తిరుపతి

చూడదగిన ప్రాంతాలు

  • తిరుపతి - ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక నగరం. ప్రపంచ ప్రసిద్ద తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది.
  • తిరుమల తిరుపతి - కలియుగ వైకుంఠంగా కీర్తింపబడే దేవాలయం. తిరుపతిలో ఉన్నది.
  • గోవిందరాజ స్వామి దేవాలయం: తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత రాజగోపురంతో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. క్రీ.శ. 1130లో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ రాజగోపురాన్ని 1624లో స్వామిభక్తుడు మట్లి అనంతరాజు నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది శ్రీకృష్ణ ఆలయం అయినా, నాటి మూలవిరాట్‌ అయిన శ్రీకృష్ణుని మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని వేంకటేశ్వరుని పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం!
  • కోదండ రామాలయం:  ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే, సీతమ్మతల్లి రాములవారికి కుడివైపున ఉండటం! ఇది వైఖానసశాస్త్ర సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
  • కపిలతీర్థం:కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. టిటిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడ చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం మరియు ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది.
  • వరదరాజ స్వామి దేవాలయం:ఇది కపిల తీర్థం రోడ్డు లేదా కే టీ రోడ్డు లో ఉన్నది.
  • జీవకోన:
  • ఇస్కాన్ దేవాలయం: ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల ( అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది
  • శ్రీనివాస మంగాపురం: తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం. ఇది ఆ శ్రీనివాసుడు విశ్రమించిన చోటు. నారాయణవనంలో పద్మావతీదేవిని వివాహమాడిన వేంకటేశ్వరుడు, తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడు నిలువెత్తుగా, బహు సుందరమూర్తిగా దర్శనం ఇస్తాడు.
  • అలివేలు మంగాపురం లేదా తిరుచానూరు  : తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొన్న భక్తులు- కొండ దిగి ముందుగా చేయాల్సిన పని తిరుచానూర్‌(దీన్నే అలివేలుమంగాపురం అంటారు)లోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవటమే! అయితే స్వామివారికన్నాముందే, అమ్మవారిని దర్శించాలని చాలామంది అంటారు. తిరుచానూర్‌, తిరుపతికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్తీకమాసంలో తిరుచానూర్‌ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలూ బహువైభవంగా జరుగుతాయి. స్వామికిలాగే, అమ్మవారికీ నిత్య కళ్యాణమే.
  • ముక్కోటి: ఈ అలయము స్వర్నమరియు కల్యని నదుల ప్రవాహ వడ్డున నిర్మిమ్పబడింది.ప్రసిద్ది గాంచినది, మరియు కచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయము.చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం, ఈ శివాలయం.
  • చంద్రగిరి కోట: తిరుపతికీ చంద్రగిరి పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి చంద్రగిరి వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్‌ అండ్‌ సౌండ్‌ షోకు వెళ్ళాల్సిందే.
  • హార్స్‌లీహిల్స్‌: తిరుపతికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో హార్స్‌లీహిల్స్‌ ఉంది. అంత ఎత్తున విడిదిగృహాన్ని కట్టించుకున్న అప్పటి కడపజిల్లా కలెక్టర్‌ డబ్ల్యు.డి.హార్స్‌లీ పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రా ఊటీగా పేరుపొందింది.
  • తలకోన: పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
  • కళ్యాణీ డ్యాం :
  • కాణిపాకం : తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
తిరుపతిలోని కొదండరామాలయము: అలపిరి దగ్గరున్న మెట్ల దారిలో వున్న తల తాకుగుం గుండు:---- గతంలో అంటరాని వారు కొండ పైకి వెళ్ళే వారు కాదు. వారు ఈ గుండుకు తమ తలను తాకించి ఇక్కడి నుండే వెళ్ళే వారు. అందు చేత ఈగుండుకు రంద్రాలున్నాయి. తర్వాతి కాలంలో తిరుమల గుడిలో అందరికి ప్రవేసం కల్పించాక ఈ గుండు ప్రామఖ్యత తగ్గింది. గత కాలానికి దర్పణంగా ఈగుండును ఇప్పటికి చూడవచ్చు.

