Friday, 6 January 2012

ఆటగాళ్లందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి...కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని

సిడ్నీ టెస్ట్ లో ఇండియా ఓటమికి కారణాలు వెతకడం లేదని కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అన్నాడు. టెస్ట్‌లో ఓటమి అనంతరం మాట్లాడుతూ ప్లేయర్లందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని ధోని చెప్పాడు. మరోవైపు పాంటింగ్‌, హసీలతో పార్ట్‌నర్‌షిప్‌లు ఈ టెస్ట్‌ని మలుపు తిప్పాయని ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ అన్నాడు. సిడ్నీలో తను ట్రిపుల్‌ సెంచరీ సాధించడం, సచిన్‌ వికెట్‌ తీసుకోవడం మధురానుభూతులని క్లార్క్‌ చెప్పాడు. భారత్ - ఆసిస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ ఒక ఇన్నింగ్స్, 68 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పొందింది. ఓవర్‌నైట్ స్కోర్ 114/ 2 పరుగులతో బరిలోకి దిగిన భారత్ 400 పరుగులకు ఆల్ఔట్ అయింది. దీంతో ఒక ఇన్నింగ్స్, 68 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సచిన్(80), గంభీర్(83), లక్ష్మణ్(66), అశ్విన్(62) పరుగులు చేశారు.భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 191, రెండో ఇన్నింగ్స్ 400 పరుగులు కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 659/ 4 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా బౌలర్ హిల్ఫెనాస్‌కు 5 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు సాధించిన క్లార్క్‌కు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ దక్కింది. సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉంది. అనుకున్నట్లే సిడ్నీ టెస్ట్‌లో భారత క్రికెట్‌ జట్టు చిత్తయిపోయింది. టీమిండియాపై ఇన్నింగ్స్, 68 పరుగులతో ఆసీస్ విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ తేడాతో భారత్‌పై గెలవడం ఆసీస్‌కు ఇది పదోసారి కాగా, ఒక్క సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లోనే ఇది మూడోసారి. భారత్ ఓపెనర్‌ గంభీర్‌ 17 పరుగుల తేడాతో, సచిన్‌ 20 పరుగుల తేడాతో సెంచరీలు మిస్సయ్యారు. లక్ష్మణ్‌, ధోనీ, కొహ్లీ అవుటైనా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అశ్విన్ వీరోచితంగా పోరాడటంతో ఆసీస్‌ విజయం కాస్త ఆలస్యమైంది.

No comments:

Post a Comment