Thursday, 16 February 2012

తొలి దశ చికిత్స విజయవంతం ట్విట్టర్‌లో సందేశం... యువరాజ్

ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల కణితిని తన శరీరం నుంచి తొలగించారని భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న యువరాజ్‌కు ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్‌లో కెమోథెరఫీ చికిత్స జరుగుతోంది. తొలి దశ చికిత్సలోనే కణితిని శరీరం నుంచి వేరు చేసినట్టు డాక్టర్ లారెన్స్ శుభవార్త తెలిపారని ట్విట్టర్‌లో వెల్లడించారు. చికిత్సలో రెండవ దశ ప్రారంభమైందన్నారు. తొలి దశ చికిత్సలోనే కణితిని శరీరం నుండి వేరు చేసినట్లు డాక్టర్ లారెన్స్ తనకు శుభవార్తను తెలిపారని ట్వీట్ చేశాడు. ఇక్కడ నుండి కెమోథెరపీ‌లో రెండవ చికిత్సను ప్రారంభిస్తారని అన్నాడు. ఇది ఇలా ఉంటే ఊపిరితిత్తుల బీణ కణ క్యాన్సర్‌తో బాధపడుతున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని సైక్లింగ్ దిగ్గజం లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ సందేశం పంపాడు. ప్రస్తుతం యువీ అమెరికాలోని బోస్టన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలిసిందే. లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ పంపిన సందేశాన్ని యువరాజ్ తన ట్విట్టర్ పేజిలో లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ ఫోటోతో సహా అభిమానులకు తెలిసేలా పెట్టాడు.లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ యువీకి పంపిన సందేశం ఏమిటంటే 'నీ కోసం మా 'లివ్‌స్టాంగ్' టీమ్ మొత్తం ఉందనే విషయం నీకు తెలియాలని కోరుకుంటున్నాం. విజ్ఞానం శక్తి వంతమైనది, ఐకమత్యమే మహాబలం, మన దృక్పధం అన్నింటికన్నా కీలకం అని నేను తరచూ చెబుతుంటాను.. నమ్ముతాను కూడా' అని సందేశాన్ని పంపాడు. సైక్లింగ్ దిగ్గజం లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన వారి కోసం ప్రత్యేకంగా లివ్‌స్టాంగ్ ఫౌండేషన్‌ని స్ధాపించి తగిన సహాయాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు లాన్స్ సందేశంపై యువీ కృతజ్ఞతలు తెలిపాడు. లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ నుండి వచ్చిన సందేశం నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. థ్యాంక్యూ లాన్స్.. త్వరలోనే మనం కలుసుకోవాలని కోరుకుంటున్నా.. అని యువరాజ్ ట్వీట్ చేశాడు.

No comments:

Post a Comment