రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంటు నాలుగవ దశ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి అర్హతను బట్టి అక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని కడప ఆర్డీవో వీరబ్రహ్మయ్య చెప్పారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన బాధితులతో ఆయన మాట్లాడారు. జూనియర్ ప్లాంటు అటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందుకు పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఐటిఐ పాసై ఉండాలని ఆయన చెప్పారు. బాధితుల పక్షాన వచ్చిన పద్మనాభరెడ్డి మాట్లాడుతూ అధికారులు నిర్ణయించిన అర్హత ఉన్న ప్రజలు బాధితుల్లో లేరన్నారు.
చదవడం, రాయడం వస్తే సరిపోయే మజ్దూర్ పోస్టులు ఇప్పించాలని కోరగా తాను ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్టీపీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పలు సమస్యలపై ప్రజలు ఆర్డీఓకు విన్నవించారు

No comments:
Post a Comment