హైదరాబాద్ నిమ్స్ సెగలు కడప రిమ్స్‌ను కూడా తాకాయి. నిమ్స్‌లో ఖైదీలకు
వైద్యంపై జరిగిన కుంభకోణం లాంటిదే కడప రిమ్స్‌లోనూ చోటుచేసుకుంది. దీంతో
విచారణ జరిపిన సర్కార్, రిమ్స్ ఆర్ఎంఓ, సూపర్నెంట్‌లను సస్పెండ్ చేసింది. ఈ
వ్యవహారం కడపలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విచారణలో ఉన్న ఖైదీలకు
ఎలాంటి అనారోగ్యం లేకున్నా వైద్యం కోసం కడప రిమ్స్‌లో చేర్చుకున్నారు. అలాగే వారిని హైదరాబాద్ నిమ్స్‌కు రెఫర్ చేశారు. చాపాడు మండలం
శెట్టిపల్లికి చెందిన జయరాం రెడ్డితో పాటు, మరో ఇద్దరు ఓ మర్డర్ కేసులో
నిందితులు. విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని కడప రిమ్స్‌లో చేర్చుకోవడమే
గాకుండా మరింత వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనలో
నిమ్స్ వైద్యులు సస్పెండ్ కాగా, కడపలో కూడా విచారణ ఎదుర్కొంటున్న ఆర్‌ఎంఓ,
సూపర్నెంట్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ
చేశారు. రిమ్స్ వైద్యుల సస్పెన్షన్‌తో డాక్టర్ల చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం
అవుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ప్రలోభాలకు లోబడి చికిత్సలకు రిఫర్
చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
No comments:
Post a Comment