Wednesday, 23 November 2011

ఐసెట్ ద్వారానే ఎంబీఏ కోర్సుకు అడ్మిషన్లు

ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్) ద్వారానే వచ్చే ఏడాది ఎంబీఏ కోర్సుకు అడ్మిషన్లు జరుగుతాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు స్పష్టం చేశారు. మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశాలకు వచ్చే ఏడాది నుంచి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామంటూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వద్ద ప్రతిపాదన ఉన్నట్లే మాకు తెలియదని ఆయన చెప్పారు. వాస్తవానికి అలాంటి సమాచారం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2012-13 విద్యా సంవత్సరంలో కూడా ఐసెట్ ద్వారానే ఎంబీఏ కోర్సుకు అడ్మిషన్లు నిర్వహిస్తామని ఆయన వివరణ ఇచ్చారు. ఇంజనీరింగ్ అడ్మిషన్లు కూడా ఎంసెట్ ద్వారానే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశాలకు కూడా జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న ఆలోచన కూడా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ప్రైవేటు సంభాషణల్లో ఆయా ఆలోచనలు వచ్చి ఉండొచ్చని, అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదన లేదన్నారు. వృత్తి విద్య ఫీజుల విషయమై రెండు రోజుల్లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు

No comments:

Post a Comment