పరమశివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం
రాత్రి శ్రీమల్లికార్జున స్వామికి వార్షిక ఆరుద్రోత్సవ
నిర్వహిస్తున్నట్లు ఈఓ హనుమంతరావు తెలిపారు. ఈ ఉత్సవంలో
భాగంగా ఆదివారం రాత్రి 10.30 గంటలకు స్వామివార్లకు లింగోద్భవకాల,
మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 9వ తేదీ సోమవారం స్వామివార్ల
ప్రాతఃకాల పూజలనంతరం 5.30 గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటుందన్నారు. అనంతరం 6
గంటలకు స్వామి అమ్మవార్లను నంది వాహనంపై వేంచేయించి పురవీధుల్లో
గ్రామోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం వేకువజామున 3.30 గంటలకు ఆలయ
ఉత్తరద్వారమైన శివాజీ గోపురాన్ని తెరచి 4 గంటలకు సుప్రభాతసేవ, 5 గంటలకు
మహామంగ ళహారతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వార్షిక ఆరుద్రోత్సవాన్ని
పురస్కరించుకుని సోమవారం వేకువజామున జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవా
టికెట్లను నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఉత్సవంలో ఆలయ
మహాద్వారమైన కృష్ణదేవరాయ గోపురం (తూర్పుద్వారం) మీదుగా గ్రామోత్సవానికి
తరలివేళ్లే స్వామివారు ధనుర్మాసంలో వచ్చే ముక్కొటిఏకాదశి, వార్షిక
ఆరుద్రోత్సవం రోజులలో మాత్రమే ఉత్తరద్వారం గుండా తరలి వెళ్లడం
విశేషమన్నారు. స్వామివార్ల ప్రాతఃకాల ఉత్తర ద్వార దర్శనానంతరం 6 గంటలకు
తూర్పుద్వారమైన శ్రీకృష్ణదేవరాయ రాజగోపురద్వారాలను తెరచి భక్తులకు దర్శన,
ఆర్జితసేవలకు అనుమతిస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు
No comments:
Post a Comment