తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వివిధ పథకాలకు ఓ భక్తురాలు రూ. 12 లక్షల
విరాళం సమర్పించారు.ఈ సందర్భంగా ఆమె సాయంత్రం దాతల విభాగానికి చేరుకుని ఈ విరాళానికి
సంబంధించిన డీడీలు అందజేశారు. అందులో రూ. పది లక్షలను బర్డ్ ఆస్పత్రికి,
నిత్యాన్నదానానికి, బాలమందిరానికి రూ. లక్ష చొప్పున వినియోగించాలని
అధికారులను కోరారు. శ్రీనివాసమంగాపురంలోని
కల్యాణ వెంకటేశ్వరస్వామివారికి హైదరాబాదుకు చెందిన మహాలక్ష్మి అనే
భక్తురాలు రూ.165 లక్షలు విలువచేసే ఆభరణాలను బుధవారం బహూకరించారు. కల్యాణ
వెంకన్న ఉత్సవమూర్తికి ఉపయోగించేలా రాగి , నికిల్ , బంగారం తాపడంతో
చేయించిన కాళంగి మర్ధనమ్ , వీణ , విల్లు , వేణువు , చర్నాకోలు , గద ,
ఖడ్గం తదితర 10 రకాల వస్తువులను ఆలయ డెప్యూటీ ఈవో గోపాలకృష్ణకు అందజేశారు. ఈ
సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో తాము ఈ వస్తువులను
కానుకగా సమర్పించామన్నారు. ఈ సందర్భంగా ఆమె సాయంత్రం దాతల
విభాగానికి చేరుకుని ఈ విరాళానికి సంబంధించిన డీడీలు అందజేశారు. అందులో రూ.
పది లక్షలను బర్డ్ ఆస్పత్రికి, నిత్యాన్నదానానికి, బాలమందిరానికి రూ. లక్ష
చొప్పున వినియోగించాలని అధికారులను కోరారు.

No comments:
Post a Comment