ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే
ఎక్సైజ్ శాఖలో
సిబ్బంది కొరత ఆ శాఖ పరువు తీస్తోంది. నకిలీ మద్యం ఏరులై పారుతున్నా చోద్యం
చూడటం మినహా ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
దశాబ్దాలుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న కొద్ది మందిపైనే పనిభారం
అధికమైంది. ప్రస్తుతం ఈ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లలో దాదాపు అందరూ
ఏఆర్ విభాగం నుంచి డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నవారే. ఎక్సైజ్ శాఖకు చెందిన
కానిస్టేబుళ్లు జిల్లాకు ఐదారుగురికి మించి లేరు. ఏ స్టేషన్లోనూ మహిళా
కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు.అనంతపురం
జిల్లాలో 15 సీఐ పోస్టులు, 20 ఎస్‌ఐ, 200 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా
ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 14 సీఐ, 4 ఎస్‌ఐ , 87 కానిస్టేబుళ్ల పోస్టులు
ఖాళీగా ఉన్నాయి. కడప జిల్లాలో 3 సీఐ పోస్టులు, 62 కానిస్టేబుళ్ల
పోస్టులు, చిత్తూరు జిల్లాలో 175 కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
11మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాల్సిన అనంతపురం జిల్లా
కంబదూరుఎక్సైజ్ స్టేషన్లో కేవలం ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉండడం పరిస్థితి
తీవ్రతను తెలియజేస్తోంది.
10 ఎక్సైజ్ సర్కిళ్లను, రెండు ప్రధాన చెక్‌పోస్టులను పర్యవేక్షించాల్సిన
పెనుకొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఇఎస్) పోస్టును ఏడాదిగా భర్తీ చేయలేదు.
అక్రమ మద్యం నివారణ కోసం జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఎక్సైజ్
చెక్‌పోస్టుల్లో రద్దీని బట్టి ఇద్దరు లేదా ముగ్గురు సీఐలు విధులు
నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాయలసీమలోని ఏ చెక్‌పోస్టులో కూడా
సీఐలు విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. అనంతపురం జిల్లాలోని 6
చెక్‌పోస్టుల్లో 13మంది సీఐలు విధులు నిర్వహించాల్సి ఉండగా ఏ
చెక్‌పోస్టులోనూ సీఐ లేరు. కర్నూలు జిల్లాలో 6 చెక్‌పోస్టులు ఉండగా అన్ని
చెక్‌పోస్టుల్లోనూ 10 మంది సీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ప్రతి
జిల్లాలో ఒక డిప్యూటి కమిషనర్, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు చొప్పున
ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు ఆయా ఎక్సైజ్ స్టేషన్లు, చెక్‌పోస్టులను
పర్యవేక్షించాల్సి ఉంది. జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లోని సీఐలతోపాటు నకిలీ
మద్యం, అక్రమ సారా నివారణకు ఎక్సైజ్ స్టేషన్ల వద్ద ఒక్కొక్క ఇన్‌స్పెక్టర్
చొప్పున ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐలు, గుంతకల్లు లాంటి చోట ట్రైన్
చెకింగ్ పార్టీలు, సరిహద్దుల్లో రెండు మూడు బార్డర్ పెట్రోలింగ్ పార్టీలు
ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది.Thursday, 16 February 2012
రాలయసీమ జిల్లాలో ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత

ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment