గ్రేటర్ రాయలసీమ లక్ష్య సాధన కోసం నవంబర్ 3వ తేదీన అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కుంచెం వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో రాయలసీమ రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల నుంచి ఇప్పటి వరకు ఆరుగురు ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్లు ఎన్నికైనా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అన్ని జిల్లాలను అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా రాయలసీమ వెనుకబాటును గుర్తు చేసిందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే అంతకన్నా ముందుగా ప్రత్యేక రాయలసీమ ప్రకటించాలన్నారు.
కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, రాయచూరు, బళ్లారి, కోలార్, క్రిష్ణగిరి, వేలూరులతో కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు
దానికి రాజధాని "మద్రాసు" అయితే, అదిరిపోతుంది..!
ReplyDeleteఅప్పుడు, హైదరాబాద్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టే..!