తాను రక్తం అమ్ముకునే రకం కాదని కాంగ్రెసు శానససభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా రక్త దాన శిబిరాన్ని ఆనయ బుధవారం ప్రారంభించారు. తన బ్లడ్ బ్యాంకుపై గతంలో వచ్చిన ఆరోపణలపై ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. తన బ్లడ్ బ్యాంకులో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చేసిందని, తాను రక్తం అమ్ముకోవడం లేదని ఈ రోజు తేలిపోయిందని ఆయన అన్నారు. తన సొంత డబ్బులతో చిరంజీవి రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు తాను ఎవరి నుంచి కూడా విరాళాలు వసూలు చేయలేదని అన్నారు. ఇతర బ్లడ్ బ్యాంకుల కన్నా తక్కువ ధరకే తమ బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని ఇస్తోందని, అందుకు తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. తాను బ్ల్డడ్ బ్యాంక్ నిర్వహణకు ఇతరుల నుంచి నయాపైసా తీసుకోలేదని చెప్పారు. తనకు నటన కన్నా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ ముఖ్యమని ఆయన అన్నారు
No comments:
Post a Comment