Thursday, 16 February 2012

శ్రీవారి గరుడసేవ ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీనివాసమంగా పురంలోని కల్యాణ వెం కన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామి వారికి గరుడ వాహన సేవ జరగనున్నది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. కల్యాణ వెంక న్న ఆలయ పరిసరాల్లో బ్యారికేడ్లు ఏర్పా టు చేస్తున్నారు. గరుడ వాహన సేవకు వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, ఉచిత లడ్డూల పంపిణీకి చర్యలు తీసుకున్నారు.గరుడ వాహనానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేస్తున్నారు. అలాగే శ్రీవారి ఆలయంతో పాటు పరిసరాల్లో రకరకాల పూలతో తయారు చేసిన దేవదేవుని ప్రతిరూపాలను ఏర్పాటు చేయించి, ముస్తాబు చేస్తున్నారు. వాహన సేవానంతరం భక్తులు స్వామివారి మూలమూర్తిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి గరుడవాహన సేవను పురస్కరించుకుని గతంలో కంటే ఈ ఏడాది అయిదు రెట్లు ఎక్కువగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 10 వేల మందికి తక్కువ లేకుండా జనం స్వామి వారి గరుడవాహనంలో పాల్గొం టారని అంచనా వేస్తున్నారు. టీటీడీ జేఈవో వెంకటరామిరెడ్డి గరుడవాహన ఏర్పాట్లుపై బుధవారం మరోసారి అధికారులతో సమావేశమయ్యారు.ట్రాఫిక్ మళ్లింపు ఇలా...గరుడ వాహన సేవను పురస్కరించుకుని సాయంత్రం 7 నుంచి 12గంటల వరకు తిరుపతి-పీలేరు మార్గంలో నడిచే అన్ని వాహనాలను చంద్రగిరి, ఐతేపల్లి మీదుగా మళ్లించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. పీలేరు నుంచి వచ్చే వాహనాలు రంగంపేట-ఐతేపల్లి-చంద్రగిరి మీదుగా మళ్లించనున్నారు. తిరుపతి నుంచి వచ్చే వాహనాలు చంద్రగిరి-మిట్టపాళెం మీదుగా పంపనున్నట్లు తిరుపతి వెస్ట్ డీఎస్పీ మాల్యాద్రి తెలిపారు. ఈ మేరకు వాహనదారులు సహకరించాలని వారు కోరారు.

1 comment:

  1. Nice presentation for telugu peoples in teligu literature about sri varu seva.

    Regards,
    www.tirupatidarshan.org

    ReplyDelete