అష్ఠదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబికా, మల్లికార్జునస్వామి దేవస్ధానంలో ఆర్జిత సేవ టికెట్ల ధరలను భారీగా పెంచి భక్తులను దోచుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, కాళింగ నరసింహవర్మలు అన్నారు. భక్తులకు ఎలాంటి కష్టం వాటిల్లిన, కోరిన కోరికలు తీర్చు కొంగుబంగారం అయిన స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి, మొక్కులు తీర్చుకునే అవకాశం లేకుండా దేవస్ధానం వారు ఆర్జిత సేవ టికెట్ల ధరలను పెంచి భక్తులను నిలువు దోపిడీ చేయడం దారుణమని అన్నారు. మొన్నటికి మొన్న భక్తులు ఎంతో పవిత్రంగా చూసే లడ్డు, పులిహోర ప్రసాదాల ధరలను పెంచి భక్తులను ఇబ్బంది కల్గించాలని వారు విమర్శించారు. దేవస్ధానం అధికారులు భక్తుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment