న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ లో ముద్దుగుమ్మలు కోట్లు దాకా డిమాండ్!
న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ లో
ఎక్కువ డిమాండ్ సంపాదించి,ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్న ముద్దుగుమ్మలు
ముగ్గురే. వాళ్లే కత్రినా కైఫ్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా. ముందుగా
వీరిలో కత్రినా కైఫ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఆమెను రెండు కోట్లు దాకా
ఇచ్చేందుకు క్లబ్ నిర్వాహకులు వెంటబడుతున్నట్లు సమాచారం. అయితే ఆమె సూపర్
హిట్ ఐటం సాంగ్ షీలా కీ జవానీని స్టేజ్ పై డాన్స్ చేయాలి. ఈ కార్యక్రమంలో
ఆమె కేవలం 15 నిమిషాలు మాత్రమే వుంటుంది. అయితే ఆమెకు ఆ రేటు ఇవ్వటానకి
విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే ఇప్పటివరకూ కత్రినా ఎవరకీ హామీ ఇవ్వలేదు.
ఎక్కువ ఎవరు ఆఫర్ చేస్తే వారితో కమిటవ్వటానికి ఆమె వెయిట్ చేస్తోందని
బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.బాలీవుడ్ ఐటం బాంబు మల్లికా షెరావత్ రేటు అమాంతం పెరిగిపోయింది. ఈ డిసెంబర్
నెలాఖరున అంటే కొత్త సంవత్సరం ప్రారంభంలో న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ ను
సెలబ్రేట్ చేసుకోవటానికి ఆమె తన రేటుని పెంచేసింది. అందుకోసం ఆమె తన రేటుని
నిముషానికి నాలుగు లక్షలు అని ప్రకటించింది. అయినా సరే ఆమెను బుక్
చేసుకోవటానికి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పోటి పడుతున్నాయి. ఆమె తన హోటల్లో
డాన్స్ చేస్తుంది లైవ్ గా అని అంటే వచ్చే మొత్తాన్ని వారు లెక్కేసుకుంటూ
ఆమె వెంట పడుతున్నారు. ఆ రాత్రి ఆమె కేవలం పదకొండు నుంచి పన్నెండు దాకానే
డాన్స్ చేస్తుంది. ముంబైలోని ఓ స్టార్ హోటల్ వారు ఆమెకు పన్నెండు కోట్లు పే
చెయ్యటానికి ఆమెను బుక్ చేసుకున్నారు.
No comments:
Post a Comment