తిరుపతి జిల్లా, రాష్ట్ర ప్రజలే కాదు.. యావత్తు భారతజాతి గర్వించదగ్గ ఆధ్యాత్మిక నగరంగా వర్ధిల్లుతున్న తిరుపతి నగరం స్వరూపమే కాదు.. సంస్కృతీ శరవేగంగా మారిపోతోంది. పాతికేళ్లలో గర్తుపట్టేందుకే వీలులేని విధంగా మారిపోయిన ఈ తిరునగరి ప్రత్యేకించి గత పదేళ్లలో మహానగరాల ఒరవడినీ ఒంటబట్టించుకుంది. ఒకప్పుడు కాశీదారాలు, ఇత్తడి పూజాసామగ్రి అమ్మకాలకే పరిమితమయ్యే గోవిందరాజస్వామి ఆలయ పరిసరాలకు పరిమితమైన తిరుపతి ఇప్పుడు అటు చంద్రగిరినుంచి ఇటు రేణిగుంటదాకా విస్తరించి జిల్లాకే తలమానికమైన వ్యాపార కేంద్రంగా పరిణమించింది. ఒక ఫేషియల్‌కు (మేకప్‌కు)15 వేల రూపాయలు వసూలు చేసే సెలూన్‌ల నుంచి ఒక్క రోజు బసకు 16 వేల రూపాయల అద్దె వసూలు చేసే హోటళ్లకూ ఇప్పుడీ నగరం వేదికయింది. దేశంలోనే పేరెన్నికగన్న ఎన్నో వ్యాపార సంస్థలు తిరుపతిలో ఖాతాలు తెరిచాయి. కేవలం 15 నుంచి 20 ఏళ్ల కాలంలో తిరుపతి ఎంత శరవేగంగా అభివృద్ధి చెందిందో, గడచిన ఐదేళ్లలో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చెందడం విశేషం.
1980కి పూర్వం... తిరుపతి పరిధి చాలా చిన్నది. అప్పట్లో వివి మహల్, శ్రీనివాస థియేటర్లే సరిహద్దు. ఇప్పుడున్న రెడ్డి అండ్ రెడ్డి కాలనీ అప్పుడు వ్యవసాయ పొలం. సాయంత్రం ఆరు గంటలు దాటితే మంగళం రోడ్డులోని రెండు మద్దిమాన్ల వద్దకు వెళ్ళాలంటే భయం. చేపల మార్కెట్ నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు చీమచింతకాయల తోపు. ఇప్పుడు శ్రీనివాసం ఉన్న ప్రాంతం అప్పట్లో అకుకూరల తోట. ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రహరీ పక్కనుంచి వరదరాజనగర్, ఇస్కాన్ మందిరం, ఎన్జీవో కాలనీ, ఖాదీకాలనీ ఇవన్నీ ముళ్ళపొదలతో నిండిన చిట్టడవులు. మధ్యలో కపిలతీర్థానికి ఓ బాట. చీకటి పడితే వరదరాజ స్వామి ఆలయం దాటి వెళ్ళాలంటే భయం. బాలాజీ కాలనీ అప్పట్లో లేదు. మంచినీళ్లగుంటకు వెనుక పక్కనున్న చిన్న గుంతే అప్పట్లో తిరుపతి సరిహద్దు. గాంధీరోడ్డు, బజారువీధి, చిన్న బజారు వీధి... ఇవే అప్పట్లో ప్రధాన వాణిజ్య కూడళ్లు.
మరి ఇప్పుడో...! తిరుపతి- రేణిగుంట- తిరుచానూరు- చంద్రగిరి.. అన్నీ ఎప్పుడో కలిసిిపోయాయి. తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య 15 వేల నుంచి 70 వేలకు పెరిగినట్టే నగర పరిధి పెరిగిపోయింది. తిరుమల బైపాస్ రోడ్డు, ఎయిర్ బైపాస్ రోడ్లు నగర పరిధిని విపరీతంగా పెంచేశాయి. 2000 సంవత్సరం నుంచి అభివృద్ధి మరింత వేగంగా జరిగింది. అప్పట్లో నగర జనాభా 1,75 లక్షలు...ఇప్పుడు 3.05 లక్షలు. 2000 సంవత్సరంలో నగరంలో అపార్టుమెంట్ల నాలుగు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 167కు పెరిగింది. మరో వంద దాకా నిర్మాణంలో ఉన్నాయి. మున్సిపాలిటీ లెక్కల ప్రకారం అప్పట్లో తిరుపతిలో భవనాల సంఖ్య 19 వేల చిల్లర. ఇప్పుడు 42,600. వీటిలో రెసిడెన్షియల్ భవనాలు 33782. వీటిని ఇళ్ల రూపంలో విభజిస్తే కాపురాల సంఖ్య లక్ష దాటుతుంది.
