అధికారం ఉండగానే అందినంత దండుకోవాలన్నది వారి లక్ష్యం..! అంది వచ్చిన
అవకాశాలను అందిపుచ్చుకుంటూ అక్రమార్జనలో చెలరేగుతున్నారు.. వారి దెబ్బకు
అధికారులు హడలెత్తిపోతున్నారు. ఒత్తిళ్లకు తాళలేక.. మాటలు పడలేక మనస్థాపం
చెందిన అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. తాజాగా రోడ్లు,
భవనాల శాఖ ఎస్‌ఈ పి.వెంకటరమణారెడ్డి మూడు నెలల దీర్ఘకాలిక సెలవుపై
వెళ్లారు. ఇదే శాఖకు చెందిన మరో ఇద్దరు డీఈలు కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు.
No comments:
Post a Comment