Thursday, 13 October 2011

రచయితల సమ్మేళనం తిరుపతిలోని

ఈనెల 15, 16 తేదీలలో ఈశాన్య, దక్షిణ భారతీయ రచయితల సమ్మేళనం తిరుపతిలోని ఎస్వీయూనివ ర్సిటీ సెనేట్ హాలులో జరగనుంది. సాహిత్య అకాడమీ, విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పలువురు రచయితలు, కవులు పాల్గొననున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభసమావేశానికి ప్రముఖ కథా రచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, ప్రముఖ అస్సామీ రచయిత లక్ష్మీ నందన్ బోరా, సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి హరేకృష్ణ శత్పథి, సాహిత్య అకాడమీ ఉపకార్యదర్శి కె. శ్రీనివాసరావు హాజరవుతారు. తొలిరోజు జరిగే కవితాపఠనంలో కొండేపూడి నిర్మల, కె.ఎస్ రమణ, కె.పి.మృత్యుంజయ్(కన్నడ),రోజ్ మేరీ(మలయాళం), త.ఇబోపిషక్ సింగ్(మణిపురి), రోజ్‌మేరీ జూచు(తెనిడి) పాల్గొంటారు.

అదే రోజు సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో అస్సామీ నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆదివారం ఉదయం జరిగే కథాపఠనంలో ఆర్.ఎం. ఉమామహేశ్వర రావు, ఏ.ఎన్. జగన్నాథ శర్మ, చంద్రలత, జ్యోతిర్మయి ప్రధాని(రాజ్‌బోంత్షి), సుబ్రభారతి మణియన్(తమిళం) పాల్గొంటారు. ఆరోజు మధ్యాహ్నం జరిగే కవితాపఠనంలో ఎస్.మునిసుందరం, పెరుగు రామకృష్ణ, టెంసులా ఓ(ఇంగ్లీషు), అరబిందో ఉజిర్(బోడో), జయశ్రీ కంబార్(కన్నడ), హరిదాస్ బాలకృష్ణన్(మలయాళం), రఘు లైశాంతెమ్(మణిపురి),మార్గరెట్ పాచౌ(మిజో) పాల్గొంటారు. సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో మణిపురి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన, మృదంగ నృత్యం ఉంటుంది

No comments:

Post a Comment