1975కు పూర్వం తిరుపతిలో అంకణం ఇంటిజాగా ధర సరాసరిన వెయ్యి రూపాయల లోపే. 2008 ప్రాంతానికి అది 30 వేలకు పెరిగింది. ఇప్పుడు లక్షా ముప్పై వేలయి కూర్చుంది. 1985-90 ప్రాంతంలో ఎన్జీవో కాలనీలో అంకణం 250 రూపాయలు. ఇప్పుడు అక్షరాలా రెండు లక్షలు. దూసుకొచ్చిన నగర సంస్కృతి గడచిన ఐదేళ్ల కాలంలో తిరుపతి ప్రధాన వాణిజ్య కేం ద్రంగా మారింది. కేవలం మహా నగరాలకు మాత్రమే పరిమితమైన పలు బహుళజాతి సంస్థలు తమ వ్యాపా ర కేంద్రాలను తిరుపతిలో తెరిచాయి. వస్త్ర ప్రపంచం తిరుపతిని చుట్టుముట్టింది. మొన్నటి వరకు బొమ్మన, చందన వరకే పరిమితం కాగా ఇప్పుడు కళాంజలి, కళానికేతన్, పెప్ జీన్స్, యారో, జిన్న్నీ, రైమండ్స్ తదితర షోరూములు తిరుపతిని చుట్టుముట్టాయి. ఇక నగల ప్రపంచానికి వస్తే ఖజానా, జీ.ఆర్.టీ, మలబార్, ఎ.వి.డైమండ్స్, రిలయన్స్ జుయలరీ తదితరాలతో పాటు తరతరాలుగా తిరుపతినే నమ్ముకున్న చిన్న, మధ్య స్థాయి దుకాణాలు లెక్కకు మించి ఉన్నాయి. సూపర్‌మార్కెట్ల్ సంస్కృతీ శరవేగంగా పెరిగింది. చిన్నచిన్న చిల్లర అంగళ్లు దాదాపుగా కనిపించకుండా పోయాయి.
అన్ని సూపర్‌మార్కెట్‌లే. దేశ వ్యాప్తంగా రిటైల్ వ్యాపారం చేస్తున్న బహుళజాతి సంస్థలు రిలయన్స్ మార్ట్, మోర్, సరయూస్, లాంటి సూపర్ మార్కెట్‌లతో స్థానికంగా పట్టున్న పసుపర్తిలాంటి సూపర్ మార్కెట్లు పోటీలు పడి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇక మహిళల కోసం బ్యూటీ పార్లర్లు లెక్కకు మించి వెలిశాయి. తాజాగా పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా పార్లర్లు వెలిశాయి. మెన్స్ టచ్ పేరుతో నగరం నలువైపులా ఏసీ సెలూన్లు వెలిశాయి. మెన్స్‌టచ్, న్యాచురల్స్ వంటి బ్యూటీపార్లర్లలో స్త్రీ పురుషుల అలంకరణలకు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. కనిష్టంగా రూ. 2500 నుంచి 15 వేల వరకు బిల్లు చేస్తున్నారు. ఇక అధునాతన పరికరాలతో స్త్రీ పురుషులకు వేరువేరుగా జిమ్ పాయింట్స్ 25కు పైగా ఏర్పాటయ్యాయి. విద్య పరంగానూ పలు కార్పొరేట్ సంస్థలు తిరుపతిని కేంద్రంగా చేసుకున్నాయి. ఆరోగ్యపరంగా వీధికో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వెలిసింది. కేవలం గత ఐదేళ్ల కాలంలోనే మహానగరాల్లో లభించే ప్రతి వస్తువు, అందే ప్రతి సేవ తిరుపతి నగరంలో అందుబాటులోకి వచ్చాయి.

No comments:

Post a Comment