
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా రోజులుగా ఎన్నో ఊహాగానాలు
వినిపిస్తున్నాయి. 150వ సినిమా డైరెక్ట్ చెయ్యబోతున్నారంటూ చాలామంది
డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఆ మధ్య వివి వినాయక్ ఫైనల్ అయినట్టు కూడా
వార్తలు వచ్చాయి. అయితే మతాజా సమాచారం ప్రకారం గజిని, సెవెన్త్ సెన్స్
చిత్రాల దర్శకుడు ఎఆర్ మురుగదాస్ పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. సెవెన్త్
సెన్స్ తర్వాత చిరంజీవి ఆబ్లిగేషన్ వల్ల మురుగదాస్ కి అతని 150వ
చిత్రానికి స్ర్కిప్ట్ రెడీ చెయ్యాల్సిన అవసరం ఏర్పడిందట. గతంలో చిరంజీవితో
స్టాలిన్ చేసిన మురుగదాస్ ఇప్పుడు 150వ సినిమాకి కూడా స్ర్కిప్ట్ రెడీ
చేసే పనిలోనే ఉన్నాడని, త్వరలోనే అతని డైరెక్షన్ లో సినిమా ప్రారంభం
కాబోతోందన్న వార్త ఫిలింనగర్ లో వినిపిస్తోంది.
No comments:
Post a Comment