భారత బ్యాట్స్‌మెన్ ఇంట్లోనే ఆడతారు... ట్విట్టర్‌లో సెక్సీ మోడల్ పూనమ్ పాండే
నాలుగు టెస్టు సిరిస్‌లో భాగంగా ప్రస్తుతం టీమిండియా ఆస్టేలియా పర్యటనలో
ఉంది. ఆది నుండి కూడా భారత్ ఈ పర్యటనలో బోల్తా పడుతూనే ఉంది. ఇందుకు
నిదర్శనం మెల్ బోర్న్‌లో జరిగిన మొదటి టెస్టులో చెత్తగా ఆడి 1-0 విజయాన్ని
ఆస్టేలియాకు అందించారు. ఇక రెండో టెస్టుని గమనించినట్లేతే మొదటి
ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్ మెన్ 191 పరుగులకే ఆల్ అవుట్ అవ్వగా, ఆ
తర్వాత బ్యాటింగ్‌కి దిగిన ఆస్టేలియా బ్యాట్స్‌మెన్ భారత్‌ను ఉతికి ఆరేసి
నాలుగు వికెట్లను కోల్పోయి 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం
తెలిసిందే. దీంతో టీమిండియా బ్యాట్స్ మెన్‌పై రోజురోజుకీ విమర్శలు చేసే వారి సంఖ్య
పెరిగిపోతుంది. ఈ కోవ లోకి ఇప్పుడు తాజాగా సెక్సీ మోడల్ పూనమ్ పాండే
చేరారు. గతంలో ప్రపంచ కప్ గెలిస్తే భారత క్రికెటర్లకు నగ్న ప్రదర్శన
ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్ ఇప్పుడు బ్యాట్స్ మెన్‌పై
వ్యంగాస్త్రాలు మొదలుపెట్టింది. పూనమ్ పాండే తన ట్విట్టర్ ఎకౌంట్లో భారత్
బ్యాట్స్ మెన్స్ భార్య విధేయులు. కేవలం వారు ఇంట్లో మాత్రమే ఆడతారని పోస్ట్
చేసింది. ఇది మాత్రమే కాదండోయ్ తన ట్విట్టర్ ఎకౌంట్లో పూనమ్ పాండే
పొదుపుగా దుస్తులు ధరించి ఒక ఫొటో దిగి... ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, భారత
జట్టుకు మద్దతు తెలిపింది. కనీసం ఆమె అడిగితేనైనా మనోళ్లు బాగా ఆడతారంటూ
ట్విట్టర్‌లో పోస్ట్‌లు చేరాయి. మరోవైపు మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్
లాంటి వారు కూడా భారత బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా విమర్శిం చారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్నది చరిత్రకు కొనసాగింపు మాత్రమేనని సన్నీ అన్నారు.
No comments:
Post a Comment