కేసులు.. విచారణలతో నిత్యం బిజీగా ఉండే సీబీఐ జాయింట్ డైరెక్టర్
లక్ష్మీనారాయణ మంగళవారం శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమల
వచ్చారు. ఉదయం తిరుమల చేరుకున్న ఆయన కాసేపు విశ్రాంతి పొందారు. అనంతరం
శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాపవినాశనం, జాపాలి, వేణుగోపాలస్వామి ఆలయం
తదితర సందర్శక ప్రాంతాలలో పర్యటించారు. రాత్రి విరామ సమయంలో ఆయన కుటుంబ
సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తన కుమారుడికి త్వరలో పరీక్షలు
జరగనుండటంతో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు సమాచారం.
No comments:
Post a Comment