పాల ఉత్పత్తిని పెంచేందుకు గ్రామాలలో పాల ప్రగతి కేంద్రాల (మినీ డెయిరీ యూనిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ రాజశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర మిల్క్ మిషన్ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోజూ 3కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని, దీనిని 5 కోట్లకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
రాబోయే ఐదేళ్లలో పాడి పశువులు, దూడల పెంపకం, వట్టిపోయిన పశువుల పోషణ, పాలశీతల కేంద్రాల నిర్వహణ తదితర కార్యక్రమాలు చేపట్టి గణనీయమైన ఉత్పత్తి సాధించాలని అధికారులకు సూచించారు. ‘రాష్ట్ర మిల్క్‌మిషన్’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని సభ్యులందరికీ అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వర్క్‌షాపు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లాలోనూ సంచార పశు వైద్యశాలలను (మొబైల్ వెటర్నరీ క్లినిక్) ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలు పితకడంతో పరిశుభ్రత ముఖ్యమన్నారు
No comments:
Post a Comment