రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమనిc కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం వెల్దుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కోట్ల సమక్షంలో ఎఐటియుసి నాయకులు జయన్నాచారి, వాల్మీకి సంఘం నాయకులు మల్లికార్జున నాయుడు, వెంకటేశ్వరనాయుడు, టిడిపి నాయకులు చిన్న అనంతయ్య, మల్లికార్జునతో పాటు 200మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎంపీ కోట్ల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తానని అన్నారు. గ్రామాల్లో ప్రజలు ఫ్యాక్షన్‌కు దూరంగా వుండాలని, ఫ్యాక్షన్ క్యాన్సర్ లాంటిదని చెప్పారు. ఇటీవల వెల్దుర్తి మండలంలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పార్టీలో చేరారని, వారు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం తగదని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గల్లంతు అవుతుందని, కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రకటన చేయిస్తానని ఆయన చెప్పారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతోపాటు ఇళ్లు మంజూరు చేయిస్తామని అన్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో తాగునీటి కోసం తన కోటా నుండి 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తానని వివరించారు. పార్టీలకు అతీతంగా పనులు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చెరుకులపాడు నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజయమోహన్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, తొగర్చెడు చంద్రారెడ్డి, ఆనంద్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకటరామిరెడ్డి, మల్లికార్జునయ్య పాల్గొన్నారు
No comments:
Post a Comment