ప్రముఖ ఎరువుల కంపెనీ ‘ఇఫ్కో’ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆదర్శరైతులకు ఉచితంగా
సిమ్‌కార్డులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం స్థానిక
వ్యవసాయ శాఖ కార్యాలయంలో జేడీఏ కె.సాంబశివరావు కొంతమంది ఆదర్శరైతులకు
గ్రీన్‌కార్డు పేరిట ఎయిర్‌టెల్ సిమ్‌కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడానికి గ్రీన్‌కార్డు
ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు మెరుగైన
సేవలు అందించాలన్నారు. ఇఫ్కో జిల్లా ప్రతినిధి చంద్రశేఖరరెడ్డి
మాట్లాడుతూ మొదటివిడత మండలానికి ఐదుగురు ఆదర్శరైతుల చొప్పున 273 మందికి
గ్రీన్‌కార్డులు అందజేస్తున్నామన్నారు. దశల వారీగా అందరికీ పంపిణీ
చేస్తామన్నారు. వ్యవసాయం, 16 అనుబంధ రంగాలకు సంబంధించి రోజూ ఐదు వాయిస్
మెసేజ్‌లు ఉచితంగా అందజేస్తామన్నారు. మరింత సమాచారం కోసం 534351 అనే
హెల్ప్‌లైన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రవి, ఇఫ్కో
ప్రతినిధులు సతీష్‌కుమార్, రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
No comments:
Post a Comment