సమైక్య వాణి వినిపించేందుకు నవంబర్ మొదటి వారంలో రాజకీయాలకు అతీతంగా చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సాప్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్.రాజారెడ్డిలు తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో వారు మాట్లాడారు. తెలంగాణ వాదులకు తలొగ్గి రాయలసీమ జిల్లాలను విడగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంద ని ఆరోపించారు. రాష్ట్రం విచ్ఛిన్నమైతే పూర్తిగా నష్టపోయేది వెనుకబడిన రాయలసీమ ప్రాంతమేనని అన్నారు. అలాంటి రాయలసీమను కూడా విచ్ఛిన్నం చేస్తే మరింత నష్టపోతామని తెలిపారు.
రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో కొంద రు వేర్పాటు వాదులు సకల సమ్మె పేరుతో ప్రజా జీవనాన్ని స్తంభింపజేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విడ్డూరమన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆందోళనలు చేసిన సమైక్యవాదులపై ప్రభుత్వం కేసులు పెట్టి జైళ్లకు పంపిందన్నారు. నెల రోజులుగా ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగి స్తున్న తెలంగాణా వాదులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కడపలో శుక్రవారం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, జేఏసీ నాయకులతో ఏర్పాటు చేసిన సదస్సులో సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా కొన్ని తీర్మానాలు చేసినట్టు వారు తెలిపారు.

No comments:
Post a Comment