Thursday, 13 October 2011

కర్నూలు విద్యార్థులకు పోటీలు

జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులకు ఈ నెల 15న వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ డీఈఓ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు స్థానిక పాత కంట్రోల్ రూం వద్ద ఉన్న ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్‌లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. కర్నూలు, డోన్, నంద్యాల, ఆదోని డివిజన్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులు ఈ పోటీకి అర్హులన్నారు. మత సామరస్యం-జాతీయ సమైక్యత అనే అంశంపై పోటీ ఉంటుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహక బహుమతులు ఉంటాయన్నారు

No comments:

Post a Comment