ప్రజల్లో హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్ధ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ స్వచ్చంద సంస్థ స్థానిక నాలుగుకాళ్ల మండపం వద్ద బుధవారం వీధినాటకాన్ని ప్రదర్శించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఇలాంటి వీధి నాటకాలు నిర్వహిస్తున్నట్లు కో- ఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈసందర్భంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్ధ డిపిఎం లలిత మాట్లాడుతూ హెచ్‌ఐవి, ఎయిడ్స్‌కు దూరంగా వుండాలంటే ప్రతి ఒక్కరు విధిగా కండోమ్స్‌ను వాడాలన్నారు. కండోమ్స్‌లను వాడటం ద్వారా సుఖవ్యాధులు నివారించవచ్చునన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లాలోని 14 పట్టణాలలో 19 మేజర్ గ్రామ పంచాయతీలలో నిర్వహించనున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్ వరకూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు
Thursday, 20 October 2011
రాయలసీమ పరిధిలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
రాయలసీమ పరిధిలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం నాడు కదిరి, లేపాక్షి, హిందూపురం ప్రాంతాల్లో ఎస్‌ఇతోపాటు ఇఇ శ్రీనివాసరావు, డిఇ గంగయ్యలు వివిధ దేవాలయాలను పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక గుడ్డం రంగనాథస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన పాత్రికేయులతో ఎస్‌ఇ మాట్లాడారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చరిత్రను దృష్టిలో వుంచుకొని మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దేవాలయ పరిధిలో రూ.40 లక్షలతో భక్తుల సౌకర్యార్థం సామూహిక సత్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ నెలాఖరు లోగా పనులు పూర్తి అవుతాయని తెలిపారు. అదే విధంగా రూ.1.50 కోట్లతో అధునాతన 40 గదుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇకపోతే కదిరి గాంధీచౌక్ సమీపంలో రూ.18 లక్షలతో దేవాలయానికి సంబంధించిన స్థలంలో 16 వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నట్లు ఎస్‌ఇ తెలిపారు. దీనికి తోడు కదిరి సమీపంలోని కొండల నరసింహస్వామి దేవాలయంలో ఎంతోకాలంగా వివాహాలు అధికంగా సాధారణ ప్రజలు నిర్వహిస్తున్నందున మరింత అభివృద్ధి చేసే విధంగా రూ.25 లక్షలతో కమ్యూనిటీ హాలును అధునికంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు
Subscribe to:
Posts (Atom)