్రాసులో ఉన్న అడియార్ మర్రిచెట్టు, కలకత్తాలోని బొటానికల్ గార్డెన్‌లో ఉన్న మర్రిచెట్టుకన్నా తిమ్మమ్మమర్రిమాను పెద్దచెట్టుగా ప్రసిద్ధి చెందింది.
ఈ మర్రిచెట్టును తిమ్మమ్మమర్రిమానుగా గిన్నీస్‌బుక్క్ ఆఫ్ వరల్డ్‌లో తన స్థానం సుస్థిర పరుచుకుంది. ప్రస్తుతం ఈ మర్రిచెట్టుకు దాదాపు 562 సంవత్సరాలు చరిత్ర ఉంది. ఆ ప్రాంత మంతా దైవసంభూతంగా పేరు ఉన్న పతీవ్రత తిమ్మమాంబ పేరు మీద తిమ్మమ్మమర్రిమానుగా ఈ మహావృక్షం ప్రసిద్ది గాంచినది. ఈ మహావృక్షం వెనుక ఆసక్తి గల కథ కూడా ఉన్నది. అనంతపురం జిల్లా, పెనుకొండ తాలుక, బుక్కపట్నం గ్రామంలో చెన్నక్క, వెంకటప్ప అనే దంపతులకు తిమ్మమాంబ జన్మించింది. ఈమెకు పెళ్ళి వయస్సు వస్తూనే నంబులపూలకుంట మండలానికి చెందిన గూటిబైలు గ్రామంలో నివాసం ఉన్న బాలవీరయ్యతో వివాహం జరిపించారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే ఆమె భర్తకు అంటువ్యాధి సోకి అనారోగ్యంతో క్షీణిచారు.
గ్రామంలో ఉన్న వారు వారిని చూసి అసహించుకుంటుంటే ఈ బాధను పడలేక గ్రామానికి ఒక కిలోమీటరు సమీపంలో తిమ్మమాంబ ఒక రాతి కోటను నిర్మించుకుని, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కోటలోకి తీసుకెళ్ళి ఆయనకు సేవలు చేసింది. అయినా అతను ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అప్పట్లో ఆమె తన భర్త మరణించడంతో తానుకూడా అతనితో పాటు సతీసహగమణం చేసుకోవాలని చితిపేర్చుకుంది, చితిలోపల పచ్చని మర్రికొమ్మతో పాటు, మామిడి తోరణాలు కట్టారు. గ్రామ స్తులు అందరు చూస్తుండగానే భర్తను చితిలో దహనం చేస్తున్న సమయంలో ఆమెకూడా చితిలోకి దూకి సతీసహగమణం చేసుకున్నది. తర్వాత కొంత కాలానికి ఆ చితి వద్ద మర్రికొమ్మ మొక్క చిగురించింది.
ఆ మొక్క నేడు ప్రపంచంలోకెల్లా పెద్ద వృక్ష్యంగా మారింది. నాటి నుంచి మర్రిమాను తిమ్మమ్మమర్రిమానుగా ప్రఖ్యాతి గాంచినది. వారి సమాధి వద్ద చిన్న గుడి నిర్మించారు. అందులో బాలవీరయ్య, తిమ్మమాంబ విగ్రహాలు నెలకొల్పి ఉన్నాయి. అప్పటి విగ్రహాలకు నేటి వరకు మహాశివరాత్రి పండుగ రాగానే మూడు రోజులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్కడ నిర్మించిన తిమ్మమాంబ సమాధిఘాట్, తిమ్మమాంబ, బాలవీరయ్యల విగ్రహాలు, వన్యప్రాణుల షెడ్, శివఘాట్, కళ్యాణమండపం, గెస్ట్ హౌస్, ఓబుళేసుని గుట్ట తదితర వంటివి అక్కడ సందర్శించదగ్గ విషయాలుగా నెలకొల్పారు. ఈ మహాశివరాత్రి పండుగ రాగానే కర్నాటక ప్రాంతం బెంగుళూరు, కోలార్, చెనై్న, చిత్తూరు, కడప, అనంతపురం వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
ప్రయాణికులకు మహాశివరాత్రి ఉత్సవాలకు గాను తిమ్మమ్మమర్రిమాను వద్దకు కదిరి డిపో నుంచి స్పెషల్ సర్వీసులు బస్సులు కూడా నడుపుతున్నారు. అయితే అక్కడ పర్యాటకులకు, సందర్శకులకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మర్రిమాను వద్దకు వస్తున్న యాత్రికులు, పర్యాటకులకు అక్కడ బసచేయాలన్న గధులు లేక వచ్చిన వారు పూజలు నిర్వహించుకుని వెళ్లుతున్నారే తప్ప బసచేయడానికి కష్టంగా మారిందని పర్యాటకులు పేర్కొన్నారు. అదే విధంగా పర్యాటకులకు స్నానం గదులు, లేక పోవడంతో వచ్చిన పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రయాణం చేసి వచ్చిన వారికి సకాలంలో తాగునీటి కుళాయిలు లేక పోవడంతో ఎక్కువ సమయం మర్రిమాను వద్ద గడపలేక పోతున్నారు
