Thursday, 13 October 2011

శ్రీశైలం ఆలయానికి మరింత భద్రత

భ్రమరాంబమల్లికార్జునస్వామివార్ల ఆలయ భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదనపు భద్రతా బలగాలను ఎంపిక చేసి, పదవీవిరమణ పొందిన డీఎస్పీ స్థాయి అధికారిని ముఖ్యఅధికారిగా నియమించారు. గతంలో 40మంది ప్రైవేట్ భద్రతా సిబ్బంది విధులు నిర్వహించేవారు. మరో 30మందిని నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. సీఎస్‌ఓ (చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్) బాధ్యతలు స్వీకరించాక ఆయనతోపాటు మరో నలుగురి అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది ఎంపిక నిర్వహణ బాధ్యతలను వీరు స్వీకరించారు.

రాణా మ్యాన్‌పవర్ అండ్‌ప్లేస్‌మెంట్ ప్రైవేట్‌లిమిటెడ్ ద్వారా సుమారు 120మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 50మందిని ఎంపిక చేశారు. వీరందరికీ ఆరోగ్యపరీక్షలు, శరీరదారుఢ్య, సమర్థత పరీక్షలను నిర్వహించి అందులో 23మందితో పాటు ఏడుగురు మహిళలను భద్రతా సిబ్బందిగా నియమించారు. దీంతో 72మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, 40మంది హోంగార్డులను ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసినట్లయింది. వీరంతా మూడుషిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారు.

పోలీసు తరహాలో శిక్షణ నిచ్చాం: కరుణానిధి , సీఎస్‌వో
ప్రైవేట్ సెక్యూరిటీగా ఎంపికైన వారికి పోలీస్ తరహాలో శిక్షణ ఇచ్చాం. భక్తులతో ఎలా మెలగాలో నేర్పించాం. భద్రత విభాగానికి సంబంధించి అధునాతన పరికరాలను సమకూరుస్తామని ఈవో వెంకటేశ్వర్లు హామీ
ఇచ్చారు

No comments:

Post a Comment