Wednesday, 4 January 2012

తనను నేరస్థుడిగా చూపించేందుకు సిబిఐ ...వైయస్ జగన్మోహన్ రెడ్డి

తనను నేరస్థుడిగా చూపించేందుకు సిబిఐ ప్రయత్నాలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. ఒంగోలులో జరిగిన ఫీజు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు తనపై రాజకీయ కక్ష సాధిస్తోందన్నారు. పార్టీ వదిలి పెట్టాకనే తనపై సిబిఐ విచారణకు ఆదేశించారన్నారు. సిబిఐ అంటే కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెసు ఆలోచనలను సిబిఐ అమలు పరుస్తోందన్నారు. తనను నేరస్థుడిగా చూపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన సాక్షిలో పెట్టుబడులపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.

No comments:

Post a Comment