సిడ్నీటెస్టులో చెరిగి పోయిన రికార్డులు!
సిడ్నీలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్
క్లార్క్ టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించడంతో పాటు బ్రాడ్‌మన్ సహా
పలువురి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించాడు.
గురువారం మూడో రోజు లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికి క్లార్క్ ట్రిపుల్
సెంచరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ట్రిపుల్ సెంచరీ పూర్తి చేయగానే
క్లార్క్ ఆనందంతో పిడికిలి బిగించి గాలిలోకి పంచ్ చేస్తూ గంతులు వేసాడు. ఈ
క్రమంలో క్లార్క్ ఆస్ట్రేలియా-్భరత్ టెస్టు సిరీస్‌లో వివిఎస్ లక్ష్మణ్
సాధించిన 281 పరుగుల అత్యధిక వ్యక్తిగత రికార్డును అదిగమించడమే కాకుండా
సొంత గడ్డపై ఆస్ట్రేలియా కెప్టెన్‌గా డాన్‌బ్రాడ్‌మన్ సాధించిన 270 పరుగుల
రికార్డును కూడా అధిగమించాడు. 1936నుంచి బ్రాడ్‌మన్ రికార్డు అలాగే ఉండడం
గమనార్హం.సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో 109 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ రెగ్
ఫాస్టర్ నెలకొల్పిన 297 పరుగుల అత్యధిక స్కోరును సైతం క్లార్క్
చెరిపివేసినప్పుడు స్టేడియంలోని వేలాది మంది అభిమానులు లేచి నిలబడి కరతాళ
ధ్వనులతో అతనికి అభినందనలు తెలియజేసారు. వాస్తవానికి క్లార్క్ బ్రాడ్‌మన్
నెలకొల్పిన 334 పరుగుల అత్యధిక పరుగుల రికార్డును సైతం అధిగమించే
అవకాశముండింది. అయితే ఉద్దేశపూర్వకంగానో లేదా మరే కారణం చేతనో ఆ రికార్డుకు
అయిదు పరుగుల దూరంలో ఉండగానే క్లార్క్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను
డిక్లేర్ చేసాడు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా
బ్రాడ్‌మన్ రికార్డును సమం చేయగానే ఉద్దేశపూర్వకంగానే జట్టు ఇన్నింగ్స్‌ను
డిక్లేర్ చేసి బ్రాడ్‌మన్ పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు
క్లార్క్ సైతం అదే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్
చేసినట్లు కనిపిస్తోంది. అయితే రికార్డులకన్నా జట్టు విజయమే తనకు
ప్రధానమని, అందుకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసానని క్లార్క్ చెప్పడం
విశేషం.వ్యక్తిగత రికార్డులకన్నా టీమ్ ప్రయోజనాలే ముఖ్యంగా భావించినందుకు
క్లార్క్‌పై మార్క్ టేలర్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. బ్రాడ్‌మన్
రికార్డునే కాదు తలచుకుని ఉంటే టెస్టు క్రికెట్‌లో బ్రియాన్ లారా
నెలకొల్పిన 400 పరుగుల ప్రపంచ రికార్డును సైతం అధిగమించి ఉండే వాడని టేలర్
అన్నాడు. కనీసం జింబాబ్వేపై 380 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌గా హేడన్ నెలకొల్పిన రికార్డునైనా అధిగమించి
ఉండేవాడని, అయితే మ్యాచ్‌లో జట్టు విజయం సాధించడమే ముఖ్యమని భావించిన
క్లార్క్ ఆ రికార్డులేవీ పట్టించుకోకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి
సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడని టేలర్ ప్రశంసించాడు.ఎస్‌సిజిలో చేసిన తొలి ట్రిపుల్ సెంచరీతోనే అనేక రికార్డులు బద్దలు కొట్టిన
క్రికెటర్‌గా క్లార్క్ చరిత్ర సృష్టించినప్పటికీ అతని బ్యాట్‌కు
స్పాన్సర్స్ ఎవరూ లేక పోవడం విశేషం. నాలుగు రోజుల ముందే డన్‌లప్ స్లేజెంజర్
క్లార్క్‌తో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందంనుంచి వైదొలగింది
No comments:
Post a Comment