వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షడు వైయస్ జగన్ తమకు శత్రువేనని
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్ఫష్టం చేశారు. టిడిపి ఎంతటి శత్రువో,
జగన్ కూడా అంతటి శత్రువేనని, ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన
అన్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశంలో ఆయన పార్టీ
శాసనభ్యులకు గురువారం సాయంత్రం మార్గనిర్దేశం చేశారు. వైయస్ జగన్‌పై ఎందుకు
మెతగ్గా వ్యవహరిస్తున్నారని కొంత మంది శాసనసభ్యులు కిరణ కుమార్ రెడ్డిని,
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను నిలదీశారు. పార్టీని వదిలి వెళ్లిన
తర్వాత జగన్‌ను రాజకీయ శత్రువుగానే చూడాలని, ఇందులో ఎవరికీ ఏ విధమైన
సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు రాజకీయ
ప్రత్యర్థేనని ఆయన అన్నారు. పార్టీని బలహీనపరిచేందుకు కొంత మంది
ప్రయత్నిస్తున్నారని, దీనిపై మూడు నాలుగు రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఆయన
చెప్పారు. తమకు మద్దతు పలికే మీడియా లేదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై వచ్చే
వ్యతిరేక వార్తలను ఖండించడానికి నలుగురు మంత్రులతో ఓ కమిటీ వేస్తామని ఆయన
చెప్పారు. శాసనసభ్యులు విధిగా సభకు హాజరు కావాలని ఆయన సూచించారు.
సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, మంత్రులను అడిగి విషయాలు తెలుసుకోవాలని
ఆయన సూచించారు.
No comments:
Post a Comment