రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక
ప్యాకెజీ ఇవ్వాలని
ఐఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షులు రాఘవరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యవౌతుందన్నారు.
కర్నూలు నగరంలోని నేతాజీ కాంప్లెక్స్ సెంటర్‌లో ఐఎన్‌టియుసి
జిల్లా, నగర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవరాజు
మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు సోనియాగాంధీ ఆలోచన విధానాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో కృషి
చేస్తున్నాయని అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఖాయిలాపడ్డ చక్కెర
కార్మాగారాలు, వివిధ పరిశ్రమల పునరుద్ధరణకు 740 కోట్ల రుణ సదుపాయాన్ని
కల్పించడం హర్షణీయమన్నారు. కార్మికులు, పేదల సంక్షేమాన్ని దృష్టిలో
పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమలులోకి తెస్తున్న ఘనత
కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఐఎన్‌టియుసి యూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు
విశ్వశాస్ర్తీ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఐఎన్‌టియూసిని బలోపేతం చేసి
కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సభ్యులు పని చేయాలని పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా ఐఎన్‌టియుసి అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్
మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేనత కార్మికులకు
వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఐఎన్‌టియుసి
అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మున్సిపాలిటీ ప్రాంతాల్లో
వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్‌ను విస్తరించి కార్మిక రంగానికి,
అభివృద్ధికి అండగా నిలుస్తామన్నారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర
అధ్యక్షులు రాఘవరాజు ప్రకటిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు
No comments:
Post a Comment