Tuesday, 6 December 2011

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై చర్యలు...చిరంజీవి

పార్టీ విప్ ధిక్కరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి మంగళవారం చెప్పారు. ఆయన పిఆర్పీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం స్పీకర్‌ను కలిసి విప్ ధక్కరించిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు తన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారన్నారు. స్వార్థానికి అతీతంగా ప్రజల పక్షాన మేం నిలబడతామని చెప్పారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు సంతోషంగా ఉందన్నారు.ప్రజలు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, అవినీతి ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు ప్రజలకు ఉపయోగ పడే విధంగా ఏం చేసినా తప్పు కాదన్నారు. సిఎం పాలనపై తమకు విశ్వాసం ఉందన్నారు. పిఆర్పీ ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభాలకు గురి చేశారని కానీ అవి సఫలం కాలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టాయని విమర్శించారు. పడగొట్టి కుర్చీ ఎక్కాలనుకున్న వారి కోరికను మేం నెరవేరకుండా చేశామన్నారు. నిన్నటి అవిశ్వాసం ఘటన విపక్షాలకు చెంపపెట్టు అన్నారు.

No comments:

Post a Comment