వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల
కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్న సన్నిధి తిరుమల పుణ్యక్షేత్రం వైకుంఠ
ఏకాదశికి సర్వహంగులతో ముస్తాబైంది. ఏకాదశి, ద్వాదశిలను పురస్కరించుకొని
పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పది రోజుల ముందే టిక్కెట్ల అమ్మకాల్ని
పూర్తి చేశారు. దేశ వ్యాప్తంగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసి ఏకాదశికి
30 వేల, ద్వాదశికి 30 వేల టిక్కెట్లను విక్రయించారు. భక్తుల తాకిడి
నేపథ్యంలో వారం రోజుల నుంచి ఏర్పాట్లలో టీటీడీ తల మునకలైంది. గతంలో ఎప్పుడు
లేని విధంగా తొలిసారిగా ఆలంయం ఎదుట ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ
ఏకాదశి రోజు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విక్రయించకూడదని
నిర్ణయించారు. క్యూలైన్లను పరిశీలించిన అధికారులు పలు నిర్ణయాలు
తీసుకున్నారు. క్యూలైన్లలో వెళ్లే భక్తులు వరాహస్వామి ఆలయంతో పాటు
స్వామివారి పుష్కరిణి సందర్శన అనంతరం దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు
చేశారు.
No comments:
Post a Comment