Wednesday, 21 December 2011

ఏఆర్ రహమాన్‌కు తాజ్ మహల్ సమీపంలో అనుమతి నిరాకరణ!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్‌కు ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారి నుంచి చేదు అనుభవం ఎదురైంది. ‘ఏక్ దివాన్ థా’ కోసం రహమాన్ ఓ సాంగ్ కంపోజ్ చేస్తుండగా తాజ్ మహల్ సమీపంలో చిత్రీకరణ జరుపాల్సింది. ఇందుకోసం తాజ్ మహల్ సమీపంలోని మెహతా బాద్ వద్ద పర్మిషన్ అడగ్గా...ఏఎస్ఐ(ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా) వారిని అనుమతి కోరగా అనుమతి ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పారు అధికారులు. ఇలా సినిమాలకు అనుమతి ఇస్తూ పోతే తాజ్ మహల్ పరిసరస ప్రాంతాలు డ్యామేజ్ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఇది వరకు మేరి బ్రదర్ కి దుల్హన్ చిత్రం షూటింగుకు కూడా అనుమతి నిరాకరించారు.

No comments:

Post a Comment