Wednesday, 21 December 2011

కడప జిల్లా వింత దూడ జననం: పూజలు చేస్తున్న గ్రామస్తులు

కడప జిల్లా రాజంపేటలో వింత దూడ జన్మించింది. పెద్ద పెద్ద కళ్లు, పొట్టి కాళ్లతో దూడ చూడటానికి విచిత్రంగా ఉంది. నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె గ్రామ పంచాయితీలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు దూడను నందీశ్వరుడితో పోలుస్తున్నారు. ఇది భగవంతుడి మహిమని ఆనందోత్సాహాలు మునిగిపోయారు. దూడకు బొట్లు పెట్టి పూజలు చేస్తున్నారు. అయితే జన్యులోపమే దూడ వింత ఆకారానికి కారణమని పశువైద్యులు అంటున్నారు.

No comments:

Post a Comment