పారిశ్రామిక వేత్తలు జిల్లాను ఎంచుకుంటున్నారు
ప్రస్తుతం పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలోనే పరిశ్రమల ఏర్పాటునకు అనువైన ప్రాంతంగా అనంతపురం జిల్లాను ఎంచుకుంటున్నారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి పలువురు ఔత్సాహిక, అనుభవజ్ఞులైన పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. రెన్నెళ్లుగా పరిశ్రమల స్థాపనకు సంబంధించి జిల్లా పరిశ్రమల కేంద్రానికి అందిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. ఒక మోస్తరు నుంచి భారీ పరిశ్రమల వరకు స్థాపించడానికి దరఖాస్తులు అందాయి. హిందూపురం సమీపంలోని తూమకుంట పారిశ్రామికవాడలో, చిలమత్తూరు మండలంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు ఈప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు వస్తున్నాయని ముమ్మర ప్రచారం ఉంది. ఈక్రమంలోనే సైన్స్‌సిటీ తదితరాలు తెరమీదకు వచ్చాయి. ఇక్కడ పరిశ్రమల ఔచిత్యాన్ని గుర్తించి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిశ్రమల అవసరాలకు గండికోట రిజర్వాయర్ నుంచి 2 టిఎంసిల నీటిని కేటాయిస్తున్న ట్లు జిఓ కూడా జారీ చేశారు. అది ప్రస్తుతం అటకెక్కిన సంగతి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరిశ్రమల స్థాపనకు ఇదొక్కటే అడ్డంకిగా మారింది. హిందూపురం ప్రాంతానికి బెంగళూరు విమానాశ్రయంతో పాటు, నగరం కూడా 100 కిలోమీటర్లపరిధిలోనే ఉంటుంది. ఇటీవలనే నెలకొల్సిన దేవనహళ్ళి అంతర్జాతీయ విమానాశ్రయం చిలమత్తూరు సమీపంలోని జాతీయ రహదారి నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. పుట్టపర్తి విమానాశ్రయం దగ్గరే. రైల్వే సౌకర్యం ఎలాగు ఉంది తెలంగాణ ప్రాంతంలో నెలకొన్ని పరిస్థితుల నేపధ్యంలో పారిశ్రామిక వేత్తలు ఇబ్బడిముబ్బడిగా ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. 8 మంది పారిశ్రామిక వేత్తలు స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు స్థాపించడానికి, టెక్స్‌పోర్ట్ పరిశ్రమను స్థాపించడానికి మరొకరు, వందలాది మంది చిన్నచిన్న పరిశ్రమలు స్థాపించడానికి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నీటికొరత వీరికి అడ్డంకిగా నిలుస్తోంది. గండికోట రిజర్వాయర్ నుంచి రావాల్సిన రెండు టిఎంసిల నీరు నిజంగా విడుదలైతే ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు స్థాపన అవుతాయి. చిలమత్తూరు మండలాన్ని ఇటీవలనే డార్క్ మండలంగా ప్రకటించారు. ఈకారణంగా ఇక్కడ నీటి లభ్యత చాలా కష్టమవుతుంది. పరిశ్రమల స్థాపనకు ప్రధానంగా కావాల్సింది నీటి సౌకర్యమే. ఆదిశగా పాలకులు ప్రయత్నం చేస్తే అనంతపురం పారిశ్రామిక జిల్లాగా ఖ్యాతిని గడిస్తుంది
టీచర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు
శ్రీశైలం ఐటీడీఏ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజె క్ట్ అధికారి కె.రమేష్ తెలిపారు. స్కూల్‌అసిస్టెంట్లు, తెలుగు పండిట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చిన ట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఎస్టీ అభ్యర్థిని, అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించి ఐటీడీఏ కార్యాలయంలో రిక్రూట్‌మెంట్ సెల్‌లో దరఖాస్తులు పొందవచ్చన్నారు.
