రంజీల్లో తమ అద్భుత ప్రతిభతో జిల్లాకు పేరు తెచ్చిన క్రికెటర్లు ప్రసాద్‌రెడ్డి, షాబుద్దీన్, డీబీ ప్రశాంత్‌కుమార్ సరసన ఇప్పుడు సల్మాభాను చేరింది. సల్మా సాధారణ మధ్యతరగతి యువతి. ఈమె తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం సహకారంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. క్రికెట్‌లోకి అమ్మాయిలు అడుగుపెట్టడమే అరుదైన ఈ రోజుల్లో సల్మాభాను ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
profile:
సల్మాభాను కుటుంబం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు వద్ద నివాసముంటోంది. తండ్రి సయ్యద్ అప్సర్ రైతు. తల్లి మహముదా గృహిణి. సల్మా ప్రస్తుతం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. 2003లో ఆఫ్ స్పిన్నర్ గా క్రికెట్ కెరియర్ ప్రారంభించింది. జిల్లా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి సాగర్ చౌదరి ఈమె గురువు. జిల్లా జట్టుకు ఎంపికై అనతికాలంలోనే కీలక క్రికెటర్‌గా ఎదిగింది. 2007లో జాతీయ మహిళా క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐలోకి విలీనం చేశారు. అదే ఏడాది జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌కు సల్మా హాజరైంది. అయితే..తన ఆటతీరుతో సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నిరాశ చెందకుండా మరింత శ్రమించింది. ఆ మరుసటి ఏడాదే రాష్ట్ర అండర్ -19 మహిళా జట్టుకు ఎంపికై, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2009లో సీనియర్ మహిళా క్రికెట్ టోర్నీలో ఆడే అవకాశం లభించింది.
అదే ఏడాది అండర్ -19 సౌత్ ఇండియా టోర్నీలో తమిళనాడుపై 5 వికెట్లు, కర్ణాటకపై 3 వికెట్లు తీసుకుని, నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికైంది. 2010లో సౌత్ ఇండియా సీనియర్ క్రికెట్ టోర్నీలో 13 వికెట్లు తీసుకుని సత్తా చాటింది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా సౌత్ ఇండియా జట్టులో చోటు సంపాదించింది. వైజాగ్‌లో జరిగిన ఆలిండియా ఇంటర్ జోనల్ పోటీల్లో పాల్గొంది. అందులోనూ ప్రతిభ చూపడంతో సీనియర్స్ జాతీయ క్రికెట్ శిక్షణ శిబిరానికి ఎంపిక చేశారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ ఇచ్చారు.
ఇండియా రెడ్ జట్టుకు ఎంపిక
త్వరలో జరగనున్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మహిళా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా రెడ్ జట్టులో సల్మాభాను చోటు దక్కించుకుంది. బరోడాలో ఈ నెల 4న జరగనున్న మ్యాచ్‌లో ఆమె ఆడనుంది.
భారత జట్టుకు ఆడటమే లక్ష్యం - సల్మా
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. అందులోనే ముం దుకెళ్తున్నా. ఆర్డీటీ ప్రోగ్రామ్ డెరైక్టర్ మాంఛూఫై, జిల్లా క్రికెట్ సం ఘం సభ్యుడు, కోచ్ సాగర్‌చౌదరి సహా యం మరువలేనిది. భారత జట్టుకు ఆడాలన్నదే లక్ష్యం. మా తల్లిదండ్రుల ఆశయం కూడా ఇదే. ఆ దిశగా ముందుకెళ్తున్నా.

Best of Luck to Salma Banu
ReplyDelete