మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్
ఇకపై దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్ జారీ చేస్తామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడించారు. 30 రోజుల్లోగా ఆర్డినరీ పాస్‌పోర్ట్‌లు అందచేస్తామని చెప్పారు. పాస్‌పోర్ట్ సేవాకేంద్రం(పీఎస్‌కే)లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో మరో మూడు పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ మాన్యువల్‌గా స్వీకరిస్తున్న దరఖాస్తులను ఇకపై పీఎస్‌కేలలో ఇ-ప్రాసెసింగ్ ద్వారా తీసుకుంటామని తెలిపారు
No comments:
Post a Comment