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల18 లోగా శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో అందజేయాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగించబడదన్నారు. దరఖాస్తు ఫారంలో సూచించిన లోకల్ ట్రైబ్ సర్టిఫికెట్ స్థానంలో తహశీల్దార్ల ద్వారా గతంలో జారీ చేయబడిన ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబడతాయన్నారు. లో కల్ ట్రైబ్ సర్టిఫికెట్ స్థానంలో ఏజెన్సీ ఏరి యా సర్టిఫికెట్లనుకూడా పరిగణనలోకి తీసుకునే విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు. ఈనెల 18 తర్వాత వచ్చే దరఖాస్తులను అంగీకరించడం జరగదని తెలిపారు
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల18 లోగా శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో అందజేయాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగించబడదన్నారు. దరఖాస్తు ఫారంలో సూచించిన లోకల్ ట్రైబ్ సర్టిఫికెట్ స్థానంలో తహశీల్దార్ల ద్వారా గతంలో జారీ చేయబడిన ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబడతాయన్నారు. లో కల్ ట్రైబ్ సర్టిఫికెట్ స్థానంలో ఏజెన్సీ ఏరి యా సర్టిఫికెట్లనుకూడా పరిగణనలోకి తీసుకునే విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు. ఈనెల 18 తర్వాత వచ్చే దరఖాస్తులను అంగీకరించడం జరగదని తెలిపారు
మహానంది అభివృద్ధి జరగాలంటే వాస్తు పరిశీలన
మహానంది క్షేత్రం అభివృద్ధి జరగాలంటే ఆలయంలోని ప్రధాన గుండమైన రుద్రగుండం పుష్కరిణి యొక్క పవిత్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి సౌందర్ రాజన్ పేర్కొన్నారు. గురువారం మహానందిలోని వాస్తు పరిశీలన, క్షేత్రం అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన పనులను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన క్షేత్రంలోని పరిసర ప్రాంతాలు కలియదిరుగుతూ చేయాల్సిన పనులను, తీసుకోవాల్సిన చర్యలను ఆయన గుర్తించారు. అనంతరం ఆలయ ఇఓ సాగర్‌బాబు, ఎఇ శ్రీనివాసప్రసాద్‌లతో సమావేశమై ఈ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానంది క్షేత్రం అభివృద్ధి జరగాలంటే ముందుగా క్షేత్రంలోని రుద్రగుండం పుష్కరిణిలో గల పంచ లింగాల మండపం పునరుద్ధరించాల్సి ఉందని, పుష్కరిణి యొక్క పవిత్రతను మరింత పెంచాల్సి ఉందన్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులలో భక్తిని పెంచే విధంగా పుష్కరిణిలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై దేవాదాయ శాఖ కమిషనర్‌తో చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయం లోపల కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. మహానంది దేవాలయానికి అవసరమయ్యే 62 అడుగుల ధ్వజస్తంభం కర్ర దొరకడం లేదని, ప్రస్తుతం గుజరాత్ అడవుల్లో టేకు కర్రను గుర్తించడం జరిగిందని త్వరలోనే మహానందికి చేర్చే ప్రయత్నంలో దాతలు, అధికారులు ఉన్నారన్నారు. క్షేత్రం అభివృద్ధి జరగాలంటే ఈశాన్యంలో గోశాల ఏర్పాటుచేయాలని, ఆగ్నేయంలో ప్రసాదాల తయారీకి వంటశాల, నైరుతిలో భక్తులు అభిషేకాలు చేసుకొనేందుకు గాను నటరాజ మండపం, అభిషేక మండపం ఏర్పాటుచేయాలని, వాయువ్యంలో భగవంతుని కల్యాణం కొరకు కల్యాణ మండపం ఏర్పాటుచేయడం వల్ల వాస్తురీత్యా అభివృద్ధి జరుగుతుందన్నారు. దేవాలయంలో నిర్వహించే కేశఖండనం గదిని ఆలయం నుంచి బయట ప్రాంతంలో ఏర్పాటుచేయాలన్నారు. అలాగే మహానంది ఆలయ ముందు భాగంలో రూ.80 లక్షలతో షెడ్డు నిర్మాణ పనులకు అంచనాలు వేసినట్లు ఆయన తెలిపారు. మొదటి ప్రాకార మండపానికి తూర్పువైపున దారి ఏర్పాటుచేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులు, అర్చకులు ఉన్నతాధికారుల సహకారాలు ఉంటే మహానంది క్షేత్రం త్వరలోనే అభివృద్ధి పథంలో చూడవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు
పల్లె వెలుగు బస్సుల్లో టిమ్ మిషన్లతో టికెట్లు ఇస్తామని
జిల్లాలో అన్ని పల్లె వెలుగు బస్సుల్లో టిమ్ మిషన్లతో టికెట్లు ఇస్తామని ఆర్టీసీ జిల్లా రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పల్లెవెలుగు బస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం టిమ్ యంత్రాన్ని కండక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మాత్రం ఈ పెలైట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు
హైదరాబాద్‌ను వదులుకోం
ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ను వదులుకునేదిలేదని రాయలసీమ హక్కుల వేదిక చైర్మన్, మంత్రి టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విడిపోతామా? కలిసి ఉంటామా? అనే చర్చను వీడి అభివృద్ధి అసమానతలపై చర్చించాలని సూచించారు. సమ్మెతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, పెట్టుబడులు ఆంధ్రకు తరలుతున్నాయని టీజీ పేర్కొన్నారు
Subscribe to:
Posts (Atom)