అనంతపురం జిల్లా కరువుతో అల్లాడుతున్న జిల్లా ప్రజానీకానికి విముక్తి
కరువుతో అల్లాడుతున్న జిల్లా ప్రజానీకానికి విముక్తి కలిగించాలంటే...
కృష్ణాజలాలను జిల్లాకు మళ్లించడమే ఏకైక మార్గమని నాటి గాంధేయవాది అ నంత
వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి
అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు
చేపట్టడం జరిగిందన్నారు. అందుకే హంద్రీనీవా రూపకర్తగా అనంత వెంకటరెడ్డి
కీర్తింపబడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే వైఎ స్ రాజశేఖర్‌రెడ్డి
హంద్రీనీవాకు అనం త వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్ర వంతి ప్రాజెక్టుగా
పేరుపెట్టారని గుర్తు చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో అనంత
వెంకటరెడ్డి 12వ వర్థంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
జరుపుకున్నాయి.పార్టీ నగర అ ధ్యక్షుడు రషీద్ అహ్మద్ అధ్యక్షతన
జరిగిన వర్థంతి సభకు మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కష్టం... న
ష్టం.. ఓడినా.. గెలిచినా కాంగ్రెస్ జెం డా అండగా ఉంటుందనే సిద్దాంతాన్ని
నమ్మిన నాయకుడు అనంత వెంకటరామిరెడ్డిఅన్నారు. జిల్లా అభివృద్దికి అ
నునిత్యం పాటుపడిన రాజకీయ నా యకుడిగా అనంత వెంకటరెడ్డి చెరగని ముద్ర
వేసుకున్నారన్నారు. అన్ని వ ర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కో సం ఆయన కృషి
చేశారన్నారు. డీసీసీ భవనం ఎస్కేయూనివర్శిటీ, ప్రభుత్వ వైద్య కళాశాల, కరువు
నివారణ పథ కం తీసుకురావడంలో అనంత వెంకటరెడ్డికృషి
చిరస్మరణీయమన్నారు.ప్రజాసేవే పరమావధిగా రాజకీయాలు నెరపిన నాయకుడిగా అనంత
వెంకటరెడ్డి ని కొనియాడారు. గాంధేయవాధిగా అభివర్ణించారు.
No comments:
Post a Comment