కాంగ్రెస్ ప్రభుత్వం, త్వరలో ఇంటికి పంపుతాం ...నారా చంద్రబాబు నాయుడు
ఇది దద్దమ్మ ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు
నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని ఇక ఇంటికి పంపిస్తామని ఆయన
అన్నారు. రాజకీయాల కోసం నేను ఈ యాత్రలు చేయడం లేదు, మరి అటువంటప్పుడు
టి.ఆర్.ఎస్., కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన
ప్రశ్నించారు.
రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వంలో ఇసుమంతైనా చలనం లేదని ఆయన
అసహనం వ్యక్తం చేశారు. తాము పోరాటం చేస్తున్నది రైతులకోసమేనని ఆయన
అన్నారు. దేశంలో అవినీతి రహిత సమాజం అవతరించాలంటే లోక్ పాల్ బిల్లు
పరిధిలోకి సి.బి.ఐ.ని తీసుకురావలసిందేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడు డిమాండు చేశారు.
లోక్ పాల్ బిల్లు పరిధిలోకి సి.బి.ఐ.ని తీసుకువచ్చినప్పుడే అవినీతిని
రూపుమాపడం సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా ఎవరు
పోరాడినా తమ పార్టీ చిత్తశుద్ధితో మద్దతు ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.
అన్నా హజారే దేశంలో అవినీతిని నిర్మూలించడానికి పోరాడుతున్నారని ఆయన గుర్తు
చేశారు.
రాజకీయ నాయకుడు రాజకీయం లేకుండా ప్రజల కోసం యాత్రలు చేసే రోజులా ఇవి బాబుగారూ !
ReplyDelete