జిల్లాలోని వితంతువులు, స్వచ్చంధ సంస్థల్లో ఉన్న అనాధలు, బాలసదనం, సేవాసదనం, దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రంల్లో ఉన్న మహిళలు ఎస్ఐ, కానిస్టేబుళ్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ముత్యాలమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వతేదీలోపు స్థానిక సీడీపీఓల ద్వారా అభ్యర్థులు స్వయంగా వచ్చి మహిళ,శిశు సంక్షేమశాఖ పీడీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా శారీర డారుఢ్యం కలిగి ఉండాలన్నారు. మహిళా ఎస్ఐ పోస్టుకు ఓసీ అభ్యర్థులు 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు వరకు, బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాల నుంచి 30 ఏళ్లవరకు వయస్సు ఉండాలన్నారు. ఓసీ,బీసీ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలన్నారు. ఎస్టీ,ఎస్సీ అభ్యర్థులు గుర్తింపుపొందిన సంస్థలనుంచి డిగ్రీ పాస్‌లేదా ఫెయిల్ అయినా సరిపోతుందన్నారు. మహిళా కానిస్టేబుల్ పోస్టుకు ఓసీ అభ్యర్థులు 18 నుంచి 22 సంవత్సరాలు, బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాల వయస్సువరకు ఉండాలన్నారు. ఓసీ,బీసీ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఇంటర్ పాస్ అయి ఉండాలన్నారు. ఎస్టీ,ఎస్సీ అభ్యర్థులు గుర్తింపుపొందిన సంస్థలనుంచి ఇంటర్ పాస్‌లేదా ఫెయిల్ అయినా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు
No comments:
Post a Comment