కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 21న తిరుపతి, చిత్తూరుల్లో సీపీఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున 24గంటల నిరాహారదీక్ష జరుగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి పి.హరినాథ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యుల సమా వేశం ఎస్.సయ్యద్ బాషా అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా హరినాథ రెడ్డి మాట్లాడుతూ,2 జీ కుంభకో ణాల్లో అవినీతికి పాల్పడిన యూపీఏ ప్రభుత్వ మంత్రులు ఊచలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు నిబంధనలు చెప్పే ప్రభుత్వం జిందాల్ వంటి కంపె నీలకు వేలాది ఎకరాలు బంగారుపళ్ళెంలో పెట్టి ఇస్తున్నారని, వీరికి నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు.
2.50 లక్షల పోస్టులు భర్తీ చేయని ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం ఉత్తుత్తి మాటలుగా వర్ణించారు. 21న తిరుపతిలో జరిగే 24గంటల నిరాహార దీక్షలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, చిత్తూ రు పట్టణంలో జరిగే దీక్షలో ప్రముఖ నాయకులు పాల్గొంటారని చెప్పారు
No comments:
Post a Comment