Wednesday, 21 December 2011

రాజమౌళి నా కుంకుమ బొట్టు దిద్దాడు...అక్కినేని నాగార్జున

 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు - "అలాగే.. రాజమౌళిగారు ఈ కథను బాగా ఇష్టపడ్డారు. ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఈ చిత్రంలో ఎక్కువ. ఆయన వర్కింగ్ స్టైల్ ముచ్చటగా ఉంటుంది. సినిమా తప్ప ఇంకేమీ తెలియని మనిషి. క్లైమాక్స్ సన్నివేశాలు, స్టంట్స్ అన్నీ ఆయనే దగ్గరుండి చేయించుకున్నారు. పోరాట సన్నివేశాలకు రజాకార్ల ఉద్యమంలో ఎటువంటి పరికరాలను ఉపయోగించారో ఇప్పుడు మేం కూడా వాటినే వాడాం. పూర్తిస్థాయి సినిమా చేయడానికి రాజమౌళి ఎప్పుడు సిద్ధమంటే అప్పుడు నేను కూడా సిద్ధమే" అని చెప్పారు."నాకు పొడవాటి జుట్టు బాగా సెట్టవుతుంది. ఈ సినిమాకు కూడా నాలుగైదు రకాల హెయిర్ స్టైల్ చేసి చూశాం. కానీ ఏదో లోటు కనిపించింది. ఓ రోజు రాజమౌళి నా నుదుటన కుంకుమ బొట్టు దిద్దాడు. అద్దంలో చూస్తే గెటప్‌కు నిండుదనం వచ్చినట్టనిపించింది. ఇందులో నా వేషధారణకు మంచి మార్కులు పడుతున్నాయి" అంటున్నారు నాగార్జున. ఆయన తాజా చిత్రం రాజన్న ఈ వారంలో విడుదల కానుంది.ఎక్కడ అన్యాయం కనిపిస్తే... అక్కడ రాజన్న ఉద్భవిస్తాడు. ప్రజలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పోరాటం చేస్తాడు. నేలకొండపల్లెలోని గ్రామస్తులకు తన పాట ద్వారా ధైర్యం నూరిపోస్తాడు రాజన్న. పాట ప్రధానంగా సాగే సినిమా కథ ఇది.

No comments:

Post a Comment